NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nara Lokesh: టీడీపీకి “నారా లోకేష్” పెద్ద భారమా..!? లోకేష్ కి టీడీపీ భారమా..!?

Nara Lokesh: What is Internal Role in TDP Elections?

Nara Lokesh: నారా లోకేష్ రాష్ట్ర (Andhra Pradesh Politics) రాజకీయాల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఈజీగా నాయకుడు అని పిలిపించుకున్నప్పటికీ.. నాయకుడిగా ఎదగలేక.., నిరూపించుకోలేక.., సొంత పార్టీలోనే నమ్మించలేక.. నానా తంటాలు పడుతున్నారు..! ఆయన (Nara Lokesh) ను తలచుకుంటే ఆ పార్టీలో కార్యకర్తలకే టీడీపీ (TDP) భవితపై గుండె ధైర్యం చెదురుతుంది. కొన్ని నెలలుగా రాటుదేలుతున్నారని సంబర పడుతున్నప్పటికీ.. ఇది కృత్రిమమే.. సహజ లక్షణాలు కావు అనేది టీడీపీ (Telugu Desam Party) లో కాస్త లోతుగా ఆలోచించేవారి అభిప్రాయం..! అందుకే లోకేష్ టీడీపీకి భారంగా మారినట్టే… లోకేష్ కి కూడా టీడీపీ భారంగా మారింది. మోయలేక, బాధ్యతల నుండి వీడలేక, నానా అవస్థల్లో చిక్కుకున్నారు. ఇంతకూ పార్టీలో లోకేష్ కి ఏ బాధ్యతలు ఇవ్వాలనేది ఒక పెద్ద ప్రశ్న..!

Nara Lokesh: ఏ రోల్ తో సైకిల్ యాత్రకి సన్నాహాలు..!?

తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2024 ఎన్నికల్లో నారా లోకేశ్ కి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా, లేక పాలనా బాధ్యతలా, పార్టీ బాధ్యతలా, ఆర్ధికపరమైన బాధ్యతలు తీసుకుంటారా, వీటీల్లో లోకేశ్ ఏ బాధ్యతలు స్వీకరిస్తారు అన్నది చర్చనీయాంశమవుతోంది,. రాజకీయ పార్టీ లో ఇవన్నీ ఒకళ్లే చూసుకునే పరిస్థితి ఉండదు. ఒకొక్కళ్లు ఒక్కో బాధ్యతలు చూసుకోవాలి. తెలుగు దేశం పార్టీలో గతంలో చంద్రబాబు ఇవి చూసుకున్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లతో పాటు నారా లోకేష్ కొన్ని బాధ్యతలను చూశారు. 2014, 2019 ఎన్నికల్లోై వారు చూసుకున్నారు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ జిల్లాల వారిగా ఆర్ధికపరమైన అంశాలను నారా లోకేశ్ చూడగా ప్రచార బాధ్యతలను చంద్రబాబు చూశారు. నారా లోకేష్ ఎక్కడా ప్రచార బాధ్యతలను నిర్వహించలేదు. జిల్లాల వారిగా ఆర్ధికపరమైన అంశాలు, పార్టీ అఁతర్గత వ్యవహారాలను చూసుకున్నారు. 2024 ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ తరువాత పార్టీ యాక్టివ్ కాబోతున్నది. పార్టీ ఆధ్వర్యంలో పెద్ద యాత్ర గానీ, బస్సు యాత్ర గానీ ప్లాన్ చేస్తోంది, ప్రజాయాత్ర పేరిట చంద్రబాబు జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిధ్దం చేశారని సమాచారం,. ఈ వయస్సులో ఆయన పాదయాత్ర చేయడానికి శరీరం, ఆరోగ్యం సహకరిస్తుందా లేక బస్సు యాత్ర చేయడమా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో పక్క నారా లోకేశ్ అన్ని జిల్లాలో దాదాపు 130 లేదా 140 నియోజకవర్గాలు టచ్ అయ్యేలా సైకిల్ యాత్ర చేయాలని ఆలోచన చేస్తున్నారుట.

Nara Lokesh: What is Internal Role in TDP Elections?
Nara Lokesh What is Internal Role in TDP Elections

Nara Lokesh: 2019లో వైసీపీ దెబ్బకు ఢమాల్..!

తండ్రీ కొడుకులు వేరవేరుగా ఒకరి తరువాత ఒకరు యాత్రలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది,. 2022 నుండి పూర్తి స్థాయిలో జనంలో ఉండాలని డిసైడ్ అయ్యారు. 2024 గెలుపే లక్ష్యంగా టీడీపీ టార్గెట్, లక్ష్యంతో ఈ అడుగులు వేయబోతున్నది. అయితే ఇందులో నారా లోకేష్ పాత్ర ఏమిటి అన్నది ఇక్కడ చెప్పుకోవాలి. ప్రచార బాధ్యతలను నారా లోకేష్ చూసుకుంటే ప్రత్యర్ధులకు టార్గెట్ అయిపోతారు. నారా లోకేశ్ గతం కంటే మెరుగైనట్లు కనబడుతోంది. ఆయన ప్రసంగంలో తేడా కనబడుతోంది, బాడీ ల్యాంగ్వేజ్ లో కూడా మార్పు వచ్చింది. అన్ని రకాలుగా ఆయన మెరుగైనప్పటికీ చంద్రబాబే ప్రచార బాధ్యతలు తీసుకోవాలని టీడీపీలో ఎక్కువ మంది కోరుతున్నారుట. ఈ పరిస్థితిలో నారా లోకేష్ ఆర్ధికపరమైన అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో ఈ వ్యవహారాలను నారా లోకేష్ చూశారు. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించలేదనే మాట ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నారు. చివరి నిమిషంలో పార్టీ నుండి నగదు సర్దుబాటు కాక అనేక నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పంపిణీలో వెనుకబడిపోయారు. ఆనాడు వైసీపీకి తెలంగాణ సీఎం సహకరించడం, కేంద్రంలోని బీజేపీ పరోీీక్ష సహకారంతో టీడీపీకి అష్టదిగ్బంధం చేశారు. పోలింగ్ కు రెండు రోజుల ముందే వైసీపీ అభ్యర్దులకు సర్దుబాట్లు చేసింది.

Nara Lokesh: What is Internal Role in TDP Elections?
Nara Lokesh What is Internal Role in TDP Elections

ఆర్ధిక సర్దుబాట్లలో లోకేష్ కక్కుర్తి..!?

టీడీపీ అభ్యర్ధులకు నగదు సర్దుబాట్లు కాకపోవడంతో పలువురు అభ్యర్ధులు అధిక వడ్డీలకు ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. కొంత మంది అప్పోసప్పో చేసి ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. కొన్ని చోట్ల అసలు ఖర్చు పెట్టలేక టీడీపీ అభ్యర్ధులు చేతులు ఎత్తేశారు. కొద్దిగా ఖర్చు పెడితే గెలిచే స్థానాలు కూడా టీడీపీ కోల్పోయింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఏలూరులో టీడీపీ అభ్యర్ధి కేవలం 4500 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యాడు. అభ్యర్ధి ఖర్చు పెట్టకపోవడం వల్లే ఓడిపోయాడనేది నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచలేదని పోలింగ్ బూత్ కు ఓటర్లు రాని పరిస్థితి కూడా కనబడింది. ఒంగోలులో ఓ కాలనీకి చెందిన వాళ్లు డబ్బులు పంచలేదని రాకపోతే సాయంత్రం మూడున్నర ప్రాంతంలో నేతలు వెళ్లి బతిమిలాడితే కొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఇలా డబ్బుల కోసం ఆశించే వర్గాలు కొన్ని ఉంటాయి. రెండు మూడు శాతం ఓట్లర్లు ఆ మాదిరిగా ఉంటారు. ఎన్నికల్లో ఫైనాన్షియల్ మేనేజ్ మెంటే చాలా కీలకం.. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఈ వ్యవహారాలను చూశారు. ఆ సందర్భంలోనే నారా లోకేష్ సుజనా చౌదరి, సీఎం రమేష్ ల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అందుకే పార్టీ మెజార్టీ వర్గాలు ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ బాధ్యతలను లోకేష్ కు అప్పగించవద్దని చెబుతున్నారనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న టాక్. అదే విధంగా ప్రచార బాధ్యతలు కూడా నారా లోకేష్ కు వద్దని అంటున్నారుట.

నారా లోకేష్ ను యూత్ సమన్వయ బాధ్యతలు చేపట్టి సైకిల్ యాత్ర చేయాలనీ, ఆయన ఏ జిల్లాలో పోటీ చేస్తున్నారా ఆ జిల్లా బాధ్యతలు చూడాలని పార్టీ నేతలు సూచిస్తున్నారుట. పార్టీ పొలిట్ బ్యూరో లో నేతలు కూడా ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెబుతున్నారుట. వచ్చే ఎన్నికల వరకూ నారా లోకేశ్ కు కీలకమైన బాధ్యతల నుండి పక్కన పెట్టాలనీ, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈ ఇద్దరి సమన్వయంతో కార్యక్రమాలు చేయాలని అంటున్నారుట. పార్టీలో అంతర్గతంగా వీటిపై పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఈ మేరకు సూచనలు వస్తున్నాయని సమాచారం.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju