NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

  దిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ vs సోము వీర్రాజు…?

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీతో చేతులు కలిపిన తర్వాత సోము వీర్రాజు నియామకం కూడా ఏకకాలంలో జరగడంతో అందరిలో చాలా అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని మొదట అంచనా వేశారు కానీ అటువంటి సూచనలు ఏమీ కనిపించకపోవడంతో ఊరుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అసలైన గేమ్ స్టార్ట్ అయింది అని అర్థం అవుతోంది….

 

దిల్లీ వెళ్ళగానే దిగులు పట్టుకుంది….

విషయం ఏమిటంటే…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఢిల్లీ టూర్ కి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఏపీ బిజెపి లో టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తాడు అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారు. జనసేన వారితో ఎంతవరకు మంతనాలు జరిపారో తెలియదు కానీ పవన్ దిల్లీ ప్రయాణం మాత్రం అందుకోసమే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీర్రకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కు ఆయన అంటే మండుతోందని సమాచారం. ఇక ఇప్పుడు ఢిల్లీ టూర్ లో పవన్ అజెండా ఎవరికి తెలియకపోయినప్పటికీ ప్రతిపక్షాల అధినేతలతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశం అవుతున్నారని…. ఇందులో భాగంగా జనసేన అధినేతకు ఆహ్వానం కూడా లభించిందని అంటున్నారు.

అక్కడ వదులుకున్నా ఇక్కడ రాబట్టాలి….

అయితే పవన్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినా…. నడ్డా ఇప్పుడు అంతా ఖాళీగా ఉన్నారా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఇక జేపీ నడ్డా తో పవన్ కు భేటీ ఉంది అంటే ఇదేదో పెద్ద వ్యవహారమే అనుకుంటున్నారు. ప్రస్తుతం బిజెపి మెయిన్ అజెండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. తర్వాతే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ చేయడానికి పవన్ ఇప్పటికే ఒప్పుకున్నారు కాబట్టి వెనకడుగు వేసేది లేదు. మరి దానికి ప్రతిఫలంగా జనసేన పార్టీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబెట్టాలనేనా ఈ వ్యూహం అని అనుమానాలు మొదలయ్యాయి.

వీర్రాజు కి రిక్తహస్తాలేనా?

ఈ విషయంలో మరింత ముందుకు వెళితే… తమ భేటీలో ఉపఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేయించేందుకు పవన్ నడ్డా నుండి హామీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2019లో కూడా బిజెపి అభ్యర్థి కన్నా జనసేన మిత్రపక్షం అయినా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఎక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని కూడా అయినా తప్పకుండా గుర్తు చేస్తారని అంటున్నారు. కాబట్టి బిఎస్పి తో పోలిస్తే జనసేన పార్టీ ఇంకా బలంగా ఉంది అని…. బీజేపీ మద్దతు ఇస్తే తాము ప్రభావం చూపించగలము అని పవన్ నమ్ముతున్నారు. మరి పవన్ తో నడ్డా ఎంత మాత్రం ఏకీభవిస్తారో వేచి చూడాలి. నడ్డా హామీ చేస్తే మాత్రం అది వీర్రాజు కి ఖచ్చితంగా అసహనం తెప్పించే విషయమే.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju