NewsOrbit
బిగ్ స్టోరీ

న్యాయ వ్యవస్థే అసలు లక్ష్యం!

సుప్రీం కోర్టు ఒక రహస్య మందిరం అవ్వటం వల్ల ప్రజానీకానికి ఉన్న సమాచార ఆధారాలు మీడియా, న్యాయవాదులు మాత్రమే.

తుది తీర్పు వెల్లడించేవరకు మీడియాతో నర్మదా బచావో ఆందోళన్ గురించి మాట్లాడకూడదు అని ఆ వ్యాజ్యం దాఖలు చేసిన వారిని సుప్రీం కోర్టు 1997లో కట్టడి చేసింది.

1997 ఏప్రిల్ 11, 1998 నవంబర్ 5 తారీఖుల నాటి ఆ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ మేధా పాట్కర్ హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు, అరుంధతి రాయ్ తన ది గ్రేటర్ కామన్ గుడ్ పుస్తకంలో ఆందోళన్ కేసు గురించి చర్చించారు.

కోర్టు ధిక్కారం కింద అరుంధతి రాయ్‌ని కోర్టు ఈ విషయం మీద ప్రశ్నించినప్పుడు అమికస్ క్యూరీ ( కోర్టు స్నేహితులు అనే దానికి లాటిన్ పదం) గా కె.కె.వేణుగోపాల్ ని నియమించింది.

వేణుగోపాల్ ఫలవంతంగా అరుంధతి రాయ్ తరుపున ఈ కేసులో వాదించారు. వ్యాజ్యం దాఖలు చేసినవారిని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కట్టడి చెయ్యడం “ప్రజా ప్రాముఖ్యత ఉన్న విషయాల గురించి రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేఛ్చని వ్యతిరేకించడమే అవుతుంది” అని వాదించారు.

యాధృచ్చికంగా ప్రశాంత్ భూషణ్ అప్పుడు అరుంధతి రాయ్ తరపు న్యాయవాది.

ఇప్పుడు 2019కి వద్దాము.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2016లో అడ్వకేట్ జనరల్‌గా నియమించిన వేణుగోపాల్, ప్రశాంత్ భూషణ్ మీద కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు.

 

ఆ ధిక్కార చర్య ఏంటంటే భూషణ్ చేసిన ఒక ట్వీట్. ఆ ట్వీట్ లో ఎం.నాగేశ్వరరావుని కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ) తాత్కాలిక డైరెక్టర్ గా జనవరి 10 నాడు నియమించే విషయంలో అడ్వకేట్ జనరల్ కోర్టుని తప్పుదోవ పట్టించారు అని భూషణ్ ఆరోపించారు.

న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయం మీద తన “నిర్లక్ష్యపూరిత”, ప్రతీకారేచ్ఛ” ట్వీట్ల ద్వారా వ్యాఖ్యానించి కోర్టుకు కళంకం తెచ్చే విధంగా భూషణ్ ప్రవర్తించారు అని కోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో వేణుగోపాల్ పేర్కొన్నారు. అంతేకాక ఆ ట్వీట్లు ఆ కేసుని విచారిస్తున్న న్యాయమూర్తి ఏ.కె.సిక్రీ, అడ్వకేట్ జనరల్‌ల పరువుకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి అని కూడా పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ ఏ.కె.సిక్రీ (ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్‌కి బదులు), లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లిఖార్జున ఖర్గే సభ్యులుగా ఉన్న అత్యున్నత మండలి (High Powered Committee) జనవరి 10 సమావేశంలో రావుని కేంద్ర దర్యాప్తు సంస్థ మధ్యంతర డైరెక్టర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అని అడ్వకేట్ జనరల్ ఫిబ్రవరి 1నాడు పేర్కొన్నారు.

“రహస్యమైన” ఆ సమావేశం మినిట్స్ ని వేణుగోపాల్ కోర్టుకి సమర్పించారు. (ఇవి కూడా కేవలం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హా సభ్యులుగా ఉన్న ధర్మాసనం కి మాత్రమే పరిమితం). అవి సమర్పిస్తూ అత్యున్నత మండలి (High Powered Committee) రావుని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పారు.

మోదీకి ఖర్గే రాసిన లేఖల ఆధారంగా వేణుగోపాల్ బెంచ్‌ ముందు చెప్పిన మాటలను ప్రశ్నిస్తూ భూషణ్ ట్వీట్ చేశారు. రహస్య కవర్‌లో కల్పిత మినిట్స్ ని సమర్పించారు అని భూషణ్ అనుమానం వ్యక్తం చేశారు.

సీల్డు కవర్ లో సమర్పించిన అతి రహస్య వివరాల గురించి బాధ్యత ఎవరు తీసుకుంటారు?

అడ్వకేట్ జనరల్ గా ఉన్న వేణుగోపాల్ గత సంవత్సరం నవంబర్ నెలలో రఫేల్ కేసులో వివరాలని సీల్డ్ కవర్‌లో తనే అందిస్తూ కూడా ఆ సీల్డ్ కవర్ లో సమర్పించిన వివరాలకి బాధ్యత తీసుకోవాటానికి నిరాకరించారు.

ఆ సీల్డ్ కవర్‌ని కోర్టుకి అందచేస్తూ ఈ విధంగా పేర్కొన్నారు-“ ఈ సీల్డ్ కవర్ లో వివరాలు నాకు తెలియవు. ఎందుకంటే నేను ఈ కవర్ ని తెరవలేదు. కాబట్టి రేపు ఎప్పుడైనా ఈ వివరాలు బహిర్గతం అయితే నా కార్యాలయాన్ని ఎవరూ తప్పుబట్టటం నాకు ఇష్టం లేదు.”

ఇప్పటివరకు సీల్డ్ కవర్‌లో తప్పుడు సమాచారం అందించటం ద్వారా కోర్టుని తప్ప దోవ పట్టించిన ఉదంతం కనీసం ఒకటి ఉంది. అత్యున్నత స్థాయి న్యాయ అధికారి అయిన అడ్వకేట్ జనరల్ కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు దానికి బాధ్యత?

ఇటువంటి పరిస్థితుల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించిన వివరాల గురించి అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలని ప్రశ్నించటం సబబుగానే తోస్తుంది.

వేణుగోపాల్ గతం

అరుంధతీ రాయ్ తరుపునే కాకుండా ఇంకెంతో మంది తరుపున కూడా కోర్టు ధిక్కార కేసుల్లో వేణుగోపాల్ వాదించారు.  న్యాయమూర్తి మీదకి పాదరక్ష విసిరినందుకు కోర్టు ధిక్కార చట్టం కింద రెండు నెలలు కారాగార శిక్ష పడిన ఒక న్యాయవాది తరుపున 1981లో వాదించారు. అలా చెయ్యటం వల్ల ఆ న్యాయవాదికి వచ్చిన చెడ్డ ప్రచారం చాలు అని , హైకోర్టు అనవసరంగా ఆ విషయాన్ని పెద్దది చేస్తున్నది అని వాదించారు.

బాబ్రీ మసీదు కూల్చివేతకి సంబంధించి 1994లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, అప్పటికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరుపున వాదించారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది.

మొన్నీమధ్య కూడా మాజీ కలకత్తా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.కర్ణన్ కోర్టు ధిక్కార కేసులో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ముందు జరిగిన జగడంలో విచక్షణతో మాట్లాడింది వేణుగోపాల్ ఒక్కరే. కర్ణన్‌ని మర్యాదపూర్వకంగా పదవీ విరమణ చేయనివ్వమని వేణుగోపాల్ అడగగా, అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు.

అటార్నీ జనరల్‌గా కూడా సీనియర్ న్యాయవాది,కాంగ్రెస్ నాయకుడు అయిన కపిల్ సిబాల్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవటానికి అనుమతి నిరాకరించారు.

అలాంటప్పుడు ఇప్పుడు ఈ కోర్టు ధిక్కార కేసుని ఎందుకు నెత్తినేసుకున్నారు? ఆయన వేసుకోలేదు. ఎన్నికల సమయంలో చేటు చేసే ఇబ్బందికరమైన కేసుల గురించి మాట్లాడుతున్న న్యాయవాదుల నోళ్ళు మూపించగోరుతున్న మోదీ ప్రభుత్వం తరుపున బహుశా మాట్లాడుతున్నారు.

సైడ్ ట్రాక్

మామూలు వాదోపవాదాల ద్వారా భూషణ్, వేణుగోపాల్ చేస్తున్న పరస్పర విరుద్ధ వాదనలలో నిజ నిజాలని కోర్టు తేల్చేసి ఉండవచ్చు. ఒకవేళ భూషణ్ చెప్పింది తప్పే అయినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కారం కిందకి రాదు.

కానీ ఇక్కడే భూషణ్ మీద అల్ప ప్రతీకారేచ్ఛ స్పష్టంగా కనిపిస్తుంది.

వేణుగోపాల్ తన పద్ధతిలో భూషణ్ తప్పులని ఎత్తిచూపాల్సింది పోయి తనకి భూషణ్ మీద కేసు ముందుకి తీసుకుపోయే ఉద్దేశం ఏమి లేదు అని కోర్టుకి చెప్పారు. కానీ ఏదైనా కేసు న్యాయస్థానంలో ఉంటే దాని గురించి బహిరంగంగా న్యాయవాదులు మాట్లాడవచ్చా లేదా అనే విషయం మీద మార్గదర్శకాలు కావాలి అని కోరారు.

భూషణ్ మీద ధిక్కార వ్యాజ్యం దాఖలు చెయ్యటం ద్వారా కేంద్రం కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకుంది.

కేంద్రం తరపున మాట్లాడుతూ బి.జే.పి అంతరంగికుడు అయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భూషణ్ కి “ఇకముందు ఇటువంటి పనులు చెయ్యకుండా ఉండేందుకు శిక్షించాలి” అని చాలా ఉద్రేకంగా కోర్టుని ప్రార్ధించారు. ఈయనే కోర్టు ధిక్కారం కింద కేరళ బి.జే.పి నాయకులని విచారించడానికి అనుమతి నిరాకరించాడు.

“అటార్నీ జనరల్ భీష్మ పితామహుడు లాంటివాడు. భూషణ్ కి  శిక్ష పడటం ఆయనకీ ఇష్టం లేకపోవచ్చు. కాని అటువంటి న్యాయవాదులకి హెచ్చరికలా పనిచేసే శిక్ష పడాలని ఏను కోరుకుంటున్నా” అని కోర్టుకి చెప్పారు.

వేణుగోపాల్ కోర్టు ధిక్కార వ్యాజ్యం ఫిబ్రవరి 6న దాఖలు చెయ్యగా, ఫిబ్రవరి 7 నాటికి కోర్టు ఆ కేసుని వినటం, నోటీసులు జారీ చెయ్యటం జరిగిపోయింది. అదే రావు నియామకాన్ని ప్రశ్నిస్తూ భూషణ్ జనవరి 14నాడు వ్యాజ్యం దాఖలు చెయ్యగా ఫిబ్రవరి 1 నాటికి కాని కోర్టు ఆ వ్యాజ్యాన్ని వినలేదు. అది కూడా ముగ్గురు న్యాయమూర్తులు ఆ కేసు నుండి తప్పుకుని, ఒక కోర్టు నుండి ఇంకొక కోర్టుకి తిప్పిన తరువాతనే.

అరుణ్ మిశ్రా ముఖ్య న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం న్యాయవాదులు తాము వాదిస్తున్న కేసుల గురించి  వ్యాసాలు రాయవచ్చా, టీ.వీ ఇంటర్వ్యూలకి , చర్చలకి కూర్చోవచ్చా అనే విషయాల మీద మార్గదర్శకాలు తీసుకువస్తామని వెంటనే చెప్పింది.

పారదర్శక న్యాయవ్యవస్థ: కేవలం ఒక ఆదర్శమేనా?

ఈ నేపధ్యంలో పారదర్శక న్యాయవ్యవస్థ అనేది చేరుకుందాము అనే ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా ఇప్పటికీ అందనంత దూరంలోనే ఉన్నట్టు ఉంది.

2012లో సహారా వర్సెస్ సెబీ కేసులో వాదనలు నడుస్తున్న కేసుల గురించి ప్రచురించకూడదు అని మీడియా నోరు నొక్కేసే హక్కు రాజ్యంగ ధర్మాసనం తనకి తాను ఇచ్చుకుంది. ఒక విశిష్ట న్యాయవాది అయిన ఫాలీ నారిమన్ ఈ ప్రమాదకరమైన ప్రతిపాదనని తీసుకువచ్చారు. మరొక విశిష్ట న్యాయవాది అయిన వేణుగోపాల్  అటువంటి తప్పే మళ్ళీ చెయ్యమని ఇప్పుడు కోర్టుని రెచ్చకొడుతున్నారు.

సుప్రీం కోర్టు ఒక రహస్య మందిరం అవ్వటం వల్ల ప్రజానీకానికి ఉన్న సమాచార ఆధారాలు మీడియా (అందులోనూ కొద్ది మంది మాత్రమే కోర్టు వ్యవహారాలని కవర్ చేస్తారు), న్యాయవాదులు మాత్రమే.

క్రితం సంవత్సరం నలుగురు సీనియర్ న్యాయమూర్తులు- అందులో ఒకరు నేటి ప్రధాన న్యాయమూర్తి అయిన రంజన్ గోగోయ్- అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోయా కేసు విచారణలో వ్యవహరిస్తున్న తీరుపై మీడియా సమావేశంలో బహిరంగంగా మాట్లాడారు. అప్పటికి ఆ కేసు న్యాయస్థానం విచారణలోనే ఉంది.

న్యాయవాదుల నోళ్ళు మూయించే సుప్రీం కోర్టు ప్రయత్నం పూర్తిగా పొరపాటు పని. అలా చెయ్యటం అసమ్మతిని అణచివేసే ప్రభుత్వ ప్రయత్నాలకి అండగా మారే ప్రమాదం ఉంది.

అపూర్వ విశ్వనాధ్

రచయిత ఫ్రీలాన్స్ జర్నలిస్టు

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

 

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment