ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ షో లో ఒక మోస్తరు కంటేస్తెంట్ గా కొనసాగుతున్న ముక్కు అవినాష్ ఈ మధ్య తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. మొదట్లో కామెడీ చేస్తున్నాడు అని నాగార్జున ఏ ముహూర్తాన ఎంటర్టైనర్ అన్నాడో గాని అప్పటి నుండే అవినాష్ వీర లెవెల్ పర్ఫార్మెన్స్ మొదలైంది… ఇక ఈ స్టోరీలోకి వెళితే…
నోయల్ నాటిన బీజం…
మొన్న ఇంటి నుండి నోయల్ సీన్ వెళ్ళిపోతూ అవినాష్ ను ఉద్దేశించి నువ్వు ఇంటిలోకి చిల్లర కామెడీలు చేయడానికి వచ్చావా? అని ప్రశ్నించాడు. దానికి అవినాష్ ఎక్కడ ప్రేక్షకులకు తన పై ఆ ముద్ర పడిపోతుందో అనే భయంతో అతని పై నాగార్జున ఉండగానే నోయల్ పైన పేట్రేగిపోయాడు. నన్ను చిల్లర్ కామెడీ అంటావా 10 కోట్ల మంది ప్రేక్షకులు నన్ను ఆదరించారు అన్నాడు. మిమిక్రీ చేయడం…. కామెడీ చేయడం తప్పు అని నువ్వు అంటున్నావు అని కొత్త డ్రామాకు తెరతీశారు. ఎపిసోడ్ తర్వాత కూడా ఇంటిలో అందరిని ఉద్దేశించి నేను చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటారు దానిని నోయల్ అలా తప్పుపట్టడం ఏమీ బాగోలేదు అని చెప్పడం జరిగింది.
నేనే ది ఎంటర్టైనర్ – ఒకటే డప్పు
అయితే ఇక్కడ సగటు ప్రేక్షకుడికి అర్థం కానిది ఏమిటి అంటే జబర్దస్త్ లో అవినాష్ కొద్దికొద్దిగా ఎదిగి టీం లీడర్ అయ్యాడు. అయితే కెవ్వుకార్తిక్ లేకపోతే అవినాష్ స్కిట్ లు పెద్దగా వర్కవుట్ కావు అని అంటారు. అంతే కాకుండా ఇంకా ఎంతోమంది టీం లీడర్ లతో పోల్చుకుంటే అవినాష్ చాలా యావరేజ్ కంటెస్టెంట్. పైగా జబర్దస్త్ కామెడీ కి హై రేటింగ్ కూడా ఏమీ లేదు. కుటుంబ సభ్యులు దానిని నిజంగానే చిల్లర కామెడీ…. బూతుల కామెడీ గా అభివర్ణిస్తూ ఉంటారు. దానిని ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం నోయల్ ఆ మాట అన్నాడు అన్న కారణంతో హౌస్ లో నేనో ఎంటర్టైనర్ అని ఒకటే డప్పు కొట్టేస్తున్నాడు అవినాష్.
నీ కష్టాలు మాకేల సామి?
మరోవైపు నేను ఎన్నో కష్టాలు పడి ఇంటి లోకి వచ్చాను…. కామెడీ అంటే నేను…. మళ్ళీ నేను బయటికి వెళ్తే జబర్దస్త్ లోకి అడుగుపెట్టక పోవచ్చు అని సెంటిమెంటల్ టచ్ ఇచ్చాడు. నేను ఈ ఇంటిలోకి వచ్చే ముందు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని కూడా అన్నాడు. అలాగే ముందు అగ్రీమెంట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు కట్టి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని లోనికి వచ్చేందుకు ఎన్నో పాట్లు పడ్డారు…. అని ఇల్లు కొనడానికి ఇంకా ఈఎంఐ కట్టాలి అని వాపోయాడు. అసలు ఈ గొడవంతా ప్రేక్షకులకు ఎందుకు అన్నది ఎవరికీ అర్థం కాలేదు
ఈ రుద్దుడు తగ్గాలోయ్….
తన వ్యక్తిగత విషయాలను ఇంట్లో వారి మీద రుద్ది మరీ అవినాష్ ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అందరూ అనుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే అతను ఇంట్లో చేసే కామెడీ అతనిని బిగ్ బాస్ విన్నర్ గా నిలబెట్టదు. అలాగే బిగ్ బాస్ లో కామెడీ ఒక్కటి చేస్తే సరిపోదు. అసలు షో విన్నర్ గా నిలిచేందుకు కామెడీ అవసరం లేదు. ఇది తెలివైన గేమ్…. ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఇలా ఒక్క విషయాన్ని పెట్టుకుని ప్రతి ఒక్కరిపై తన వృత్తి ని ఇలా రుద్దివేయడం అనేది అసలు సరికాదు అన్నది సగటు ప్రేక్షకుడి భావన…!
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!