NewsOrbit
బిగ్ స్టోరీ

‘నీట్‌’ను ఎందుకు వ్యతిరేకించాలి!?

 

సెప్టెంబర్ 1, 2017: ఈ రోజునే ఎస్.అనిత నీట్ చీకటి కోణానికి బలైపోయింది. అరియాలూర్ లో ఒక దళిత కుటుంబంలో పుట్టిన అనితకి- ఆమె తండ్రి తిరుచురాపల్లి లో ముఠా పని చేస్తుంటారు-వైద్య విద్య అనేది  ఊహకి కూడా అందని కోరిక అయి ఉండాలి. తమిళనాడులో ఉన్న సామాజిక-ఆర్ధిక పరిస్థితులకి అనుగుణంగా అనిత కుళుమూర్ లోని ఒక ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుకుంది. అక్కడ 500కి గాను 480 మార్కులు వచ్చాయి. దానితో మేలమత్తూర్ లోని రాజావిఘ్నేశ్ హయ్యర్ సెకండరీ ప్రైవేటు స్కూల్ లో చదువు కొనసాగించింది. అక్కడ తన చదువు, నివాసం ఫీజులకు సరిపడా ఉపకార వేతనం పాఠశాల యాజమాన్యం అందించింది.

డాక్టర్ అవ్వాలి అనే తలంపుతో నీట్ వైద్య పరీక్షలో కట్-ఆఫ్ మార్కులైన 196.75 సాధించింది. నీట్ పరీక్షే లేకపోయుంటే ఈ మార్కులతో ప్రతిష్టాత్మకమైన మద్రాస్ మెడికల్ కళాశాలలో తనకి సీట్ వచ్చుండేది.

వృత్తి విద్యా కళాశాలలో సీట్ల కోసం పోటీ పడే విద్యార్ధులకి సమాన అవకాశాలు కలిపించటానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది రిజర్వేషన్లు. వన్నియర్ సంఘం పట్టువిడవని పోరాటంతో వెనుకబడిన తరగతుల కోటాని వర్గీకరించి అత్యంత వెనుకబడిన తరగతుల కోటా ఏర్పాటు చేయడంతో 1989 నాటికి తమిళనాడులో రిజర్వేషన్ కోటా 69 శాతానికి చేరుకుంది.

దీనిని అనుసరించి కరుణానిధి నేతృత్వంలోని ఆనాటి ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం ఒక పధకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కుటుంబంలో ఒక్క గ్రాడ్యుయేట్ కూడా లేని వృత్తి విద్యా కోర్సుల అభ్యర్ధులకి ఐదు మార్కులు కలుపుతారు. ఇది కులంతో సంబంధం లేని పధకం. అన్ని కులాల అభ్యర్ధులకి దీని వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే ఈ పధకాన్ని తరువాత కోర్టులో సవాలు చెయ్యటం, కోర్టు దీనిని కొట్టివెయ్యటం జరిగింది.

తరువాత 1996లో డి.ఎం.కె ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుండి రావటం వల్ల వ్యవస్థాగతంగా ఉండే అడ్డంకులని అధిగమించే ప్రయత్నంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులకి సీట్లు రిజర్వ్ చేసే పధకాన్ని ప్రవేశపెట్టింది. కోర్టు దీనిని కూడా కొట్టివేసింది. అలాగే  జే.జయలలిత నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం 2005లో ఇంప్రూవ్మెంట్ పరీక్ష వ్యవస్థని రద్దు చేసింది. 1989లో అమలులోకి వచ్చిన ఈ వ్యవస్థ తమ మార్కులు మెరుగుపరుచుకోవటానికి ఒకటి, రెండు సంవత్సరాలు వినియోగించుకోగలిగే విద్యార్ధులకి ఆయాచిత లబ్ది చేకూర్చేది.

 

నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేక ఈ నెల మొదట్లో తమిళనాడులో రెండు రోజుల వ్యవధిలో ఆత్మహత్యలకు పాల్పడిన ముగ్గురు యువతులు 

2005లో తమిళనాడు వృత్తివిద్య అర్హత పరీక్షని రద్దు చేసే మొదటి ప్రయత్నం జరిగింది. ఎం.కరుణానిధి ఆధ్వర్యంలోని డి.ఎం.కె ప్రభుత్వం 2006లో దానిని రద్దు చేసింది. ఈ నిరంతర విధాన నిర్ణయాలు ఒక్క విషయం అయితే బాగా స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక-భౌగోళిక, సామాజిక-ఆర్ధిక కారణాల వల్ల కొందరికి వచ్చిపడే ఆధిక్యతను దృష్టిలో ఉంచుకుని అదే లేనివారికి సమాన అవకాశాలు కల్పించాలి అనే రాజకీయ సంకల్పం అన్ని పార్టీలకూ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

మొన్నీమధ్య నీట్ పరీక్షకి వ్యతిరేకంగా వస్తున్న తీవ్ర నిరసనల నేపధ్యంలో రెండు నీట్ పరీక్షకి సంబధించిన బిల్లుల్ని ఏ.ఐ.ఏ.డి.ఎం.కె ప్రభుత్వం అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో శాసనసభ ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఇందులో ముఖ్యమైనది నీట్ పరీక్షని రద్దు చెయ్యడం, ఎం.బి.బి.ఎస్, బి.డి.ఎస్ కోర్సులలో అడ్మిషన్‌కి పన్నెండవ తరగతి మార్కులని ప్రామాణికంగా తీసుకోవటం. 2017లో ఆమోదం పొందిన ఈ బిల్లులకి ఈనాటికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.

మొదట ఈ పరీక్ష కేవలం విద్యార్ధుల తెలివితేటలని పరీక్షించడానికే, రాష్ట్రాలకి ఐచ్ఛికం అని చెప్పిన బిజెపి ప్రభుత్వం తర్వాత నీట్‌ను దేశం మొత్తానికీ తప్పనిసరి చేసింది. దీనికి తమిళనాడులో వ్యతిరేకత కేవలం 2017లో వచ్చింది కాదు.

యుపిఎ ప్రభుత్వం 2012లో నీట్ పరీక్షని మొదటిసారి ప్రతిపాదించినప్పుడు కరుణానిధి వ్యతిరేకించారు. అలాగే నీట్ పరీక్షని వ్యతిరేకిస్తూ జయలలిత 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పట్టణ కులీన విద్యార్ధులకి అనుకూలంగా ఉండే ఇటువంటి ఉమ్మడి అర్హత పరీక్షలలో గ్రామీణ ప్రాంతాల నుండి, వెనుకబడిన సామాజిక-ఆర్ధిక నేపధ్యం నుండి వచ్చే విద్యార్ధులు పోటీపడలేరు అని జయలలిత పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఎం.ఆనందకృష్ణన్ కమిటీ కూడా వెలిబుచ్చింది. 2007-08 విద్యా సంవత్సరం నుండి కేంద్ర అర్హత పరీక్షని రద్దు చెయ్యటానికి తీసుకోవలసిన చర్యల గురించి 2006లో కరుణానిధి ప్రభుత్వం ఎం.ఆనందకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది.

అలాగే గ్రామీణ ప్రాంతాలలో, జిల్లా ఆసుపత్రులలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ‘ఇన్-సర్వీస్’ కోటా ద్వారా డాక్టర్లు పనిచేసే విధానం తమిళనాడులో అమలులో ఉంది. దీని ప్రకారం కనీసం రెండు సంవత్సరాలు ఇలా పనిచేసినవారికి తమిళనాడులో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులలో 50 శాతం రిజర్వేషన్ ఉంది. ఇది రాజ్యాంగవిరుద్ధం అని ఈ ‘ఇన్-సర్వీస్’ కోటాని కూడా కోర్టు కొట్టివేసింది. ఇటువంటి పధకాల ద్వారా తమ రాష్ట్రంలో ఆరోగ్య వసతులు సమకూర్చుకోవటానికి కూడా రాష్ట్రాలకి హక్కు లేకపోతే ఈ దేశంలో సమాఖ్య స్ఫూర్తి మరింకెక్కడ ఉందో నాకైతే తెలీదు.

నీట్ పరీక్షకి ముందు, ‘ఇన్-సర్వీస్’ కోటా అమలులో ఉన్నప్పుడు పై చదువులకి సమయం కానీ వనరులు కానీ లేకపోయినా కూడా  వివిధ సామాజిక-ఆర్ధిక నేపధ్యాల నుండి విద్యార్ధులు ప్రభుత్వ సర్వీస్ లోకి వచ్చేవారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, జిల్లా ఆసుపత్రులు నిరంతరాయంగా పనిచెయ్యటానికి ఇది బాగా ఉపయోగపడింది. ప్రభుత్వ సర్వీస్ లోకి నిరంతరాయంగా డాక్టర్లు రావటం దీనికి కారణం.

‘ఇన్-సర్వీస్’ కోటా రద్దు చెయ్యటం, నీట్ పరీక్ష అమలులోకి రావటంతో ప్రభుత్వ సర్వీస్ లోకి డాక్టర్లు రావటానికి అడ్డుకట్ట పడింది. నేడు గ్రాడ్యుయేట్ కోర్సులలోకి వచ్చే వారందరూ గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష శిక్షణ కోసం డబ్బులు ఖర్చుపెట్టగలిగే ఎలీట్ నేపధ్యం నుండి వస్తున్న వారే.

వారు వచ్చే నేపధ్యం వలన, ‘ఇన్’సర్వీస్’ కోటా రద్దు చెయ్యటం వలన నేడు గ్రాడ్యుయేట్ డాక్టర్లు అందరూ ప్రభుత్వ సర్వీస్ కాదనుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ పరీక్ష శిక్షణకి వెళుతున్నారు. ఇది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం కావటానికి , ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థ బలం పుంజుకోవడానికి బాగా దోహదం చేస్తుంది.

ప్రధానమంత్రికి రాసిన లేఖలో జయలలిత కూడా ఇదే పేర్కొన్నారు. నీట్ పరీక్ష రాష్ట్ర వైద్య వ్యవస్థకి అవసరమైన డాక్టర్ల కోసం ఉద్దేశించిన విధాన చర్యలని నిర్వీర్యం చేస్తుంది, తమిళనాడు ఏర్పరుచుకున్న సామాజిక-ఆర్ధిక లక్ష్యాలకు తూట్లు పొడుస్తుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న సామాజిక-ఆర్ధిక పరిస్థితులకి, తమిళనాడు’ పాలనావసరాలకి నీట్ పరీక్ష ఎంత మాత్రం దోహదకారి కాదు అని పేర్కొన్నారు. అనితే కనుక బతికి ఉంటే ఈ పాటికి రెండో సంవత్సరంలో ఉండేది అనే వాస్తవం ఈ మాటలు ఎంత వాస్తవమో చెబుతున్నాయి.

నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేక 2017 సెప్టెంబర్‌లో  అనిత ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి

ఇది కేవలం అనితకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వలేదని ఈ సంవత్సరం ముగ్గురు ఆడ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తివిద్యా కోర్సులలో మహిళల ప్రాతినిధ్యం ఒక ఆందోళనకరమైన విషయం. ఈ పరీక్షా విధానం, దానికి తోడుగా శిక్షణా కేంద్రాల వ్యవస్థ ఒక భిన్నమైన  పరిస్థితికి దారి తీశాయి. వారి సామర్ధ్యాన్ని బట్టి కాక వారి తల్లి తండ్రుల ఆర్ధిక స్థోమతని బట్టి విద్యార్ధులు ఈ ఉమ్మడి అర్హత పరీక్షలలో సఫలం అవుతున్నారు.  సహజంగానే ఇది మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చదువు విషయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆడపిల్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు.

ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే ఐ.ఐ.టి, మద్రాస్, అన్నా విశ్వవిద్యాలయంలో మహిళల ప్రాతినిధ్యం చూడాలి. సర్దార్ వల్లభాయి పటేల్ రోడ్డుకు అటు ఇటు ఉన్న ఈ విశ్వవిద్యాలయాలలో మహిళల ప్రాతినిధ్యాల మధ్య ఉన్న తీవ్ర అంతరానికి కారణం అభ్యర్ధులని ఎంపిక చేసే విధానం మాత్రమే. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు తక్కువ ఖర్చు అయ్యేట్లయితే (హయ్యర్ సెకండరీ పరీక్షలు) ఎక్కువమంది ఆడపిల్లలు ఉంటారు. ఎక్కువ ఖర్చయ్యేట్లయితే (ఉమ్మడి అర్హత పరీక్ష) తక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు.

ఒక పక్క నీట్ పరీక్ష ఎంతోమంది స్వప్నాలను చిదిమేస్తుంటే, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దారిలో ఎదురయిన అవరోధాలను అధిగమించేందుకు గట్టిగా ప్రయత్నించిన రాష్ట్ర అధికార యంత్రాంగం  పట్టుదల ఇప్పుడేమయిందా అన్న ఆలోచన రాకమానదు.

డా. పి.ఎమ్.యాళిని

వ్యాసకర్త థేని ప్రభుత్వ మెడికల్ కాలేజి నుంచి పట్టా పొందిన వైద్యురాలు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment