బిగ్ బాస్ షో దాదాపు చివరి స్టేజ్ కి వచ్చేసింది. మరికొద్ది వారాలే మిగిలి ఉండడంతో ఇంటిలో ఉన్న చివరి 7 కంటెస్టెంట్స్ మధ్యన గేమ్ పోటాపోటీగా సాగుతోంది. మాటల యుద్ధం జరుగుతోంది అయితే ఈ మైండ్ గేమ్ లో సెన్సేషనల్ ఈవెంట్స్ చోటుచేసుకుంటున్నాయి….
వివరాల్లోకి వెళితే గత వారం కుటుంబ సభ్యుల రాకతో కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయి ప్రెండ్స్ అయ్యారు. అయితే దానివల్ల టిఆర్పి ఏమాత్రం పెరగదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా శత్రువులు లాగా మారిపోయారు. దానికి కారణం నాగార్జున. శనివారం అతని వల్ల ఇంటి సభ్యుల మధ్య చిచ్చు ఏర్పడింది. ఉన్నపాటుగా కంటెస్టెంట్స్ లో కోపాగ్రహాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం నామినేషన్ సమయం ఆసన్నం కావడంతో ఒక్కొక్కరు విపరీతంగా రెచ్చిపోయారు
ఇక సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ను ఎంతో వినూత్నంగా డిజైన్ చేశాడు. ఎవరికి వారే గొయ్యి తవ్వుకునేలా ప్లాన్ వేశాడు. నాలుగు శవపేటికలు ఉంటాయి. అందరూ వాతి బయటకు ఉండే టోపీలను తీసుకొని తల మీద పెట్టుకోవాలి. ఎవరు ముందు పెట్టుకున్నారన్నది సంబంధం లేదు కానీ కొన్నింటిలో పచ్చ రంగు ఉంటుంది మరికొన్నింటిలో ఎర్ర రంగు ఉంటుంది. ఎర్ర రంగు తల మీడ్డ పడ్డ వారు నామినేషన్ లో ఉంటారు. అవినాష్, అభిజిత్, అఖిల్, అరియానా నేరుగా అలా నామినేట్ అయిపోయారు. ఇలా ఒక ప్లాన్ ఉందని బిగ్బాస్ వారికి ముందుకు తెలపకపోవడం గమనార్హం.
ఇలాంటి సమయంలో నామినేట్ అయిన కంటెస్టెంట్ బయట ఉన్న వారితో స్వాప్ చేసుకోవచ్చని బిగ్బాస్ వారికి సూచించారు. అంటే వీరి ప్లేస్ లో ఎవరో ఒకరు వెళ్లి నామినేట్ అయ్యేలాగా కన్విన్స్ చేయాలి. అది శక్తికి మించిన పని. అవినాష్ మోనాల్ ని టార్గెట్ చేశాడు. ఇక అఖిల్ కూడా అలాగే మిగతావారితో చేసేసరికి ఆమె భారీగా హర్ట్ అయింది. నువ్వు నాకు ఇప్పటివరకు చేసిన మేలు కి థాంక్స్ నేను నీలాగా అన్నీ లెక్క పెట్టుకోలేనని అని ఎమోషనల్ అయింది. చివరికి వెళ్లి అభిజిత్ కోసం త్యాగం చేసి శవపేటికలో నిలబడింది. అంతే ఇంటిలోని కుటుంబ సభ్యులతో పాటు బయట ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
ఇక మోనాల్ ఇన్నిరోజులు హౌస్ లో ఉండడానికి అనర్హురాలు అని అని ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే సరైన సమయంలో సరైన పని చేసింది అని మాత్రం అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బతో అఖిల్, అవినాష్ విలన్స్ అయిపోయారు. వచ్చే వారం ఎలిమినేషన్స్ లో ప్రైమ్ కంటెస్టెంట్ గా బయటకు వెళ్లేందుకు టికెట్ తెచ్చుకున్నట్లు అయింది. అభిజిత్ అభిమానులంతా కచ్చితంగా మోనాల్ ఓటు వేస్తారని ఊహిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో తన ‘ఏ‘ గేమ్ మోనాల్ బయటికి తీసింది ప్రశంసల వర్షం కురుస్తోంది.