కొత్త వివాహ చట్టం ‘లవ్ జీహాద్’ రాజ్యాంగానికి విరుద్ధం…?

భారతదేశంలోని మతం అనే అంశం కేంద్రంగా ఏ ఒక్క చట్టం అమలు పరిచినా అది ఎంతో సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం ‘లవ్ జిహాద్’ పేరు మీద బయటకు వచ్చిన కొత్త చట్టం ఇప్పుడు అనేక చర్చలకు దారి తీసింది…

 

మత మార్పిడిలే లక్ష్యం…..

బలవంతపు మతమార్పిడి లను అడ్డుకోవడమే లక్ష్యంగా ‘ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2020’ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు కొత్తేమీకాదు. వాటిలో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, అసోం వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి బిల్లులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు వేరువేరు మతాలకి చెందిన వారికి పెళ్లి కి అడ్డుగా నిలవడంతో చాలామంది తప్పనిసరిగా మతం మారుతున్నారు. అది వారి ఇష్టం లేకపోయినా జరుగుతోంది కానీ పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా మతం మారాల్సిన పనిలేదని ఈ కొత్త చట్టం చెబుతోంది.

వారికే చట్టాలున్నాయా?

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే…. ప్రేమ-పెళ్లి ముసుగుతో కొంతమంది బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని… పెళ్లయిన తర్వాత ఎంతోమంది ఆడపిల్లలు దీని ద్వారా వేదన అనుభవిస్తున్నారు అని దానిని ‘లవ్ జిహాద్’ అని పిలుస్తున్నారు. నిజానికి భారత లవ్ జిహాద్ అనే పదాన్ని భారత రాజ్యాంగం నిర్మించలేదన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలి. ఇక ఎక్కడా కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా వెల్లడించలేదు. అసలు భారతదేశ రాజ్యాంగం ప్రకారం బలవంతంగా ఒక వ్యక్తి మతం మార్పించడం అనేది చట్టరీత్యా నేరమే. దాని కోసం కొత్త చట్టాలను తీసుకు రావాల్సిన అవసరం లేదు. దేశంలో వివాహ నమోదుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా ఒకే మతానికి చెందిన దంపతుల వివాహాలను నమోదు చేస్తారు.

అదనపు చట్టం ప్రమాదకరం…?

మరింత లోతుగా చూస్తే…. వేరే మతాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరిలో ఒకరు రెండవ వారి మతానికి మారాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం ముందే చూపబడింది. ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1951’ ని కేంద్రం గతంలో తీసుకువచ్చింది. చట్టపరంగా ఏ మతం వారైనా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఇక దీనిపై కొత్త చట్టాన్ని తీసుకొని వస్తే రాజ్యాంగంపై ఉన్న గౌరవం అందరికీ సన్నగిల్లుతుంది అని అంటున్నారు. నిజానికి ఇలాంటి చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతున్నారు. అవసరం లేని చోట చట్టం చేస్తే భారత రాజ్యాంగంలోని నిలకడ లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అది ఎంతో ప్రమాదకరం అని వాదిస్తున్నారు.