MP RRR: జస్టిస్ గత వ్యాఖ్యలతో జగన్ కి ఇబ్బందులే..!? రెబల్ ఎంపీ కీలక అడుగు..!

MP RRR: CM Jagan Future in Justice Hand
Share

MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని (YS jagan) ఏదోరకంగా ఇబ్బంది పెడుతూ..నే ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని, సీఎం జగన్ (YS Jagan) ను ఇక్కట్లకు గురి చేసే పని కొనసాగిస్తూనే ఉన్నారు. రఘురామకృష్ణంరాజుకు (MP RRR) వైఎస్ జగన్ పై వ్యక్తిగతంగా ఏమి కోపముందో తెలియదు కానీ పార్టీ మీద, ప్రభుత్వం మీద అలాగే సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి, జగన్ పదవీ చిత్యుడ్ని చేయడానికి, ఆయన బెయిల్ రద్దు చేయించడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను రఘురామ కృష్ణంరాజు ఉపయోగించుకుంటున్నారు. కొన్నింటిలో ఫెయిల్ అవ్వవచ్చు, మరి కొన్నింటిలో పాస్ అవ్వచ్చు, మరి కొన్నిట్లో మధ్యస్తంగా ఉండిపోవచ్చు కానీ దారులు మాత్రం వెతుకుతూనే ఉన్నారు. తాజాగా రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తో జగన్మోహనరెడ్డి న్యాయపరంగా చాలా చిక్కుల్లో పడుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ గతంలో చేసిన వ్యాఖ్యలను ఒక సారి గుర్తు చేసుకుంటే మొన్న రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ దానికి తగ్గట్లే ఉంది. ఈ రెండు పరిశీలిస్తే జగన్మోహనరెడ్డి కి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు.

MP RRR: CM Jagan Future in Justice Hand
MP RRR: CM Jagan Future in Justice Hand

MP RRR: రఘురామ కృష్ణంరాజు ఏమని పిటిషన్ వేశారంటే..

ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై కేసులు ఎక్కువగా ఉన్నాయి. సుదీర్ఘకాలం విచారణలో ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే, సంవత్సరంలోగా విచారణ పూర్తి చేయాలి. శిక్షలు అమలు చేయాలి. ఒక వేళ నేరం నిరూపణ కాకపోతే పిటిషన్ లు కొట్టివేయాలి. సాక్షాలు, ఆధారాలు లేకపోతే నిర్దోషులుగా తేల్చేయాలి కానీ జగన్మోహనరెడ్డి మీద దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని త్వరగా తేల్చండి అంటూ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జస్టిస్ వెంకట రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల తమిళనాడుకు చెందిన సీబీఐ, ఈడి కేసుల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి కేసులకు సంబంధించి చార్జిషీట్లు వేస్తున్నారే తప్ప కేసులను తేల్చడం లేదు, కేసులను నాన్చుతున్నారు. దాదాపు 11 ఏళ్లు, 17 ఏళ్లు, 20 ఏళ్లు కూడా ఒక్కో కేసు కు సమయం తీసుకుంటున్నారు, సీబీఐ, ఈడీకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది, దేశంలో అత్యన్నత పరిశోధనా సంస్థగా ఉన్న సీబీఐ ఈ విషయంలో మారాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలంటూ సీబీఐకి చురకలు వేసేలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ కామెంట్స్ చేశారు. సీబీఐ కేసుల్లో ఆసక్తికల్గించే వాటిలో ఏపి సీఎం వైెఎస్ జగన్మోహనరెడ్డి కేసులు కూడా ఉన్నాయి.

MP RRR: CM Jagan Future in Justice Hand
MP RRR: CM Jagan Future in Justice Hand

సీఎం జగన్ కేసుల్లో ఈ అడుగు కీలకం..!

ఏపి సీఎం వైెెఎస్ జగన్మోహనరెడ్డి 11 కేసుల్లో ఏ 1 నిందితుడుగా ఉన్నారు. ఆ కేసులు ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. అత్యంత ప్రజాకర్షణ నేత అయిన జగన్ ఆ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణే గతంలో ప్రజా ప్రతినిధుల కేసులను సత్వరం పరిష్కరించాలని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు అవే పాయింట్ లను పట్టుకుని జగన్మోహనరెడ్డి కేసులను ప్రస్తావిస్తూ నేరుగా సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేస్తూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గుర్తు చేశారు. జగన్మోహనరెడ్డి పాత కేసులను తవ్వారు. దీంతో జగన్మోహనరెడ్డి న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా, ఒక వేళ విచారణకు స్వీకరించి జగన్మోహనరెడ్డి కి నోటీసులు జారీ చేసే ఆయన తరుపు న్యాయవాదులు వాదనలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.


Share

Related posts

ఇద్దరు ఈరోజు… మరో ఇద్దరు త్వరలో…!

Srinivas Manem

రెబల్ ఎంపి రాజు గారికి మరో దెబ్బ..! స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఊస్టింగ్..!!

somaraju sharma

Ys Sharmila బిగ్ బ్రేకింగ్: షర్మిల తో భేటీ అయిన సానియా మీర్జా సోదరి, అజహరుద్దీన్ కొడుకు..!!

sekhar