ముఖ్యమంత్రుల భేటీ లో కేసీఆర్ అన్న మాటలు విని మోదీ నోట మాట రాలేదు..!

కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకునేందుకు అలాగే ఆయా ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ల సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

కేసీఆరా మజాకా..!

అయితే అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కు హాజరు కావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అక్కడ ఒక సన్నివేశం కూడా చోటు చేసుకుంది. ఇక ఇలాంటి కీలక విషయాల్లో తన సలహాలు సూచనలు ఇచ్చే కేసీఆర్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మధ్య ఎలా ప్రవర్తిస్తారో ఆసక్తి అందరిలో ఉంది. ఇక మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ విలువైన సూచనలు ఇచ్చారు అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

సలహాలు, సూచనలు….

వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని… శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావడం మరింత ముఖ్యమని అన్నారు. ఇక అలాగే వ్యాక్సిన్ కారణంగా ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటే వాటిని ముందే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ముందు ఎవరికి వ్యాక్సిన్స్ సప్లై చేయాలి అన్న విషయంపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అలాగే వైరస్ దేశం మొత్తం ఒకేలాగా ప్రభావం చూపలేదు కాబట్టి ఈ వ్యాక్సిన్ కూడా ఒక చోట ఒక సైడ్ ఎఫెక్ట్ మరొకచోట మరొక అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిపారు.

 

ఇక్కడా ట్రయల్స్ ఉండాలి

ఇక కేసీఆర్ ఇచ్చిన సూచనల ప్రకారం మొదట అన్ని రాష్ట్రాలకు కొన్ని డోస్ లను పంపించి కొందరికి ఆ తర్వాత రాష్ట్రంలో అందజేసి 15 రోజులు పరిస్థితులను పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని అన్నారు. ఇదంతా చూసిన తర్వాత వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరించాల్సిన కీలక అంశాలనుకేసీఆర్ ప్రస్తావించారు అని చెప్పక తప్పదు. ఇలా అందరి అభిప్రాయాన్నిలని పరిగణలోకి తీసుకుని అందుకు వీలుగా ఉండేందుకు మోడీ భేటీ ఏర్పాటు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇలా మాట్లాడడం నిజంగా ప్రశంసనీయం. ఆయన నిబద్ధత చూసి మోదీ నోట మాట రాలేదు అని అంటున్నారు. ఆయన రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు పెద్దపీట వేశారని ఆ సంకేతాలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్పాలి.