NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Mamata Banerjee: పోరాడే గుండె.. లేడీ ఫైటర్..! మమతా బెనర్జీ బయోగ్రఫీ దేశం మొత్తం చదవాల్సిందే..!!

Mamata Banerjee: Complete Biography of Indian Lady Fighter

Mamata Banerjee: ఆమె చరిత్ర తెలుసుకుంటే నరాలు నిలబడతాయి.. ఆమె రాజకీయం వింటే గుండె గట్టిబడుతుంది.. ఆమె తెగువ చూస్తే రక్తం ఉప్పొంగుతుంది.. ఆమె పోరాటం తీరు తెలిస్తే కాళ్ళు కదులుతాయి..! “ఒంటిపై ఒక్క నగ ఉండదు – తళుకుల చీర ఉండదు – భుజాన ఓ సంచి.. తెల్లని చీర.. నడకలో ధీరత్వం – నడతలో తెగువ.. మాటలో నిప్పుకనిక.. మనకు తెలిసిన మమతా బెనర్జీ ఈమె. మూడు సార్లు ముఖ్యమంత్రి.. వరుసగా గెలుపులు.. పోరాటాలు అంత వరకే అందరికీ తెలుసు కానీ… మమతా అంటే ఎంత ప్రత్యేకమో తెలుసా..!? మమతా రాజకీయ జీవితంలో ఎత్తూ పల్లాలు తెలుసా..!?

“పశ్చిమ బెంగాల్ వంటి ఒక పెద్ద రాష్ట్రంలో 2011 నుండీ ఒక మహిళ అధినేత్రిగా ఉన్న పార్టీ వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేసున్నది .. ఒక మహిళ సీఎం అవుతున్నారు అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి. కొన్ని బయటకు తెలియని కఠోరాలు, కాఠిన్యాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..!

Mamata Banerjee: Complete Biography of Indian Lady Fighter
Mamata Banerjee Complete Biography of Indian Lady Fighter

Mamata Banerjee: మీకు తెలుసా.. మొదటి పోటీనే ప్రత్యేకం.. చారిత్రకం..!!

మమతా బెనర్జీ ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. 1984 లో పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలు అంటే ధడ. వారికి ఎదురుగా నిలబడే సాహసం ఎవ్వరికీ లేదు. దేశం మొత్తం కాంగ్రెస్ అధికారం ఉన్నా.., పశ్చిమ బెంగాల్లో మాత్రం వామపక్షాలదే అధికారం. అటువంటి రాష్ట్రంలో 1984 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ లో వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన వామపక్ష దిగ్గజ నాయకుడు సోమనాథ ఛటర్జీ మీద పోటీ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద పెద్ద నేతలే వెనకడుగు వేస్తుంటే మమతా బెనర్జీ పోటీకి ముందుకొచ్చారు. కాంగ్రెస్ అంగీకారంతో తనకు ముప్ఫయి ఏళ్ళు నిండకుండానే ఎంపీగా పోటీ చేశారు. ఇంటింటికీ వెళ్లారు. మహిళలతో ముచ్చటించారు. పేదోళ్లలో పేదరాలిగా కలిసిపోయారు. ప్రత్యర్థులకు, సొంత పార్టీకి అంతుబట్టని విధంగా ఆ ఎన్నికల్లో మారుమూలల్లోకి వెళ్లి ప్రచారం చేశారు.

* ఆ ఎన్నికల్లో మమతకు 3,31,618 అంటే 50.87 శాతం ఓట్లు వచ్చాయి. సోమనాథ ఛటర్జీకి 3,11,958 ఓట్లు వచ్చాయి. ఆ లోక్ సభలో అత్యంత పిన్న వయస్కురాలిగా మమతా రికార్డు సృష్టించారు. అలా ఆమె దేశం దృష్టిలో పడ్డారు. అక్కడ నుండి మమతా మార్క్ మొదలయింది.

