NewsOrbit
బిగ్ స్టోరీ

తర్కించే వారికిక తావు లేదు!

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద ఈడి కేసు నమోదు చేసింది; ఎన్ డి టి వి వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లు రెండు సంవత్సరాల పాటు పెట్టుబడి మార్కెట్లలో పాల్గొనకూడదు అని సెబీ ఆదేశించింది. అలాగే ఎన్‌డి టివి డైరక్టర్ పదవి నుండి వారిని తొలగించింది; ప్రముఖ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ లాయర్స్ కలెక్టివ్, విదేశీ నిధుల స్వీకరణకి సంబంధించిన నియమాలను ఉల్లంఘించింది అంటూ  గ్రోవర్ మీద సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది; ముప్పై ఏళ్ళ కిందటి కేసులో ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్‌లకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టింది అని రాపర్ (రాప్ అనేది సంగీతం లో ఒక కళా ప్రక్రియ) హార్డ్ కౌర్ మీద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ ద్రోహం కేసు నమోదు చేసింది. కొద్ది రోజుల ముందు యోగి ఆదిత్యనాథ్‌కి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారని పాత్రికేయులు ప్రశాంత్ కనోజియ మీద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆయన ఇప్పుడు జామీను మీద విడుదల అయ్యారు. హార్డ్ కౌర్ బ్రిటన్ లో ఉంటారు కాబట్టి బతికిపోయారు. ఇండియాలో కనుక ఉండిఉంటే ఈ పాటికి ఊచలు లెక్కపెట్టుకుంటూ ఉండేవారు.

పైన పేర్కొన్న వాటిలో మొదటి మూడు ఘటనలలో స్వతంత్ర సంస్థలు తీసుకున్న ఆ చర్యలలో ప్రభుత్వానికి ప్రత్యక్ష ప్రమేయం లేదు. ఈడి, సెబి, అన్నిటికన్నా ఎక్కువగా న్యాయ వ్యవస్థ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణకి వెలుపల స్వతంత్రంగా పని చెయ్యాలి. అందువలన ఫలానా విధంగా చర్యలు తీసుకోమని వారిని ఎవరో ఆదేశించారనడం తప్పవుతుంది. అంతే కాక పైన పేర్కొన్న వారు నిజంగా నేరం చేసుంటే వారి మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పటం కూడా అవివేకం అవుతుంది.

కానీ అంతే నిజమైన విషయం ఏమిటంటే రాఘవ్ బహాల్, రాధికా రాయ్, ప్రణయ్ రాయ్, సంజీవ్ భట్‌లు వేరువేరు పద్ధతుల్లో నరేంద్ర మోదీ గురించి, ఆయన ప్రభుత్వం గురించి విమర్శనాత్మకంగా ఉంటున్నారు. రాఘవ్ బహాల్ విషయానికి వస్తే ఒకప్పుడు నరేంద్ర మోదీ మద్దతుదారుడిగా ఉన్న ఈయన క్రమక్రమంగా మోదీ ప్రభుత్వ విధానాలని తీవ్రంగా విమర్శించడం మొదలపెట్టారు. ఎన్‌డి టివి సమతుల్యత పాటించే ఛానల్. అప్పుడప్పుడు మితవాద వర్గాలకి మద్దతుగా ఉంటూ వస్తున్నా కూడా స్నేహపూర్వకంగా ఉండని ‘ల్యూటెన్స్ గుంపు’ లో భాగంగానే దానికి గుర్తింపు. సంజీవ్ భట్ విషయానికి వస్తే 2002 గుజరాత్ మారణకాండలో మోదీ పాత్ర గురించి ఆయన ప్రశ్నలు లేవదీస్తూ ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు.

రాధికా రాయ్, ప్రణయ్ రాయ్, రాఘవ్ బహాల్ ల మీద చర్యలు తీసుకునే విషయంలో ఈడి, సెబీ మహా చురుకుతనం చూపాయి. సంజీవ్ భట్ కేసులో కూడా న్యాయస్థానం అంతే వేగంగా కదిలింది. అయితే 2001-2016 మధ్యలో గుజరాత్‌లో చోటు చేసుకున్న 180 కష్టోడియల్ మరణాలకి సంబంధించి రాఘవ బహాల్‌కు తప్ప ఒక్క పోలీసు అధికారికి కూడా ఇప్పటివరకు శిక్ష పడలేదు.

హార్డ్ కౌర్ విషయానికి వస్తే ఆమె పోస్టులు అతి విమర్శనాత్మకంగా ఉండి ఉండొచ్చు, అవమానకరంగా, పరువుకి భంగం కలింగించే విధంగా కూడా ఉండి ఉండొచ్చు. అయితే అవి ఏ మాత్రం దేశ ద్రోహం కిందకి రావు. దేశ ద్రోహాన్ని భారత రాజ్యాంగంలో విస్తృతంగా నిర్వచించారు. అయితే కొన్ని మినహాయింపులు కూడా చేర్చారు- కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారు అనే కారణంతో ఎవరినీ జైలులో పెట్టకూడదు. అదే కనుక నియమం అయ్యుంటే కనుక ఈ రోజు పాత్రికేయులు, మిగతా వారు ఎంతోమంది జైలులో మగ్గుతుండేవారు. ( మీడియాలో ఎక్కువ భాగం ఈ ప్రభుత్వాన్ని పొగుడుతున్న వరస చూస్తుంటే విమర్శని ఒక ‘దేశ వ్యతిరేక’, దేశ ద్రోహంగా పరిగణించే రోజు దగ్గరలోనే ఉండవచ్చు.) కౌర్ మీద కేసు వెయ్యటానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా యోగి ఆదిత్యనాథ్‌కి అనేక చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి. కానీ యోగి పోలీసులు మాత్రం దేశ ద్రోహం కేసుని నమోదు చెయ్యటానికే నిర్ణయించుకున్నారు. తమ బలమంతా చూపించాలి అనుకునేవారికి ఈ దేశ ద్రోహం కేసు మొదటి ఎంపిక అవుతున్నది.

నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం, చివరాఖరికి న్యాయస్థానాలు కూడా నేరాల మీద, దుష్ప్రవర్తన మీద తీసుకుంటున్న సత్వర, కఠిన చర్యలు చూస్తుంటే ఇప్పటినుండి ఎవరి మీద కూడా వ్యవస్థ జాలి చూపించే అవకాశం లేదని తెలుస్తుంది. సెబి ముందు కార్పోరేట్ అక్రమాలు అనేకం ఉన్నాయి. రోజూ దినపత్రికలు తిరగేస్తే కార్పొరేట్ సంస్థలు, వాటి అధిపతులు, ప్రజా ధనాన్ని తమకి నచ్చిన రీతిలో దుర్వినియోగం చేసే మ్యూచువల్ ఫండ్స్ మీద బోలెడు వార్తలు. కానీ వారి మీద ఎటువంటి చర్య తీసుకున్న దాఖలా లేదు. రాఘవ్ బహాల్ లండన్‌లో అక్రమంగా ఫ్లాట్ కొన్నారు అని ఈడి ఆరోపిస్తున్నది. ఎంత పెట్టి కొన్నారు అంటే రెండు కోట్లు అట. ఆ డబ్బులతో ముంబైలో కనీసం అగ్గిపెట్టె విస్తీర్ణం ఉండే ఫ్లాట్ కూడా రాదు. అయితే ఈ కొనుగోలుని తన పన్ను రిటర్న్స్ లో చూపించాను అని ఆయన భార్య అంటున్నారు. ఇది మహా అయితే టాక్స్ గురించి విచారణ. అంతే కానీ ఈడి కేసు పెట్టేంత విషయం ఇందులో ఏమి లేదు.

కానీ ఇది కేవలం ఈ సంస్థల ద్వంద్వప్రమాణాలకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. పెద్ద తలకాయలు ఈ దేశంలో చాలా సునాయాసంగా తప్పించుకుంటాయి అనే బాధాకరమైన వాస్తవం అందరికీ తెలిసిందే. అంతే కాక స్వతంత్రంగా పని చేయవలసిన సంస్థలలో ప్రభుత్వం తన ఇష్టారీతిన జోక్యం చేసుకుంటుంది అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సిబిఐ ని సుప్రీం కోర్టు ‘పంజరంలో చిలుక’ అన్న విషయం తెలిసిందే. సిద్ధాంతం ఏమైనా కానీ ప్రభుత్వాలు అన్నీ సిబిఐని తమకి అనుకూలంగా వాడుకున్నవే.

ఈ దేశ పౌరులని కలవరపరచాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వాన్ని విమర్శించే వారిని మాత్రమే దర్యాప్తు కోసం కోసం ఎంచుకోవటం. ట్విట్టర్ విమర్శలకి సంబంధించి రాజకీయ నాయకులు రోజు రోజుకి మరీ అసహనంగా తయారవుతున్నారు. బిజెపి ఒకటే కాదు అన్ని పార్టీలు అంతే ఉన్నాయి. కానీ మహా అయితే పరువు నష్టం దావా వేయాల్సిన కేసుల్లో కూడా దేశ ద్రోహం కేసులు నమోదు చెయ్యటంలో మాత్రం బిజెపి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇది మనల్ని కలవరపెట్టాల్సిన విషయం. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని మొన్న జనవరిలో అస్సాం ప్రభుత్వం హిరెన్ గోహెన్ లాంటి ప్రముఖ రచయితతో పాటు ముగ్గురి మీద దేశ ద్రోహం కేసు పెట్టింది.

అంటే ఇప్పుడు ప్రభుత్వ విధానాలని విమర్శించడం కూడా రాజ్యం మీద తిరుగుబాటు కిందకే వస్తుందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే, రాసే పాత్రికేయులు, కార్యకర్తలు, అకడమీషియన్స్‌ని అరెస్ట్ చేసి జైలులో పెడతారా? శిక్ష వేస్తారా? ఇది చాలా భయం కలిగించే ఆలోచన.

ఇటువంటి చర్యలు అందరిలో భయం గొలిపే అవకాశాలు మెండు. వాక్ స్వాతంత్ర్యాన్ని కట్టడి చెయ్యడానికి ఎటువంటి చట్టం అక్కర్లేదు. మీడియా ఎలాగూ పాలక వర్గాల సేవలో తరిస్తున్నది, అలాగే ప్రముఖులు తమ తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా వ్యక్తపరచడానికి జంకుతున్నారు. ఇక ఊళ్లలో తమ నమ్మకాల కారణంగా, లేదా తిండి కారణంగా, ఇంకా చెప్పుకోవాలంటే కేవలం తమ మతం కారణంగా మూకహత్యలకి గురవుతున్నారు. కేవలం ఒక ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ పోస్ట్ కారణంగా అరెస్ట్‌ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

విమర్శని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించం అని పాలక వర్గం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. కేంద్రంలో రెండవ సారి మెజారిటీ రావటం, అలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలో ఉండటం, కోలుకోలేని పరాజయంతో మూలుగుతున్న ప్రతిపక్షం పూర్తిగా డీలాపడటంతో తమని విమర్శించేవాళ్ళ మీద ఉక్కుపాదం మోపేందుకు బిజెపి ఉవ్విళ్లూరుతోంది.

దేశ ద్రోహానికి సంబంధించి మరింత కఠినంగా ఉండే కొత్త చట్టం తీసుకువస్తామని రాజనాథ్ సింగ్ మొన్న ఎన్నికలప్పుడు ప్రకటించారు. అది కేవలం ఎన్నికల జిమ్మిక్కు కాదు. ఇక ఇప్పుడు దేశంలో తర్కించే వారికి చోటు లేదు. ఎవ్వరైనా గానీ పాలక వర్గం భజన చెయ్యాల్సిందే.

-సిద్ధార్ధ్ భాటియా

ద వైర్ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment