NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి – పునీత్ రాజ్ కుమార్..! మరణానికి ముందు చివరి గంటలో..!!

Mekapati Goutham Reddy: Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar

Mekapati Goutham Reddy: ఒక్క మరణం రాష్ట్రాన్ని నిశ్శబ్దం చేసింది.. ఒక్క మరణం రాష్ట్ర రాజకీయాన్ని నివురు గప్పింది.. ఒక్క మరణం రాష్ట్రంలో నేతలకు మౌనం నేర్పింది.. ఒక్క మరణం ఎందరో నేతలకు, ఎందరో పెద్దలకు పాఠంగా మారింది.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) విషయంలో అసలేం జరిగింది..!? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఫిట్ గా ఉంటూ.. కండలు తిరిగిన వీరుడుగా.., ఆరడుగుల ఆజానుబాహుడిగా.., నిత్యం హుషారుగా.. వివాద రహితంగా ఉండే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా ఎలా మరణించారు..!? దుబాయ్ బిజినెస్ ఎక్స్పో లో పాల్గొని.. నిన్న వచ్చి.. రాత్రి ఒక పెళ్లి వేడుకలో పాల్గొని.. మళ్ళీ ఉదయాన్నే జిమ్ కి వెళ్తుండగా ఏం జరిగింది..!? మంత్రి మరణానికి ముందు చివరి 90 నిమిషాల అప్డేట్ ఇది..!!

Mekapati Goutham Reddy: కాస్త ఆలస్యంగా లేచారు.. కానీ..!

గౌతమ్ రెడ్డి ప్రతీరోజు 5.30 గంటలకే నిద్ర లేస్తారు. లేచిన వెంటనే కాఫీ తాగి వ్యాయామానికి వెళ్తారు. కానీ ఈ రోజు మాత్రం గౌతమ్ కాఫీ తాగలేదు. రాత్రి నిద్రం పోవడం ఆలస్యం కావడంతో ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచారు. అనంతరం జిమ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా.., అలసటగా.., ఛాతి నొప్పిగా ఉండడంతో ఈరోజు ఉదయం 7. 20కి ఇంట్లోనే సోఫాలో వచ్చి కూర్చుని.. వెంటనే రెండు నిమిషాల్లోనే అక్కడే కుప్పకూలిపోయారు. చెమటలు పట్టడం గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం అందించి, వైద్యులకు ఫోన్ చేసి.. వారి సూచనతో ఆయన్ను అపోలోకి చేర్చారు. ఆ తర్వాత డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. కానీ అవేవీ ఫలించలేదు. సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు చికిత్స అందించిన అపోలో వైద్యులు ధృవీకరించారు. ఇంట్లో పని మనిషి ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే..

Mekapati Goutham Reddy: Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar
Mekapati Goutham Reddy Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar

కాగా.. ఉదయం 7:30 గంటలకు జిమ్‌కు వెళ్దామని సిద్ధమయ్యారని.. కానీ ఛతోయ్ నొప్పితో అక్కడే పడిపోయారని తెలుస్తుంది.. 7 గంటలకు నిద్ర లేచారు.. జిమ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతూ.. అలసటతో 7.20 గంటల సమయంలో సోఫాలో కూర్చున్నారు. పనిమనిషి కాఫీ ఇచ్చినా వద్దని చెప్పి.. ఛాతి నొప్పిగా ఉండి , ఒళ్ళంతా చెమటలు పట్టడంతో గుండెను గట్టిగా పట్టుకుని అక్కడే కూర్చుండిపోయారు. వెంటనే గౌతమ్ ని గుర్తించిన పని మనుషుల, కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వైద్యులకు ఫోన్ చేయగా.. గుండెపోటు వచ్చిందని గుర్తించి.. ఆసుపత్రికి తరలించారు. 7.34 కి ఇంటి నుండి బయల్దేరి.. 7.48 సమయానికి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. సరిగ్గా 8.55 సమయంలో గౌతమ్ రెడ్డి మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. దాదాపు 75 నిమిషాల పాటూ ఆసుపత్రిలో ఆయనకు CPR చికిత్స చేసారు. ఇద్దరు కార్డియాలజిస్టులు చేరుకొని.. వైద్యం అందించే ప్రయత్నం చేసారు. అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు. ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9గంటల ప్రాంతంలో ఆయన చనిపోయిటన్లు ధృవీకరించారు. ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. అత్యవసరం విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని వైద్యులు ప్రకటించారు..!

Mekapati Goutham Reddy: Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar
Mekapati Goutham Reddy Same Deaths by Minister Goutham And Puneeth Raj Kumar

పునీత్ రాజ్ కుమార్ కూడా..!!

గౌతమ్ రెడ్డి ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. నిత్యం జిమ్ లో కనీసం 45 నిమిషాలు గడుపుతారు.. ఎక్కడ ఉన్నా జిమ్ లో వ్యాయామం చేయడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన శరీర సౌష్టవం కూడా అలాగే ఉంటుంది. చూసిన వెంటనే జిమ్ బాడీలా కనిపిస్తుంది. ఇదే కోవలోకి.. ఇదే వయసున్న కన్నడ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కూడా వస్తారు. ఈయన కూడా నిత్యం జిమ్ చేస్తారు. ఫిట్ గా ఉంటారు. గత ఏడాది అక్టోబర్ 29న ఉదయాన్నే జిమ్ చేస్తూ.. జిమ్ లోనే గుండెపోటుకు గురై మరణించారు. అదే సమయం.. అదే వయసు.. అదే తరహా అలవాటు.. అదే తరహా మరణం.. ఇప్పుడు ఫిట్నెస్ వర్గాలను కూడా ఆందోళనలోకి నెట్టేస్తుంది. కొత్త కలవరం సృష్టిస్తుంది..!

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju