NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Nimmagadda VS CM Jagan : ఇప్పటిది ట్రైలర్ మాత్రమే..! ముందుంది సినిమా ఫైట్..!!

Nimmagadda VS CM Jagan : Big Fight soon

Nimmagadda VS CM Jagan : మార్చి 31 ఎప్పుడు వస్తుందో.. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడు రిటైర్ అవుతారో..!? ఆయన ఆ కుర్చీలో ఉండే వరకు ప్రభుత్వానికి ఆయనకు పడదు. మాటిమాటికి కోర్టులకు వెల్తూనే ఉంటారు. ఏ క్షణం, ఏ రోజు ఏమౌతుందా..? అంటూ సగటు రాజకీయ వాదికి ఒక పెద్ద పరీక్ష..! నిమ్మగడ్డ (Nimmagadda Ramesh kumar) ఎన్నికలు నిర్వహించని.., వదిలేయనీ.. ఏమైనా కానీ … ఈ ఏపీలో లొల్లి మాత్రం ఆగడం లేదు. సర్పంచి ఎన్నికలు అంటూ ఇన్నాళ్లుగా జరుగుతున్న లొల్లి కేవలం ట్రైలర్ మాత్రమే. అసలైన పెద్ద సినిమా ముందుంది. ఇంకా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను రేపో, ఎల్లుండో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ల సాక్క్షిగా YS Jagan (జగన్) X నిమ్మగడ్డ మధ్య ఓ పెద్ద వార్ కి తెరలేవనుంది..! ఎలా, ఎందుకు..? అనేది చూద్దాం పదండి..!!

Must Read : మార్చి 5 న తేలనున్న సీఎం జగన్ భవితవ్యం..!?

Nimmagadda VS CM Jagan : Big Fight soon
Nimmagadda VS CM Jagan Big Fight soon

Nimmagadda VS CM Jagan : నోటిఫికేషన్లు ఎలా ఇవ్వనున్నారు..!?

రాష్ట్రంలో సర్పంచి ఎన్నికలు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ నెల 17 న మూడోదశ.., 21 న నాలుగో దశ ఎన్నికలతో అవి ముగియనున్నాయి. అంటే నిమ్మగడ్డ బాధ్యత తీరినట్టు కాదు. ఇంకా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నిజానికి ఈ సర్పంచుల ఎన్నికలు కంటే ఆ ఎన్నికలే అత్యంత ముఖ్యం. అందుకే ఆ నోటిఫికేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

* గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 24 శాతం ఎంపీటీసీ స్థానాలు, 21 శాతం జేడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నాడు కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేసారు. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఫ్రెష్ గా షెడ్యూలు ఇస్తారా..? లేదా ఎక్కడ ఆగాయి అక్కడి నుండి కొనసాగిస్తారా..? అనేది పెద్ద అనుమానం. ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే గత ఏడాది నాటి ఏకగ్రీవాలు అన్నీ వైసీపీ కోల్పోయినట్టే. అందుకు జగన్ కానీ.. ఆ పార్టీ కానీ అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే నిమ్మగడ్డ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోర్టుకు వెళ్లేందుకు ఆల్రెడీ కొన్ని న్యాయ సూత్రాలను పట్టేసుకుంది. ప్రభుత్వంతో పాటూ.. నాడు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కూడా అనుబంధ పిటిషన్ వేయనున్నారు.

Nimmagadda VS CM Jagan : Big Fight soon
Nimmagadda VS CM Jagan Big Fight soon

ఒకవేళ పాతవి కొనసాగిస్తే టీడీపీ కూడా..!!

ఫ్రెష్ నోటిఫికేషన్ / షెడ్యూల్ కాకుండా.. గత ఏడాది ఎక్కడ ఆగాయి.. అక్కడి నుండి కొనసాగింపు అంటూ నిమ్మగడ్డ ప్రకటిస్తే వైసీపీకి పండగే. నాడు ఏకగ్రీవం చేసుకున్న స్థానాలన్నీ నిలబడినట్టే. కాకపోతే అదే జరిగితే టీడీపీ కోర్టులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిమ్మగడ్డని అడ్డముగా ఇరికించే ప్రణాళిక కూడా వేసింది. “గత ఏడాది తనను ఎన్నికల కమీషనర్ గా తనను తొలగించినప్పుడు ఆయన కోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో “రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవాలు అన్ని అక్రమాలే, నేను అవి అడ్డుకుంటాను కాబట్టి నన్ను తొలగించారు” అంటూ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. అంటే ఆయన నాటి ఏకగ్రీవాలు అన్ని అక్రమాలు అంటూ కోర్టులో ఒప్పుకున్నట్టే. సో.. ఈ పాయింట్ ఆధారంగా నిమ్మగడ్డని ఇరికించి… ఏకగ్రీవాలను రద్దు చేయించాలని టీడీపీ ఉంది..! సో.. నిమ్మగడ్డ మాత్రం ఫ్రెష్ నోటిఫికేషన్ / షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది..!!

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju