NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Free COVID vaccine: ‘ఉచిత వ్యాక్సిన్’ విషయంలో మోడీ భయపడ్డారా? లేక భయపెట్టారా?

Narendra Modi: One Single Step by Modi in 2nd Wave

Free COVID vaccine:  భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వారి లీడర్లంతా వత్తాసు పలుకుతూ ఒకే మాటపై ఉంటూ దేశంలో ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ పట్టువదలకుండా ఉండడం అనేది మనం చాలా సార్లు గమనించాం. అది ఎన్ఆర్సి బిల్లు కావచ్చు మరే ఇతర విషయమైనా కావచ్చు… కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ దేశంపై పట్టు ఉంది అన్న ధైర్యంతో ఈ విధంగా వ్యవహరించడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఉచిత వ్యాక్సిన్ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వం కొంచెం జంకింది అంటారా?

 

modi fears of Free COVID vaccine announcement
modi fears of Free COVID vaccine announcement

ఒక్క డోసు రూ.400

ఈ విషయానికి వస్తే ముందుగా ఎన్నో కథనాలు ఉచిత వ్యాక్సిన్ పైన వచ్చాయి. వ్యాక్సిన్ ఒక డోసు నాలుగు వందల రూపాయలకు లభిస్తుందని… రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే వాటిని తయారీదారుల నుండి కొనుగోలు చేసి వారి ప్రజలకు ఉచితంగా ఇచ్చి ఆ అదనపు ఖర్చుని కూడా వారే భరించవలసి ఉంటుంది అని అన్నారు. ఇదే చివరి మాట చాలామంది ఫిక్స్ అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం ఒక వారంగా ప్రచారం జరుగుతున్నా క్లారిటీ ఇవ్వకపోవడంతో వ్యాక్సిన్ బాదుడు తప్పదు అనుకున్నారు జనాలు.

మీరు మాట తప్పుతారేమో… మేం కాదు

కట్ చేస్తే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా నిన్నటి రోజున 10 రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని నిర్ణయించారు. అస్సాం, బీహార్, ఛత్తీస్గర్ వంతి చిన్న రాష్ట్రాల క్యాబినెట్లు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. ముందు మోడీ దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ మాట ఇచ్చారని ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే తాము మాట మార్చే పార్టీ కాదని ముందు నుంచే మేము ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చాం కాబట్టి అదనపు ఖర్చు మా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రజలకు మాత్రం ఉచితంగా ఇచ్చి తీరుతామని ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నానా హైరానా పడిపోయినట్లు ఉంది.

అసలేమైంది?

అంతే… ఈ రోజున ఒక వ్యాక్సిన్ 150 రూపాయలు మాత్రమేనని… అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉచితంగా 50శాతం వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం జరుగుతుందని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించేసింది. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎంతో చర్చ జరుగుతున్నా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం వరుసగా పది రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్ ప్రకటించేసరికి ఇలా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే మన బిజెపి పెద్దలంతా బిజీగా ఉండి ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఆలస్యం జరిగిందా…. లేదా దేశంలో ఉన్న పరిస్థితి పై సమీక్ష వేసుకొని ఉన్నఫలంగా అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఈ ప్రకటన చేశారా అన్నది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. ఏదైతేనేం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది… అదే చాలు!

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk