NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..! కాంగ్రెస్ కి కేసీఆర్ భారీ గిఫ్ట్..!!

తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనానికి తెర లేవబోతుంది..! సాధారణంగా ఓటమిని అంగీకరించని కేసీఆర్ కి వరుసగా రెండు ఓటములు పాఠం నేర్పించాయి. దుబ్బాకలో ఓటమితో షాక్ తిన్న కేసీఆర్ కి.., గ్రేటర్ లో బీజేపీ పుంజుకోవడం ఏ మాత్రం రుచించడం లేదు. అందుకే కేసీఆర్ మేల్కొనకపోతే “మాజీ సీఎం కేసీఆర్” అని అనిపించుకోక తప్పదు. పాపం కుమారుడికి బాధ్యతలు ఇచ్చేసి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేద్దాం అనుకుంటున్నా కేసీఆర్ కి తన చేతిలోని స్టీరింగునే బీజేపీ లాక్కోవడం కష్ట కాలమే. అందుకే కేసీఆర్ తన బుర్రకి పదును పెట్టారు. బీజేపీతో కాస్త స్నేహంగా ఉంటూనే.., కాంగ్రెస్ ని కొంచెం లేపే పనిలో ఉన్నారు. అదే వ్యూహం కాస్త లోతుగా చెప్పుకుందాం పదండి..!!

kcr self goal irks trs and ktr
kcr self goal irks trs and ktr

బీజేపీ మాత్రమే ప్రత్యర్థి కాదు..!!

టీఆరెస్ ఇన్నాళ్లు చేసిన తప్పు ఇదే. తన వ్యతిరేక ఓట్లు ముగ్గురికో, నాలుగురికో షేర్ చేస్తే బాగుండేది. అలా కాకుండా.. తన వ్యతిరేక ఓట్లు మొత్తం బీజేపీకి పడేలా టీఆరెస్ కొన్ని స్వీయ తప్పిదాలు చేసింది. బీజేపీని ఎక్కువ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ని పట్టించుకోలేదు. అందుకే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది, కేసీఆర్ వ్యతికరేకతని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. అందుకే ఇక మీదట తెలంగాణాలో కాంగ్రెస్ కూడా పైకి లేవాలి.., బీజేపీ, కాంగ్రెస్ సమంగా ఉండాలి అనేది కేసీఆర్ అనుకుంటున్నా లెక్క. అదే జరిగితే తన వ్యతిరేక ఓట్లు కోసం ఆ రెండూ పార్టీలు కొట్లాడుకుని.. చీల్చుకుని.. తననే నెగ్గేలా చేస్తాయి అనేది ఒక ప్లాన్. దీన్ని త్వరలో జరగనున్న “నాగార్జున సాగర్” ఉప ఎన్నిక నుండి మొదలు పెట్టె ప్రణాళికలో టీఆరెస్ ఉంది.

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలుపే..!!

బీజేపీని బలహీనం చేయాలి అంటే.. కాంగ్రెస్ ని లేపాలి. అదే జరగాలి అంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి చర్చ మొదలవ్వాలి. అది జరగాలి అంటే రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కి ఒక గెలుపు కావాలి. అప్పుడు బీజేపీ గురించి చర్చ తగ్గి.., కాంగ్రెస్ గురించి మొదలవుతుంది. తద్వారా టీఆరెస్ సేఫ్ గా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుంటాయి. అందుకే నాగార్జున సాగర్ లో జానారెడ్డి కుమారుడు కాంగ్రెస్ నుండి పోటీ చేయనున్నారు. జానారెడ్డి పట్టుతో.. కాంగ్రెస్ అక్కడ పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే దుబ్బాక అనే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆరెస్ కి నాగార్జున సాగర్ కోల్పోయిన పెద్ద నష్టమేమి ఉండదు. రానున్న రెండేళ్లలో టీఆరెస్ మళ్ళీ పుంజుకుంటుంది. కానీ బీజేపీకి మాత్రం నష్టమే. గ్రేటర్ గెలుపు, దుబ్బాక వాపు తగ్గి.., టీఆరెస్ పై పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ పై పెట్టాల్సి ఉంటుంది. సో.. ఇదన్నమాట కేసీఆర్ సింపుల్ సంచలన రాజకీయ ఎత్తుగడ. కేసీఆర్ రూపంలో కాంగ్రెస్ కి పెద్ద బహుమతి రాబోతుంది. అది బీజేపీకి షాక్ ఇవ్వబోతుంది.

author avatar
Srinivas Manem

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju