మిత్రపక్షమే ముంచేస్తోంది..! టీఆర్ఎస్ కు ఎంఐఎం షాక్ లే షాక్ లు

గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ ప్రజలతో పాటు రెండు తెలుగురాష్ట్ర ప్రజలకు ఒక ఆసక్తి ఉండేది. టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీలు స్నేహపూర్వక పోటీ అనుకొని ప్రత్యర్థులుగా తలపడితే ఎటువంటి సవాళ్ళు విసురుకుంటారు అని వేచి చూశారు. అయితే వారు అనుకున్న దానికన్నా ఎక్కువ మజానే ఎంఐఎం వారు అందిస్తున్నారు…

 

గ్రేటర్ రగడ షురూ…

గ్రేటర్ పంచాయితీ రెండు పార్టీల నేతల మాటలతో ముదిరిపోయింది అని చెప్పాలి. టిఆర్ఎస్, ఎంఐఎం ఎవ్వరూ కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక ప్రభుత్వంపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన కీలక ఆరోపణలు ఇప్పుదు బాగా వైరల్ అవుతున్నాయ్యి. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ గత ఆరేళ్లలో అభివృద్ధి ఎక్కడ చేసిందంటూ వారిపై మండిపడ్డారు. అనూహ్యంగా అతను హుస్సేన్ సాగర్ వ్యవహారాన్ని తెరమీదకి తెచ్చాడు.

సమాధులే లేపేస్తామన్నారు…?

గతంలో 4700 ఎకరాలు ఉన్న హుస్సేన్ సాగర్ ఈ రోజు ఏడు వందల ఎకరాలు కూడా లేదని ఆరోపించారు. దీన్ని అంతా ఎవరు కాజేశారు అని ప్రశ్నించాడు. అంతేకాకుండా ప్రభుత్వం ఆ మాయమైపోయిన స్థలంలో అక్రమ కట్టడాలు కట్టింది అన్నట్లుగా ఆరోపించారు. ఇక అక్రమకట్టడాల లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ చేసిన పనులు అత్యంత ఘోరంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏకంగా పివి ఎన్టీఆర్ సమాధులని కూడా వారు కూల్చాలనుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయలేదని గుర్తు చేశాడు అక్బరుద్దీన్.

బాధితుల కడుపు కొట్టారు?

అంతటితో ఆగకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ తోక ఎలా తొక్కలో తమకు బాగా తెలుసు అని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్బరుద్దీన్ భారీ వర్షాలకు వరద బాధితులకు సహాయం అందిస్తామని చెబితే అందులో ఐదు వేల రూపాయలు అధికారులకు కాజేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వరదల్లో ఇబ్బంది పడిన వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందకపోవడం ఏమిటని ప్రశ్నలు సంధించారు.

ఇక మిత్రపక్షమే కదా పోటీ సరదాగా ఉంటుందని అనుకుంటే అక్బరుద్దీన్ కాస్తా టిఆర్ఎస్ పార్టీ లోపాలను ఎత్తి చూపడం తో గులాబీ క్యాడర్ అంతా అయోమయంలో పడింది. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ రెండు పార్టీ మధ్య ఉండే సంబంధం దానివల్ల మారే రాజకీయ సమీకరణాల ఎలా ఉంటాయన్న విషయంపై అనేక చర్చలు జరుగుతున్నాయి

SHARE