Nithya Menon: ‘అలా మొదలైంది‘ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత తన కెరీర్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. స్కిన్ షో కి బాగా దూరంగా ఉండే నిత్యామీనన్ తన పాత్రకు చిత్రంలో ప్రాముఖ్యత ఉంటే తప్పించి సినిమాను ఒప్పుకోదు. అలా తెలుగులో ఆమె చేసిన కొన్ని సినిమాలు బాగా క్లిక్ అయ్యాయి.
Nithya Menon : సమంత, కాజల్ లను సైతం….
ఇక నిత్యామీనన్ కు ఒక మంచి అలవాటు ఉంది. తన చిత్రంలో తనతో పాటు స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిని మించిన ప్రాముఖ్యతను ఆమె సొంతం చేసుకుంటుంది. ఉదాహరణకు… ‘జనతా గ్యారేజ్‘ లో సమంత కథానాయిక. ఎన్టీఆర్–సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కానీ చివరకు ఎన్టీఆర్ కు నిత్యామీనన్ తో పెళ్లి జరుగుతుంది. అలాగే విజయ్ నటించిన ‘అదిరింది‘ సినిమా లో కాజల్, సమంత లాంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఉన్నారు. కానీ ఈ సినిమాలో నిత్యామీనన్ పాత్రకి ప్రాముఖ్యత ఎక్కువ. విజయ్ తో కలిసి ఆమె నటించిన సెంటిమెంట్ సీన్లు చిత్రానికే హైలైట్గా నిలిచింది.
సాయి పల్లవిదీ అదే కోవ…
ఇలా స్టార్ హీరోయిన్లు సినిమాల్లో నిత్య తన పాత్రకు తగ్గ క్రెడిట్ చూసుకుంటుంది. ఇక ఇప్పుడు తెలుగులో సాయిపల్లవి ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె వీడియోలు రికార్డు స్థాయిలో యూట్యూబ్ లో లైకులు, వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం కెరీర్లో సూపర్ ఫామ్ లో ఉన్న సాయి పల్లవి కి నిత్యామీనన్ కు చాలా పోలికలు ఉన్నాయి. సాయిపల్లవి కూడా నిత్యామీనన్ లాగే కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తుంది.
Nithya Menon : సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసింది…
అయితే పవన్ కళ్యాణ్–రానా మల్టీస్టార్ గా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుం‘ రీమేక్ లో మొదట పవన్ పక్కన సాయి పల్లవి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం నిత్యమీనన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. సాయి పల్లవి డేట్లు సర్దుబాటు కాలేదో లేదా పవన్ కళ్యాణ్ పక్కన సరిపడదు అని భావించారో తెలియదు కానీ నిత్యామీనన్ మాత్రం ఈ పాత్రకి పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యారట. ఈ చిత్రంలో నిత్యా పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఇప్పుడు ఐశ్వర్య వంతు…!
సినిమాలోని కథానాయకులతో ఏ విషయంలో తగ్గకుండా ఉంటే ఈ పాత్రకు నిత్యామీనన్ దాదాపు ఖరారయినట్లే. ఇక రానాకు జోడిగా ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ధృవీకరించాడు వంశీ. మనం మళయాళంలో ఈ చిత్రం చూస్తే అసలు ఐశ్వర్య రాజేష్ పాత్రకు ప్రాముఖ్యత ఉండదు. కేవలం రెండు మూడు సీన్లలోనే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. కానీ నిత్యామీనన్ కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కాబట్టి చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా… స్టార్ హీరోయిన్లు అయినా… నిత్యామీనన్ మాత్రం తన డామినేషన్ చూపించుకుంటూనే ఉంది.