NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

తప్పులు మీద తప్పులు..! పవన్ కి పార్టీ నడపడం తెలిసేదెన్నడు..!?

తెరపై ఇచ్చే ఒక స్టైల్ ఆ సినిమా టికెట్లు తెంచుతుంది. విలన్ కి ఇచ్చే ఒక వార్నింగ్ ఈలలు వేయిస్తుంది. ఒక స్టెప్ యువతని కేరింతలు కొట్టిస్తుంది. సినిమాల్లో వీటన్నిటిలో ఆరితేరిన పరిపూర్ణ హీరో పవన్ కళ్యాణ్..! (ఎస్ హీరో మాత్రమే.., ఆయన ఇంకా నటుడు కాలేదు. టైమ్ పట్టొచ్చు. ఆ మాటకొస్తే ఇప్పుడున్నది హీరోలు మాత్రమే నటులు స్వల్పమే)..!!

ఒక టెంపర్మెంట్ డైలాగ్ సభల్లో ఊపు తెస్తుంది. ఒక ఆవేశపూరిత అరుపు కుర్రోళ్లచేత జేజేలు పలికిస్తుంది. రెడ్ టవల్ ఎగరేసి, ఇచ్చే వార్నింగ్ రాజకీయాన్ని వేడి చేస్తుంది..! కానీ వీటిని చేతల్లో చూపించలేని అసంపూర్ణ నాయకుడు పవన్ కళ్యాణ్..!

Janasena BJP

తప్పులు మీద తప్పులు..!!

పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల కష్టాలు ప్రస్తావించాలి అనుకోవడం తప్పు కానీ కాదు..! కానీ ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు, రాజకీయ పార్టీ అధినేతగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, భిన్న సమయాల్లో భిన్న ప్రకటనలు ఆయనపై సొంత మనుషుల్లోనే అనుమానాలు కలిగిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ విమర్శలు వ్యాపిస్తున్నాయి. తాజా తప్పుని ముందు చెప్పుకుందాం..! గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎందుకు మొదట ప్రకటించినట్టు..? అలా ప్రకటించిన తర్వాత ఆ ఏర్పాట్లలో ఉండకుండా మళ్ళీ ఎందుకు ఏపీ రాజకీయాలపై మాట్లాడినట్టు..? పోనీ బీజేపీ నేతలు వచ్చి బతిమాలితే.., సహకారం కోరితే కనీసం పదో, పదిహేనో సీట్లు అడిగి పోటీకి దిగకుండా ఎందుకు మొత్తం వదిలెయ్యడం..!? మొత్తం వదిలేశాక కూడా దానికి పొత్తు అని ఎందుకు పేరు పెట్టడం..!? అంటే బీజేపీ- జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 150 స్థానాల్లో.., జనసేన 0 (సున్నా) స్థానాల్లో పోటీ చేస్తున్నట్టా..!? ఇదేమి రాజకీయం..!?

నిర్ణయాల్లో గందరగోళం దేనికి..!?

ఏదో సిల్లీగా.., చిన్న పిల్లల ఆటల్లా పోటీ చేస్తాం అని కొందరు నామినేషన్లు వేసాక అవి ఉపసంహరించుకుంటాం అని చెప్పడం గందరగోళానికి సంకేతమే కదా..!? ఇక కాసేపు గ్రేటర్ గొడవ వదిలేస్తే..!! ఏపీలో బీజేపీతో పొత్తు విషయంలో ఒక స్పష్టత మాత్రం ఆ పార్టీలో లేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో గందరగోళం ఉంది. పవన్ ప్రెస్ మీట్ పెట్టినా.., పార్టీ మీటింగ్ పెట్టినా.., వైసీపీని, జగన్ ని విమర్శిస్తున్నారు..! సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టినా.., పార్టీ మీటింగ్ పెట్టినా టీడీపీని విమర్శిస్తున్నారు.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

ఒక ముక్కలో చెప్పాలంటే…!
“సోము వీర్రాజు జగన్ ని తమలపాకుతో కొట్టి.., చంద్రబాబుని ఇనుపరాడ్డుతో కొడుతుంటే..! పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుని తమలపాకుతో కొట్టి.., జగన్ ని ఇనుపరాడ్డుతో కొడుతున్నారు..!” ఈ లెక్క ఏ లెక్క కిందకు వస్తుందో అటు పవన్ కానీ.., ఇటు బీజేపీ కానీ సమాధానం చెప్పగలరా..!? పొత్తుల్లోనే కత్తులు దూసుకుంటూ ఈ చీకటి రాజకీయాలు ఏమిటి..!? రాజధాని వికేంద్రీకరణ, పోలవరం నిధులు, టీటీడీ డిక్లరేషన్, స్థానిక ఎన్నికల వ్యవహారం ఇలా అన్నిట్లో జనసేనాని ఒకలా.., బీజేపీ సోము ఒకలా స్పందిస్తున్నారు. సో.., పొత్తుల లెక్కలు ఏమిటో క్షేత్రస్థాయిలో జనసైనికుడికి మాత్రం అర్ధం కావడం లేదు. కానీ ప్రతి జనసైనికుడికి అభిమానం చావదు. వారు ఓటేస్తారు. కానీ ఇలాగే పవన్ అపరిపక్వ రాజకీయం చేస్తే.., తప్పుల మీద తప్పులు చేస్తే ఓటు వేయించలేరు. గెలవాలంటే ఓట్లు వేస్తె సరిపోదు.., ఓట్లు వేయించగలగాలి. అలా చేసే వెసులుబాటు జనసైనికులకు, జనసేనానే ఇవ్వడం లేదు అనేది ఓ అంతర్గత ఆవేదన..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju