NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు (పార్ట్ – 2)

టీటీడీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి

టీటీడీలో వివాదాలు… పాలనా లోపాలను నిన్న మొదటి భాగంలో చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా ఏ భాగంలో మరిన్ని వివాదాలు, లోపాలను చర్చించాల్సి ఉంది.

* తిరుమల శ్రీవారికి ఉన్న పింక్ డైమండ్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి, ఏ వి రమణ దీక్షితులుపై టీటీడీ వేసిన వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా కు సంబంధించి పాలక మండలి తీర్మానం చేసి ఆ కోర్టును విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. నెంబర్ 0S 264/2018 మీద 5th అడిషనల్ కోర్ట్ తిరుపతి వారికీ రెండు కోట్ల రూపాయల ఫీజు సొమ్ము వెనక్కి రాలేదు. దీనిపై ప్రజాసంఘాలు ఆ కేసును ఎందుకు వాపసు తీసుకునున్నారు.?? ఎలా ఉపసంహరించుకున్నారు దాని గల కారణాలు చెప్పాలని… పింక్ డైమండ్ విషయం నిజాలు తేలకుండా ఎలా కేసు విత్ డ్రా చేస్తారని?? ఆందోళన నిర్వహించారు.. దీనిపై ఉన్నతాధికారుల నుంచి సమాధానం శూన్యం..!

* శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో విఐపి బ్రేక్ దర్శనాలు రూ 10 వేలకు పెంచడం పెద్ద వివాదం అయింది.. సిఫార్సు లేఖలను తీసుకోమని.., వీఐపీలు ఎవరైనా సరే శ్రీవాణి దర్శనం టిక్కెట్లు ద్వారా దర్శనాలు చేసుకోవాలంటూ, ప్రకటించారు. ఇది టీటీడీ అధికారులు వ్యాపారాత్మక ధోరణితో ప్రవేశపెట్టిన పథకం అని దుయ్యబట్టారు.. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది..!

* తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ లకు మంగళం పాడటం వివాదానికి దారి తీసింది. కాలినడకన వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూ తో పాటు పది రూపాయల చొప్పున రెండు లడ్డూలు. మరో రెండు 25 రూపాయల చొప్పున ఇచ్చేవారు. అంటే ఐదు లడ్డూలు కలిపి 70 రూపాయలకు వచ్చేవి. దీన్ని తొలగించి ఒకే ఒక లడ్డూ ₹50 పెంచడం పెద్ద వివాదం అయింది. ఎవరైనా అడిగితే ఇష్టానుసారం లడ్డూలు ఇస్తామని చెప్పడం వల్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సాధారణ భక్తులకు ఇచ్చే రాయితీలు లడ్డూలు టిటిడి భారం ఎలా అవుతాయి అవి ఆందోళన నిర్వహించడంతో టీటీడీ పునరాలోచనలో పడింది..!

Read also Part 1 >>> వైవీ 14 నెలలు..! అనేక వివాదాలు..! టీటీడీలో ఇదేమి చిత్రం..!! పార్ట్ – 1

* స్వామి వారి ఉత్సవ విగ్రహాలు కరిగి పోతున్నాయని దీనివల్ల రోజు వారి నిర్వహించే కొన్ని సేవలను నిలిపివేయాలని భావిస్తున్నామని కొన్ని లింకులు బయటకు రావడం దుమారం రేపింది. రంగంలోకి దిగిన కొన్ని రాజకీయ పార్టీలు దీనిని పెద్దవి చేసాయి, ఆగమ శాస్త్ర సలహాలు లేకుండా ఏకపక్షంగా ఇలాంటి సున్నితమైన అంశాలను అధికారులు ప్రకటించడం ఏమిటంటే కొందరు నిలదీశారు. దాతలను అడిగితే స్వామి వారికి మంచి విగ్రహాలు లభ్యమవుతాయని వాటికి సరైన క్రతువు నిర్వహించి సేవలను పునరుద్ధరించాలి తప్ప విగ్రహాలు కరిగిపోతున్నాయి అనే భావనతో సేవలను నిలిపి వేయడం తగదు అంటూ కొందరు వాదనను తెరపైకి తెచ్చారు.. దీనిపై కొందరు బోర్డు సభ్యులు కలగజేసుకుని అలాంటిదేమీ లేదని మీడియాకు చెప్పాల్సి వచ్చింది..!

* శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి కి అలిపిరి టోల్గేటు వద్ద కు వచ్చి మరీ అర్చకులు ఆలయ అధికారులు స్వాగతం పలకడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. టీటీడీ చరిత్రలో ఏ స్వామికి.. విఐపి కు ఇలాంటి స్వాగతం లేదని. దీంతో పాటు స్వరూపానందేంద్ర స్వామి తో మహాద్వారం గుండా కొందరు మీడియా అధిపతులు వీఐపీలు కూడా వెళ్లారని ఇది మంచి సంప్రదాయం కాదని ప్రజా సంఘాలు సోషల్ మీడియా వేదికగా చర్చలేవదీసి సాయి. ఈ వ్యవహారంలోనూ కొందరు ఆలయ సిబ్బంది పై చర్యలు తీసుకొని దాన్ని వదిలేశారు.

* టీటీడీకు చెందిన 24 నిరర్ధక ఆస్తుల ను వేల వేస్తామని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా అదే పెద్ద వివాదం అందరికీ తెలిసిందే.., దీనిపై లీకులకు కారణమైన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. * టిటిడి నిధుల నుంచి దేవాదాయ శాఖకు ఏకంగా కార్పస్ ఫండ్ పేరుతో రూ 66 కోట్లను కేటాయించడం కూడా వివాదం అయింది.. ఎన్నడూ లేనట్లుగా ఎండోమెంట్ అర్చక శాలరీస్ కు టిటిడి నిధుల నుంచి 16 కోట్లను కేటాయించడంపై నిపుణులు మండిపడ్డారు. దీంతో కార్పస్ ఫండ్ను టిటిడి నిలిపివేయాల్సి వచ్చింది. * ఎస్ వి బి సి వివాదం తెలిసిందే.. చైర్మన్ గా నియమింపబడిన పృధ్వీరాజ్ చేసిన రాసలీలలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.. అయితే అంతకు ముందే పృథ్వీరాజ్ సుమారు ఎనిమిది మందిని ప్రత్యేకంగా నియమించి వారికి ఐడి కార్డు ఇవ్వడం కూడా సంచలనం అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కల్యాణ లడ్డూలు కోతలు.., హథీరాంజీ మఠం భూములు.., అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు.., అర్చకుల మధ్య వెలుగుచూసిన వివాదాలు., బ్రహ్మోత్సవ బహుమానం ఆలస్యం కథలు., ఉద్యోగాల నియామకం అంటూ చేసిన ఆలస్యాలు., ఇలా చాలా వస్తాయి..! ఈ వివాదాలు అన్నింటికీ పెద్ద కారణాలేవీ కనిపించవు.! కాస్త నిర్లక్ష్యం ఇంకాస్త నిర్లిప్తత మాత్రమే..!

ముందే ఎందుకో ఈ రగడ..!!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా టిటిడి పాలకమండలి వ్యవహరించకపోతే వీటి నివారణ సాధ్యమే.. ప్రతి నిర్ణయంపై పాలకమండలి పర్యవేక్షణ ఉంటే చాలా వరకు భక్తుల మనోభావాలను పరిరక్షించుకోవచ్చు.. నిర్ణయం అయిపోయాక లీకులు బయటకు వచ్చాక భక్తులు బాధ పడిన తర్వాత వాటికి ఆయింట్మెంట్ రాసే కంటే ముందుగానే మేల్కొని ఏ రకమైన నిర్ణయాలను భక్తులు మెచ్చేలా తీసుకుంటే టిటిడి ప్రతిష్ట మరింత ఇనుమడింపజేస్తుంది..

హర్షించే నిర్ణయాలు ఉన్నాయ్ ..!!

టీటీడీ పాలక వర్గం తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం వివాదాస్పదంగా మిగల లేదు కొన్ని చరిత్ర సృష్టించిన నిర్ణయాలను బోర్డు తీసుకుంది. ముఖ్యంగా కరోనా కాలంలో టిటిడి వ్యవహరించిన తీరు అద్భుతమనే చెప్పాలి. స్వామివారి ఆలయాన్ని సకాలంలో మూసివేయడం దాని తర్వాత సేవా కార్యక్రమాలకు టిటిడి ఉపయోగపడటం చారిత్రాత్మక అంశం. దీనిపై బోర్డు ఏకపక్షంగా వ్యవహరించి కరోనా కాలంలో కచ్చితంగా స్వామివారి ప్రసాదాలను ఆపన్నులకు అందించాలని… అలాగే టీటీడీ భవనాలను కరోనా ట్రీట్మెంట్ కు నిలయాలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయం అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక టిటిడి ను కాగ్ పరిధిలోకి తీసుకురావడం అత్యంత అభినందనీయమైన అంశం. ఇప్పటివరకు టీటీడీ కు ఆడిట్ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నే సాగుతోంది. దీనివల్ల అనేక లోపాలు బయటకు రావడం లేదు.. స్వామివారి నిధులకు రక్షణ లేకుండా పోయింది. కాగ్ పరిధిలోకి టిటిడి ను తీసుకు రావడం వల్ల స్వామివారి నిధులకు పారదర్శకత ఉంటుందనడంలో సందేహం లేదు.

Read also Part 1 >>> వైవీ 14 నెలలు..! అనేక వివాదాలు..! టీటీడీలో ఇదేమి చిత్రం..!! పార్ట్ – 1

ఇది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకొని అద్భుత నిర్ణయం. ఇక టీటీడీలో సాంప్రదాయబద్ధంగా వస్తున్న సన్నిధి గోళ్లను నియమించిన విషయం సైతం ఓ వర్గాన్ని ఆకట్టుకుంది. అలాగే గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన ఓ అర్చక పెద్ద ను సాధారణ సాయి గా మార్చడం లోనూ పాలకవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉందనే చెప్పాలి. స్వామి వారి ఆస్తులు వివరాలన్నీ శ్వేతపత్రం విడుదల చేస్తామని. ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి అనేది ప్రజలకు తెలుసుకునేలా వెబ్సైట్ రూపకల్పన చేస్తామని చెప్పడం అందరి మన్ననలు అందుకుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న 1300 కోట్ల టిటిడి నిధులను వెంటనే విడుదల చేసి జాతీయ బ్యాంకుల్లో పెట్టడం శభాష్ అనిపించుకుంది..!

author avatar
Special Bureau

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N