NewsOrbit
Featured బిగ్ స్టోరీ

వైఎస్ జీవితం కొంత తెరిచారు…! నాలో… నాతోలో ఏముంది…?

జననము మనిషిగానే… మరణమూ మనిషిగానే ఉంటుంది…! ఈ మధ్యలో వ్యవధి మనిషితత్వాన్ని తెలియజేస్తుంది. వక్తిత్వం ఏమి లేకపోతే ఆ మనిషి పేరు అస్తిత్వం… అది బాగుంటే గుండెల్లో స్థిరత్వం. సాటి మనిషి కోసం బతికితే మానవత్వం.., మొండిగా వెళ్తే నియంతృత్వం.., జనం కోసం వెళ్తే నాయకత్వం.. అంటుంటారు. ఈ అన్ని తత్వాలను తనలో ఎంతో కొంత ఇముడ్చుకున్న వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. అందుకే ఆయన వెలుగు దివ్వెలాగానే తెలుగు గుండెల్లో ఉన్నారు. ఇక ఆయన జీవితాన్ని తనకు తెలిసినట్టు వివరించారు సతీమణి విజయమ్మ. “నాలో… నాతో… వైఎస్సార్..!” అంటూ నామకరణం చేసి ఓ పుస్తకాన్ని విడుదల చేసారు. మరి ఆ పుస్తకంలో ఏముంది..? ఏం చెప్పారు..? అనే సమీక్ష చూద్దాం.

నాయకుడా…? మళ్ళీ రావా…?? అనేంతగా…!

పెళ్ళైన కొత్తలో నుండి… భర్తగా.., వైద్యుడిగా, నాయకుడిగా, సీఎం గా… తండ్రిగా ఆయన ఎలా ఉన్నారు అనేది పూసగుచ్చినట్టు రాసారు. ఈ క్రమంలోనే ఎన్నో తెలియని అంశాలు లేవనెత్తారు. ఎవరికీ తెలియని రాజశేఖర్ రెడ్డిని చూపించారు. ఈ ఇద్దరి పెళ్ళికి ముందే ఇంటికెళ్లి విజయమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం..! తిరుపతిలో బండిపై ఇద్దరూ చక్కర్లు కొట్టుకుని తిరగడం..! కళాశాలలో విద్యార్థిగా ఉంటూనే ఎదుటి వారికి సాయపడడం.., తన వద్ద లేకపోయినా అప్పుచేసి మరీ సాయ పాడడం..! రూపాయి డాక్టర్ గా పేరు సంపాదించడం..! జగన్ పుట్టినప్పుడు జీపులో ఈలలు వేసుకుంటూ రావడం…! షర్మిలకు జ్వరం వస్తే ముఖ్యమైన మీటింగ్ వదిలేసి వెళ్లడం…! సిగరెట్ అలవాటు మాన్పించడానికి, షర్మిల తో గోళ్లు కోరుకునే అలవాటు మాన్పించడం…! జగన్ కి చిన్నతనం నుండి దగ్గర పెట్టుకుని “వ్యక్తిత్వం, నాయకత్వం, నిబద్ధత, రాజకీయ విలువలు” అన్నిటినీ చెప్పడం…! రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మొదటిసారి మంత్రి పదవి స్వీకరించడం…! కాంగ్రెస్ లో సహచర లీడర్లతోనే ఆటుపోట్లు ఎదురవ్వడం…! పీసీసీ అధ్యక్షుడిగా మారడం, రాజీవ్ గాంధీతో అనుబంధం..! షర్మిల మొదటి పెళ్లికి ముందు, తర్వాత మొదటి సారి రాజశేఖర్ రెడ్డి కూతురి విషయంలో కన్నీళ్లు పెట్టుకోవడం…! 1990 , 1992 ఇలా రెండుసార్లు సీఎం అయ్యే అవకాశం ఉన్నా ఆశించకపోవడం…! 1996 లో ఎంపీగా ఓడిపోతారన్న భయంతో కొడుకు, కూతురు ఇద్దరూ మొక్కుకోవడం…! ఇలా పెద్దగా బయటకు తెలియని కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. కొన్ని ఎన్నికల్లో వైఎస్సార్ ని ఓడించడానికి ఎవరెవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనే అంశాలను కూడా రాశారు.

 

  • రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అంటే అందరికి 2003 పాదయాత్ర గుర్తుంటుంది. కానీ 1986 లో ఆయన పోతిరెడ్డిపాడు కోసం 500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్నీ విజయమ్మ రాశారు. మొత్తానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా… వైఎస్సార్ ఎలా పని చేశారు, పులివెందులలో ఎందుకు అంతలా స్థిరపడ్డారు అనేది స్పష్టంగా తెలియజేసారు.

ప్రతి ఒక్కరి గురించి క్లుప్తంగా…!

ఆ పుస్తకంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ప్రతీ ఒక్కరి గురించి క్లుప్తంగా రాశారు. తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ… అన్న జార్జి రెడ్డి.., తమ్ముడు వివేకానందరెడ్డి… ఇలా ప్రతి ఒక్కరి గురించి విజయమ్మ రాసారు. ఒక్కొక్కరి చరిత్ర క్లుప్తంగా మూడు, నాలుగు పేజీల్లో ఫొటోలతో సహా ప్రచురించారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి రాజకీయాల్లో, పార్టీల్లో లేకపోయినా అక్కడ పంచాయతీ పెద్దగా ఎలా కొనసాగారు అనేసి వివరంగా రాశారు. అయితే ఓ సందర్భంలో బైబిల్ లో అంశాన్ని ప్రస్తావిస్తూ “తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయెను” అని రాస్తూ… “ఏ ఊరి నుండి వీళ్ళ అబ్బని (రాజారెడ్డిని) వెలివేసారో.., అదే రాష్ట్రానికి ఈయన రాజయ్యారు” అంటూ రాశారు. వైఎస్ చేపట్టిన ప్రతీ పథకం లబ్దిని వివరించారు. సుమారుగా 30 పేజీల్లో ఈ విషయాలన్నీ రాశారు. ప్రతీ పథకం పుట్టుక, లబ్ది, ఫలితం అంతా వివరించారు.

ఇక వైఎస్ మరణం… ఈ మరణం వెనుక విజయమ్మ వ్యక్తం చేసిన అనుమానాలు… వైఎస్ మరణానికి ముందు ఈ కుటుంబంలో జరిగిన సంఘర్షణ…, పది రోజుల ముందు షష్టిపూర్తి అవ్వడం.., ఈ కుటుంబం లో షర్మిల, జగన్, భారతిల ప్రస్థానం… షర్మిలకి వైఎస్ ఇచ్చిన ప్రత్యేకత ఏమిటి అనే అంశాలు అన్నిటినీ రెండో భాగంలో చూద్దాం…!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju