Mamatha Banerjee: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం..! సువెందు అధికారి – మమతా ఇద్దరూ అరెస్టు..!?

Mamatha Banerjee: Suvendhu - Mamatha both will arrest
Share

Mamatha Banerjee: సువెందు అధికారి పేరు ఈ మధ్య జాతీయా స్థాయిలో బాగా వైరల్ అయింది.. గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ లోకి కూడా వచ్చింది.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం గెలిచినా మమతని నందిగ్రామ్ లో మాత్రం ఓడించారు. దీంతో సువెందు అధికారి పేరు దేశ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.. నిన్న బెంగాల్ రాజకీయాల్లో ఓ ట్విస్టు చోటు చేసుకుంది. అక్కడ ఎప్పటి నుండి రాజకీయ అంశంగా మారిన శారదా చిట్స్ కుంభకోణం కేసులో మమతా క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులు అరెస్టయ్యారు. సో.. ఇదే కేసులు ఇంకొన్ని అరెస్టులు తప్పవని సమాచారం. ఇదే కేసులో తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమెపై గెలిచిన సువెందు అధికారి ఇద్దరూ ఒకే కేసులో సీబీఐ మెట్లు ఎక్కనున్నారు.  నారదా స్కాండిల్ కేసులో ఇప్పటికే ఇరుక్కున్న ఈ ఇద్దరినీ సీబీఐ విచారణకు పిలవనున్నారు. ఈ కేసుని సీబీఐ విచారణ వేగవంతం చేసింది..

Mamatha Banerjee: Suvendhu - Mamatha both will arrest
Mamatha Banerjee: Suvendhu – Mamatha both will arrest

Mamatha Banerjee: సువెందు అరెస్టు ఎందుకంటే..!?

నిజానికి సువెందు అధికారి బీజేపీ మనిషి. మొన్నటి ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతని ఓడించడం ద్వారా బీజేపీకి వెన్నెముకగా మారారు. అటువంటి సువేదు అధికారిని అరెస్టు చేస్తే సీబీఐ కేసు విచారణ జాగ్రత్తగా.., నిస్పక్షపాతంగా జరుగుతుంది అనే బిల్డప్ ప్రజల్లో నాటుకుంటుంది. అందుకే ఇదే కేసులో మమతా బెనర్జీని అరెస్టు చేసే సంకేతాలున్నాయి. ఆమెనూ, సువెందుని ఒకేసారి అరెస్టు చేయాలనేది ఒక రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు. సువెందు గతంలో తృణమూల్ లో ఉన్నారు. అప్పట్లోనే నారదా స్కాండిల్ కుంభకోణం జరిగింది. ఆ కేసులో ఆయన కూడా ఒక ముద్దాయిగా ఉన్నారు. పార్టీలో కీలక స్థానానికి ఎదిగారు. గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ వీడి బీజేపీలోకి వచ్చిన తర్వాత మమతతో ఛాలెంజ్ చేసి, ఆమెపై పోటీ చేసి గెలిచారు. సో.. ఇదే బలంలో ఉన్నప్పుడే బీజేపీ నేతని కూడా సీబీఐ అరెస్టు చేసింది అందుకే మమతని కూడా చేస్తుంది.. మాకేమీ సంబంధం లేదు. “చట్టం తప్ప పని తానూ చేసుకుపోతుంది, మా నాయకుడిని కూడా అరెస్టు చేసాము” అని పొలిటికల్ కవరింగ్ ఇవ్వడం ద్వారా తప్పించుకునే క్రమంలో బీజేపీ ఆరితేరింది.

Mamatha Banerjee: Suvendhu - Mamatha both will arrest
Mamatha Banerjee: Suvendhu – Mamatha both will arrest

ఏమిటీ కేసు..? ఏం జరుగుతుంది..!?

దేశంలోని చాలా మంది ప్రాంతీయ పార్టీ అధినేతలపై అవినీతి కేసులున్నాయి. కొన్ని విచారణల్లో ఉన్నాయి, కొన్ని స్టేలపై ఉన్నాయి. కొన్ని బెయిల్ పై ఉన్నాయి. జగన్ సహా చంద్రబాబు, మమతా బనెర్జీ, లాలూ, శరద్ పవార్, వంటి అనేక మంది దీనిలో బాధ్యులే. సీబీఐ కేసులు, ఇతర కేసుల్లో ఉన్నవారే. మమతపై రెండు కేసులున్నాయి. నారదా స్కాండిల్ తో పాటూ రోజ్ వాలీ చిట్స్ లో మమతా తో పాటూ తృణమూల్ కాంగ్రెస్ నేతల చాల మంది ప్రమేయం ఉంది అంటూ సీబీఐ విచారణ ఆరంభమయింది. దాదాపు రూ. 25 వేల కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది ఈ కేసు సారాంశం. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో పక్కకు వెళ్లిన ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.


Share

Related posts

పవన్ ని ముంచుతున్నదెవరు…? కాపులా..? ఫ్యాన్సా…?

Srinivas Manem

Breaking News: రఘురామకష్ణంరాజు కేసులో ఏబీఎన్ ఛానల్ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!!

P Sekhar

Sunil Deodhar: జగన్ బెయిల్ ను సునీల్ దియోధరే రద్దు చేయిస్తారా..? బీజేపీ చేస్తోందిదా..?

Muraliak