Must Read: ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఓడినట్టా..!? బలం పెరిగినట్టా..!? 

Mamata Banerjee: Complete Biography of Indian Lady Fighter
Mamata Banerjee Complete Biography of Indian Lady Fighter

* కానీ ఆ తర్వాత ఎన్నికల్లో 1989 లో జాదవ్ పూర్ నుండి ఓడిపోయారు. కానీ పోరాటం ఆపలేదు. 1991 లోక్ సభ ఎన్నికల నుండి 2009 వరకు అంటే వరుసగా ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె కోల్ కట సౌత్ పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచారు. ఆమె వయసు 54 ఏళ్ళు వచ్చే సరికి ఏడు సార్లు ఎంపీగా పని చేసారు. పాతికేళ్ళు లోక్ సభ సభ్యురాలిగా రాజకీయ జీవితంలో గడిపారు. అక్కడితో ఆగిపోలేదు..!

మమతా మొండి పోరాటం ఎలా మొదలయిందో తెలుసా..!?

మమతా బెనర్జీ పీజీ చదివారు. లా కూడా చదివారు. పెళ్లి చేసుకోలేదు. రాజకీయాలంటే మక్కువతో పాతికేళ్ల వయసులోనే కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. 1976 లో ఆమె వయసు 21 ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నాలుగేళ్లు పని చేశారు. 1984 లో గెలుపు.. 1989 లో ఓటమి.. 1991 నుండి కోల్ కటా నుండి వరుస గెలుపులతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎదిగారు.

* 1977 నుండి బెంగాల్ లో జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వమే వరుసగా అధికారంలోకి వస్తుంది. హింస ఎక్కువ. రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగేవి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలదొక్కుకోడానికి కూడా ఇబ్బంది పడేది. ఆ సమయంలో మమతా బెనర్జీ ఓ పెద్ద పోరాటమే చేశారు.

Mamata Banerjee: Complete Biography of Indian Lady Fighter
Mamata Banerjee Complete Biography of Indian Lady Fighter

మరణం అంచుల వరకు వెళ్లి..!!

1993 94 మధ్య పశ్చిమ బెంగాల్ లో పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేక ఆర్ధిక మండళ్లు (సెజ్) ల పేరిట బలవంతపు భూ సేకరణ జరిగేది. ఆ సమయంలో కాంగ్రెస్ కి ఆ రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న మమతా పై హత్యా ప్రయత్నం జరిగింది. తలపై దారుణంగా నరికేసి, ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. దాదాపు పాతిక కుట్లు పడ్డాయి. ఆ చావు నుండి బయటపడిన తర్వాత ఆమె మరింత మొండిగా పోరాడడం ఆరంభించారు.

* 1996 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించి ఆ రాష్ట్రంలో మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ 80 సీట్లకి పైగా గెలుచుకునేలా చేసారు. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చి. 1998 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

* ఇక కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్ కి 2001 ఎన్నికల్లో 60 సీట్లు, 2006 ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు గెలుపొందారు. పార్టీ పెట్టి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేయలేదు. మొండిగా పోరాడారు. పేదలకు అండగా నిలబడ్డారు. ప్రతీ సమయాసకు రోడ్డెక్కడం.. అవసరమైతే అరెస్టవడం, ఎంతకైనా తెగించేవారు. ఆ పోరాటంతో ప్రజల్లో బాగా పేరు తెచ్చుకున్నారు.

* 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కి 184 స్థానాలొచ్చాయి. దీంతో ఆమె ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ముఖ్యంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 211 సీట్లు గెలుచుకుని వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ వంటి పెద్ద రాజకీయ వ్యవస్థతో పోరాడి 200 కి పైగా గెలిచి దేశం గర్వించదగిన మహిళగా నిలిచారు..!!పోరాడే గుండె.. లేడీ ఫైటర్..! మమతా బెనర్జీ బయోగ్రఫీ దేశం మొత్తం చదవాల్సిందే..!!

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju