మోదీ ఫిట్ నెస్ సీక్రెట్ బయటపడిపోయింది..!

విదేశీ ప్రయాణాలు…. ఉదయం సమావేశాలు…. రాత్రిపూట విమానాలు…. అర్జెంటు మీటింగ్లు ఇవన్నీ భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి అలవాటు. సెలవు రోజుల్లో పని చేయడం కూడా ఆయన ఎప్పటినుండో ఆనవాయితీగా మార్చుకున్నారు. అయితే వృద్ధ వయస్కుడైన మోడీకి ఇంతటి శక్తి ఎలా వస్తుంది? ఆయన ఎన్ని పనులు చేస్తున్న కూడా ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు అసలు కనిపించరు. అంత ఫిట్ గా మోడీ ఎలా ఉంటారు? అన్న ప్రశ్న చాలా మందిలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా తన సీక్రెట్ను ప్రధాని మోడీ బయటకు చెప్పేశారు.

 

Fit India Movement: PM Narendra Modi asks Virat Kohli about Yo-Yo test- The  New Indian Express

తాజాగా పలువురు ఫిట్నెస్ నిపుణులు, క్రీడాకారులతో కలిసి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటినుండి సరికొత్త నినాదం వినిపించింది. ఫిట్నెస్ కి దోస్.. ఆదా గంటా రోజ్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక వారిలో జాతీయ క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ జమ్మూకాశ్మీర్కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ ఆశిక్, పారా ఒలింపిక్ స్వర్ణ విజేత దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ అడగగా ఆయన స్పందించారు. ఆయనను ఆ ప్రశ్న వేసింది 55 ఏళ్ల వయసులో కూడా ఫిట్గా ఉండే ఒకప్పటి సూపర్ మోడల్ మిలింద్. తన తల్లి తనకు వారానికి రెండు సార్లు ఫోన్ చేస్తుందని మోడీ చెప్పడం గమనార్హం. తన యోగక్షేమాలు అడుగుతుంది అని…. ప్రతిసారీ తప్పనిసరిగా అడిగేది ఒకటే.. ఆహారంలో పసుపు ఉండేలా చూసుకుంటున్నావా అని మోదీ చెప్పారు. తగు మోతాదులో పసుపు తీసుకున్నావా అని అడిగితే నేను అవునని చెబుతాను అంటూ పసుపు యాంటీ బయోటిక్.. శరీరానికి చాలా మంచిది ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను అని మోడీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సూపర్ మోడల్ మిలింద్ మాట్లాడుతూ తన తల్లే తనకు స్ఫూర్తి అని చెప్పారు. 81 ఏళ్ల వయసులో కూడా ఆమె బస్కీలు ఎలా తీస్తుందో అందరూ వీడియోల్లో ఉంటారని…. ఆమె వయసు వచ్చేసరికి ఆమె అలాగే ఫిట్ గా ఉండాలని తన లక్ష్యమని చెప్పారు. ఒకప్పుడు రోజుకి 50 కిలోమీటర్లు నడిచేవారిని తన దృష్టిలో రోజుకు వంద కిలోమీటర్ల నడవడం కూడా పెద్ద కష్టం కాదని మిలింద్ అన్నారు. పట్టణాల్లో ఉండే వారితో పోలిస్తే పల్లెల్లో ప్రజలు చాలా ఫిట్ గా ఉంటారు.. అదే పనిగా కూర్చొని చలనం లేకుండా చేసే పని నగరవాసులకు ఆరోగ్యాన్ని దూరం చేస్తోందని చెప్పడం గమనార్హం.