Pavan Kalyan: ఫ్యాన్స్ పై పవన్ కి కోపమెందుకు..!? ఎందుకిలా మారిపోయారు..!?

Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?
Share

Pavan Kalyan: “ఆయ్ అరవడం ఆపు.. నన్ను పవర్ స్టార్, పవర్ స్టార్ అని పిలవకండి.. మీ మెదడును కొంచెం పెంచుకోండి.. ముఖ్యమైన సమస్యలు పరిష్కరించేందుకు నేను ఇక్కడ ఉన్నాను, దయచేసి సహకరించండి, మనుషులు చచ్చిపోతుంటే ఎలా నవ్వుతారు.!?” – ఇటీవల గాజువాక సభలో పవన్ వ్యాఖ్యలు..!

“మీరు నా కోసం అరుస్తారు. సమావేశాలకు బాగా వస్తారు. కానీ ఓట్లు మాత్రం జగన్ కు వేస్తారు. మీకు అలాగే కావాలి, మీకు ఆయన లాంటి వాడే కరెక్టు. ఆయనకే ఓట్లు వేయండి”..! అంటూ మంగళగిరిలో అన్నారు..

అంటే అర్థమేమిటి..!? పవన్ కళ్యాణ్ ఎవరిపై అలిగారు..? ఎవరిపై కోప్పడుతున్నారు..? అలిగి అంటున్నారా..!? కోపంతో అంటున్నారా..? అసహనంతో అంటున్నారా..!? అనే అంశాలను పరిశీలిద్దాం..!

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వైఖరిలో ఇటీవల చాలా మార్పు కనబడుతోంది. గాజువాకలో చేసిన ప్రసంగం, అంతకు ముందు మంగళగిరి, పుట్టపర్తి సహా రిపబ్లిక్ ఈవెంట్ వేదికపై చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే ఓ స్పష్టమైన వైఖరి కనబడుతోంది. సభల్లో ఆయన అభిమానులు “పవర్ స్టార్.. పవర్ స్టార్” అని స్లోగన్స్ వస్తున్నా.., సీఎం, సీఎం అంటున్నా పవన్ కళ్యాణ్ బాగా ఫీలవుతున్నట్టున్నారు. సీరియస్ గానే కోప్పడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మాటల్లో ఒక మెచ్యూరిటీ లెవల్ గా చెప్పుకోవాల లేదా.. ఆయనలో అసహనం, కోపం కట్టలు తెంచుకుని రివర్స్ లో ఫాన్స్ కి దెప్పిపొడుపు అని భావించాలా..!? అనేది సందేహమే. నిజానికి పవన్ కళ్యాణ్ కు జనాకర్షక శక్తి ఉంది. జనంలో క్రేజ్ ఉంది. అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ సభ అంటే కుర్రవాళ్లే వస్తారు అని కానీ 70 శాతం మంది కుర్రవాళ్లు ఉంటే 30 శాతం మంది మద్య వయస్కులూ ఉంటారు. ఒకే సామాజికవర్గమే కాకుండా అందరూ వస్తారు. అది ఆయన జనాకర్షక ప్రత్యేకత. కానీ ఓట్లు పడడం లేదు. రాజకీయంగా పట్టు దొరకడం లేదు.. బహుశా ఆ ఆవేదన నుండి వచ్చిన అసహనం, ఆగ్రహం ఇలా బయటకు వచ్చి ఉండవచ్చు..!

Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?
Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?

Pavan Kalyan: ఓట్లేయమని రివర్స్ లో అడుగుతున్నారా..!?

ఇక పోతే 2024 నాటి ఎన్నికలకు ఏ స్ట్రాటజీ ప్రకారం వెళ్లబోతున్నారు..!? అంటే ఒక క్లారిటీ లేదు. కానీ తనకు తన అభిమానుల నుండి కావాల్సింది పవర్ స్టార్, పవర్ స్టార్ అనే అరుపులు కేరింతలు కాదు.., తనకు తన అభిమానుల నుండి పూర్తిగా కంకణబద్దులుగా పార్టీ తరపున పని చేయడం కావాలి.. ఓటు వేయడం కావాలి.., ఓట్లు వేయించడం కావాలి..! అందుకే ఆయన మీరు అరవడం కాదు పని చేయండి, సభల్లో అరుస్తూ కేరింతలు కొడుతూ ఓట్లు మాత్రం ఆయనకు వేస్తున్నారు అంటూ సెటైర్ లు వేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా వెనుకబడుతున్నారు,. ఆయన సాధించాల్సింది ఎందుకు సాదించలేకపోతున్నారు, ఎందుకు ఓడిపోయారు? ఎందుకు పార్టీ ఫెయిల్యూర్ దిశగా వెళ్లింది? అంటే కచ్చితంగా పవన్ అభిమానులే ( ఫ్యాన్)..! అవును చాలా వరకు పవన్ కళ్యాణ్ ని పెద్ద మైనస్ ఆయన అభిమానులే.. ఆయన అభిమానుల్లో క్రమశిక్షణ లోపం ఉంటుంది.. అది ఆయనను కూడా చికాకు పెడుతుంది. “సాధారణంగా రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే క్యాడర్ ఆ మీటింగ్ ను ఆసాంతం విని అర్ధం చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మీడింగ్ లలో ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలను విని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకపోగా.., కేకలు ఈలలు వేస్తూ గోల చేయడం, ఆయనను మాట్లాడనివ్వకుండా స్లోగన్స్ ఇవ్వడం చేస్తుంటారు”..! నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమి మాట్లాడుతున్నాడో వింటే కదా వారికి అవగాహన అయ్యేది. రాజకీయ పరిణితి ఉండేది. కానీ పవన్ సభల్లో ఆ క్రమశిక్షణ లోపించింది. కొన్ని సభల్లో అయితే అభిమానులు చేసిన హడావుడికి కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గోల ఆపుతారా..? వెళ్లిపోమ్మంటారా..? అని వేదిక నుండి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. సో. ఆయనకు ఫ్యాన్స్ అంత చిరాకు పెట్టిస్తున్నారు. వచ్చిన వాళ్లు అంతా ఓట్లు వేస్తున్నారా అంటే అదీ కూడా లేదు.

Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?
Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?

వేలల్లో వస్తే ఓట్లేసేస్తారా..!?

ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని నిజాలు గ్రహించాలి. మీటింగులకు వచ్చిన అందరూ ఓట్లు వేసెయ్యారు. కనీసం 20 శాతం మంది కూడా వేయరు. రాజకీయ నాయకుడికి అయితే.. మీటింగులకు వచ్చే జనంలో సగటున 30, 35 శాతం అయినా ఓట్లేస్తారు.. కానీ సినీ గ్లామర్ ఉన్న హీరోలకు సభలకు వచ్చే జనంలో కనీసం 10 శాతం మంది కూడా ఓట్లు వేయరు. ఆ ఛరిష్మాయ తెలుగునాట ఎన్టీఆర్.., తమిళనాట ఎంజీఆర్, జయలలితతో పోయినట్టే చెప్పుకోవచ్చు.. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగులకు వచ్చే అభిమానులు ఓట్లు వేయడం లేదు, కనీసం ఆ బాధ్యత తీసుకోవడం లేదు. ఒక్కో అభిమాని తాను ఓటు వేయడంతో పాటు మరో నలుగురితో ఓటు వేయించే బాధ్యత తీసుకుంటే పవన్ కళ్యాణ్ కు మంచి జరుగుతుంది. కానీ అంత సీన్ ఉన్న అభిమానులు లేరు. సోషల్ మీడియాలో అరవడం, పోస్టులకు తప్పితే మెచ్యురిటి ఉన్న ఫాన్స్ పవన్ కి లేరు.. మరో విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయాలన్నా, సైకిల్ యాత్ర చేయాలన్నా ఆయనకు ప్రధానంగా ఇబ్బంది అభిమానుల నుండే ఉంటుంది. అందరూ ఆయన మీద పడిపోతుంటారు. ఆయన స్పీచ్ వినరు,. క్రమశిక్షణగా ఉండరు. ఫోటోలు, వీడియోలు, కేకలు,గోలలతో అల్లరల్లరి చేస్తుంటారు. ఈ అల్లర్ల వద్ద ఆ నాయకుడు స్వేచ్చగా బయటకు రాలేని పరిస్థితి. చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. జగన్ చేస్తారు. షర్మిల పాదయాత్ర చేస్తారు వారి పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయగలరా అంటే ఆయన అభిమానులు ఆయన మీద పడిపోతుంటారు. దీంతో ఆయన పాదయాత్ర చేయలేరు. ఇది రాజకీయంగా నష్టం కలిగించే అంశం. నాయకుడు జనాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకం అయి సమస్యలు తెలుసుకుంటే ఫలితం ఉంటుంది.కానీ పవన్ కళ్యాణ్ కు ఆ పరిస్థితిని అభిమానులు కల్పించడం లేదు. ఆయనకు పాదయాత్ర చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లిన సందర్భంగా తొక్కిసలాట జరిగి ఇద్దరు చనిపోయారు. క్రమశిక్షణ లేని అభిమానుల కారణంగానే ఆయన జనాల్లోకి ఫ్రీగా రాలేకపోతున్నారు, ఇది ఆయన ఫెయిల్యూర్ కు ఉన్న అనేక కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.


Share

Related posts

‘మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదు’

somaraju sharma

అమరావతి విషయంలో జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

sekhar

ఇక చంద్రబాబుకి వారిద్దరే దిక్కు…!!

sekhar