NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ నాలుగు నగరాలనీ మోడీ కాదు కదా .. ఎవ్వడూ కాపాడలేడు !

మొదటి నుండి భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ముంబై, చెన్నై ఢిల్లీ వంటి మహానగరాలలో ఎక్కువగా ఉంది. మొదటగా ఆ నగరాల్లోనే కేసులు బయటపడి ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి రేటు పెరగడంతో పాటు కేసులు కూడా అత్యధికంగా అక్కడే బయటపడ్డాయి. మరణాల సంఖ్య లో రికార్డులు నమోదు కావడం… ఎవరు అంచనా వేయలేని రీతిలో కంటోన్మెంట్ క్లస్టర్లు ఏర్పడడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు క్రమంగా పైన చెప్పబడిన మహానగరాలలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కరోనా వ్యాప్తి నుండి కూడా అవి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాయి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది..?

 

ఆ నాలుగులో అదే ఘోరం

ముంబై, చెన్నై, ఢిల్లీ మహానగరాల్లో ప్రజలకు కొంత ఉపశమనం కలిగినా కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్న మరో నాలుగు నగరాలు ఏవంటే హైదరాబాద్, బెంగళూరు, పుణే మరియు థానే. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న చర్యల కారణంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఆ నగరంలో 89 శాతం రికవరీ రేటు ఉండడం చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.అయితే పైన చెప్పబడిన ఈ నాలుగు నగరాల్లో మాత్రం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం ముఖ్యమైన కారణం అని చెప్పాలి. ఒక్క బెంగళూరు నగరంలోనే సంఖ్య అధికంగా ఉంది. కర్ణాటకలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసుల్లో బెంగళూరు నగరంలో ఉండడం విశేషం.

హైదరాబాదు అదే తీరు

ఇక మరో మహా నగరమైన హైదరాబాద్లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొద్ది వారాల క్రితం హైదరాబాద్ నగరంలో టెస్ట్ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరికి వైరస్ ఉండడం బట్టి చూస్తే ఆ నగరంలో వైరస్ ఎంత భారీగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఎంతలేదన్నా రోజుకు 500 నుండి 700 వరకు కేసులు నమోదవుతున్నాయి. అది కూడా తెలంగాణ ప్రభుత్వం చేసే అర కొర టెస్టులకు. ఈ నగరం లో వైరస్ వ్యాప్తి రానున్న కాలంలో మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 45 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నగర శివార్లలలో కూడా భారీగా వైరస్ వ్యాప్తి చెందడం అందరిని ఆందోళనలో పడేస్తోంది.

‘మహా’ముప్పు అక్కడి నుండే

ముంబై ని వైరస్ ముప్పు వీడింది అనుకుంటున్న తరుణంలో మహారాష్ట్రలోని మరో రెండు ప్రధాన నగరాలైన పూణే, థానే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో పడ్డాయి. ఈ రెండు నగరాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఇకపోతే ప్రభుత్వం పరీక్షల సంఖ్యను కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికి ఐదు లక్షల కేసులు దాటిన ఈ రాష్ట్రంలో ముంబై కాకుండా మరో రెండు నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరగడం అనేది ఆందోళన కలిగించే విషయమే.

ఇక వీటి పై చర్యలు తీసుకునే విషయంలో మోదీకి మాత్రం చాలా ఆటంకాలు ఎదురు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు ఎన్నో అంశాలను మోడీ పరిగణించాల్సి ఉండగా ప్రస్తుతానికైతే అతని ప్రభుత్వం కూడా ఈ నగరాలలోని వైరస్ వ్యాప్తి విషయమై ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?