NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Modi : రాష్ట్రాలను వణికిస్తున్న మోడీ..! ఇప్పుడేం చిక్కులు మొదలవుతాయో…

Modi : రాష్ట్రాలను వణికిస్తున్న మోడీ..! ఇప్పుడేం చిక్కులు మొదలవుతాయో...

Modi :  భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో దాదాపు తిరుగులేని శక్తిగా మారిన తర్వాత అతనిని విమర్శించే వారు కూడా ఎక్కువ అయ్యారు. మొదట్లో ఒక ‘ఛాయ్ వాలా’ ప్రధానమంత్రి అయ్యాడు అని సంతోషించిన వారే ఇప్పుడు తలను పట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం…

 

Modi is panicking states
Modi is panicking states

అన్నీ లాగేస్తున్నారు…

మోడీ సర్కార్ కింద ఏర్పడిన తర్వాత రాష్ట్రాలకు ఉన్న అధికారాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి. మత రాజకీయాలు చేస్తున్నారని ముద్ర పక్కనపెడితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల కు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించింది. కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయకుండా ఉన్న చట్టాలు అన్నింటినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా తెలివిగా…. నొప్పిలేకుండా రాష్ట్రాలకు దూరం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కేంద్రం తీసుకోబోయే జమిలి ఎన్నికలు కావచ్చు ‘వన్ నేషన్-వన్ రేషన్’ ఇలా రకరకాల పేర్లతో ఎన్నో ప్రవేశపెడుతూ రాష్ట్రాలను నిలువరించి తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సామాన్యులకి ఏం ఒరిగింది?

2016లో మోదీ పెద్ద నోట్లు అయిన 500 రూపాయల, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు అలాంటి నిర్ణయాలు గోప్యంగా అయినా రాష్ట్రాలతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా రాత్రికి రాత్రి ప్రకటించారు. సరే ఇది మన మంచికే అనుకుంటే దాని వల్ల జరిగిన మంచి మాత్రం బయటికి కనిపించనేలేదు. పైపెచ్చు భారత ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రాలపై పదిన ఆర్థిక భారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పరిశ్రమలు మూతపడి ఉపాధి రంగం దెబ్బతింది. కానీ కార్పొరేట్ బడా బాబులు మాత్రం దీని వల్ల బాగానే లాభపడ్డారు. ముఖ్యంగా అంబానీ అదే సమయంలో జియో కంపెనీ స్థాపించడం కూడా వేరే లెవెల్ చర్చకు దారి తీసింది.

Modi : గజగజ…

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దేశంలో మొదలైపోయింది. ఈ సందర్భంగా మోడీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. వచ్చే నెల మొత్తం అంతర్జాతీయ విమానాల రాకపోకలని రద్దు చేశారు. ఇక దాని తర్వాత లాక్ డౌన్ విషయమై కేంద్రం తీసుకున్న నిర్ణయం ముందు రాష్ట్రాలతో చర్చించే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు. కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా వారు అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ప్రభుత్వాలు అయితే మరొకసారి లాక్ డౌన్ విధిస్తే అది తమ రాష్ట్రానికి తీరని చేటు చేస్తుందని అంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఆర్థికంగా ఘోరంగా దెబ్బతింటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ ఆర్థిక పరమైన నిర్ణయాలు, కానీ జాగ్రత్త చర్యలు ఏకపక్షంగా తీసుకోకపోతే మంచిది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju