NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Nimmagadda Ramesh Kumar : మూడేళ్లు – వేల కోట్ల నిధులు – జగన్ ని నిమ్మగడ్డ అలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..!?

YSRCP ; Jagan VS Nimmagadda Super Twist

Nimmagadda Ramesh Kumar : ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ YS Jagan కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. (Nimmagadda Ramesh Kumar- YS Jagan) ఇద్దరి చేతుల్లోనూ ఉన్న వ్యవస్థల ద్వారా మొదట వైరం పెట్టుకుని.., ప్రస్తుతం వ్యక్తిగత వైరం వరకు విషయం వెళ్ళింది..! ఇప్పటికి అయితే ప్రజాబలం, శాసనాబలం పరంగా సీఎం జగన్ (Jagan) ఆధిపత్యంలో ఉన్నప్పటికీ.., రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగ సూత్రాల ఆధారంగా నిమ్మగడ్డ (Nimmagadda Ramesh Kumar) పై చేయి సాధించినట్టే..! అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నా వేళ.., (YS Jagan) జగన్ కీ- నిమ్మగడ్డ (Nimmagadda Ramesh Kumar) కి వైరం పెరుగుతున్న వేళ.. కడప జిల్లా వేదికగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda) చేసిన కొన్ని వ్యాఖ్యల్లో అంతరార్ధాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యల మూలాల్లోకి వెళ్లి చూస్తే.. (YS Jagan) జగన్ ని నిమ్మగడ్డ ఏ విద్యాగంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..? వైఎస్ హయాంలో నిమ్మగడ్డ పాత్ర ఏమిటి అనేది చూడొచ్చు..!!

Nimmagadda Ramesh Kumar : Blackmailing YS Jagan?
Nimmagadda Ramesh Kumar Blackmailing YS Jagan

 ఆ ఐదేళ్లు ఏం చేశారంటే..!!

రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లకు పైగా సీఎంగా పని చేసారు. 2004 లో వైఎస్ సీఎం అయ్యేనాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవసాయశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ సీఎం అయిన ఆరునెలలకు అంటే 2004 డిసెంబరులో గృహ నిర్మాణ శాఖ జాయింట్ సెక్రెటరీ గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత అదే శాఖకి ముఖ్య కార్యదర్శి అయ్యారు. నిమ్మగడ్డ ఈ హోదాలో ఉన్నప్పుడే రాష్ట్రంలో “ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం” ద్వారా మొదటి విడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలయింది. అలా 2006 మే నెల వరకు గృహ నిర్మాణ శాఖలో కీలక హోదాలో పని చేసిన ఆయన సీఎం వైఎస్ కి అత్యంత సన్నిహితులుగా మారారు.

* వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2006 నుండి 2009 మధ్య రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులకు వెళ్ళింది. లక్షలాదిగా ఇందిరమ్మ ఇల్లు.., ఆరోగ్యశ్రీ.., ఫీజు రీ ఎంబెర్సెమెంట్ లతో పాటూ జలయజ్ఞం కూడా తోడైంది. అప్పుడు ఆర్ధిక శాఖ మంత్రిగా రోశయ్య – సీఎం వైఎస్ ఇద్దరూ కలిసి చర్చించుకుని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించారు. అలా 2006 మే నుండి 2009 మార్చి వరకు ఆర్ధిక శాఖలో ముఖ్యకార్యదర్శిగా పని చేసారు. ఈ సమయంలోనే కీలక ఫైళ్లు ఆయన వద్దకు వచ్చేవి. “సీఎం కుమారుడు జగన్ ఆబ్లిగేషన్” అంటూ అనేక ఫైళ్లు వచ్చేవి. అలా మూడేళ్ళ పాత ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ .. ఆ తర్వాత రాజ్ భవన్ కార్యదర్శిగా వెళ్లిపోయారు. అక్కడే ఏడేళ్లు పని చేసి రిటైర్ అయ్యారు.

Nimmagadda Ramesh Kumar : Blackmailing YS Jagan?
Nimmagadda Ramesh Kumar Blackmailing YS Jagan

Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ కి జగన్ దొరికేసినట్టేనా..!?

తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ భారీగా ఆస్తులు కూడగట్టుకున్నారు అని జగన్ పై ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ కేసులు నమోదు చేసింది, రూ. 43 వేల కోట్లు అంటూ చార్జిషీట్లు కూడా వేసింది. ఇప్పటికీ ఈ కేసులు అటూ తేలలేదు. అంటే అప్పట్లో ఆర్థికశాఖలో కీలక హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కి తెలియకుండా ఇటువంటి కీలక ఫైళ్లు కదిలే అవకాశమే లేదు. జగన్ కేసుల్లో కొందరు ఐఏఎస్ లు విచారణకు హాజరయ్యారు, కొందరు జైలుకి కూడా వెళ్లారు. కానీ నిమ్మగడ్డ రమేష్ ప్రస్తావన మాత్రం ఎక్కడా రాలేదు. కానీ.., తొలిసారిగా కడప జిల్లాలో నిమ్మగడ్డనే తన నోటితో తాను ఆ కేసుల్లో సాక్షిగా ఉంటానని చెప్పడంతో జగన్ ని ఈ కీలక సమయంలో నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న టాక్ వస్తుంది. తమ చేతిలో ఉన్న వ్యవస్థలతోనూ.., వ్యక్తిగతంగానూ ఒకరంటే ఒకరు, ఒకరిపై ఒకరు తలపడుతున్న దశలో నిమ్మగడ్డ ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు..? అనేది ఇట్టే చెప్పేయొచ్చు..! ఒక ముందస్తు వ్యూహంతో.., ఒక తలపండిన రాజకీయ నేతలా.. ఒక సీఎంని ధిక్కరిస్తున్న అధికారి హోదాలో నిమ్మగడ్డ ఇంత ధీమాగా మాట్లాడుతున్నారు అంటే అతని వెనుక శక్తిని ఇట్టే కనిపెట్టేయొచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?