NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Peddireddy X Chandrababu: బాబోరి “పగటి కల – పొలిటికల్ కళ”..!? “టార్గెట్ పెద్దిరెడ్డి – మిషన్ పుంగనూరు”..!

Peddireddy X Chandrababu: CBN Target on Punganur But...?

Peddireddy X Chandrababu: రాజకీయాల్లో ఒకే తరం నేతలు.. విద్యార్థి దశ నుండే శత్రువులు.. ఏళ్ల తరబడి పైచేయి కోసం పాకులాడుతున్న ఉద్ధండులు.. సమయం చిక్కితే ప్రత్యర్థిని నేలకు దించేయాలన్నంత కసి ఉన్న ముదుర్లు.. ఆ ఇద్దరిలో ఎప్పుడూ ఒకరిది పై చేయిగా నిలిస్తే.. గడిచిన రెండేళ్లుగా మాత్రం మరొకరిది పై చేయిగా మారింది..! ఆ ఇద్దరే చంద్రబాబు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..! పెద్దిరెడ్డి కుప్పం టార్గెట్ పెట్టారు, బాబుని ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అది సాధ్యమో, కాదో సంగతి పక్కన పెడితే… పెద్దిరెడ్డిని ఓడించడానికి బాబు కూడా ప్రణాళికలు సిద్ధం చేసాడట.. “మిషన్ పుంగనూరు” ఆరంభించారట..! అదే ఇప్పుడు గమ్మత్తు..!

వైసీపీలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై టార్గెట్ పెట్టిన విషయం తెలిసిందే. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో స్థానిక పంచాయతీలు, మండల పరిషత్ తో పాటు మున్సిపాలిటీ లో వైసీపీ పాగా వేసింది. ఎన్నికలు ఎలా జరిగాయి అనేది పక్కన పెడితే చంద్రబాబు కోటలో వైసీపీ గెలిచింది. కుప్పంను చేజిక్కించుకోవడం వైసీపీ లక్ష్యం, పెద్దిరెడ్డి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఛేదించారు. కుప్పంలో దెబ్బతీసిన పెద్దిరెడ్డి పై రివేంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆ ఆలోచనలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే పెద్దిరెడ్డికి పుంగనూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి. టీడీపీ ప్రయత్నిస్తే అక్కడ పెద్దిరెడ్డిని ఢీకొట్టడం సాధ్యమా, గెలుపు అవకాశాలు ఉంటాయా, వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో వరుసగా 30, 40వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుస్తూ వస్తున్న పెద్దిరెడ్డి అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే విషయాలను పరిశీలిస్తే…

Peddireddy X Chandrababu: CBN Target on Punganur But...?
Peddireddy X Chandrababu CBN Target on Punganur But

Peddireddy X Chandrababu: పుంగనూరు చరిత్ర ఇలా..!

పుంగనూరు నియోజకవర్గం 1952 లో ఏర్పడింది. అప్పటి నుండి టీడీపీ ఆవిర్భావం 1983 వరకూ ఆరు సార్లు ఎన్నికలు జరిగితే అయిదు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒక సారి స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. పుంగనూరులో టీడీపీకి స్ట్రాంగ్ పునాదులు పడ్డాయి. 1983 నుండి 85, 89, 94, 96 ఉప ఎన్నికల వరకూ అంటే అయిదు సార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలిచింది. 1999లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలవగా, 2004 లో టీడీపీ తరపున అమరనాధ్ రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత అప్పటి వరకూ పీలేరులో రాజకీయం కొనసాగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014,2019లో వైసీపీ తరపున వరుసగా మూడు సార్లు గెలిచారు. 2009లో 40వేల పైచిలుకు మెజార్టీ, 2014లో 34వేల పైచిలుకు మెజార్టీ, 2019లో 42వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు పెద్దిరెడ్డి. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాల విషయానికి వస్తే మొత్తం 2లక్షల 32వేల ఓటర్లు ఉండగా, అందులో బీసీ ఓటర్లే లక్షకు పైగా ఉన్నారు. బీసీల్లోనే యాదవులు 32వేలకు పైగా, వాల్మీకి, బోయ సామాజికవర్గానికి చెందిన 23వేల ఓట్లు ఉన్నాయి. ఇక రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 27వేల నుండి 30వేల వరకూ ఉండగా, ముస్లిం సామాజికవర్గ ఓట్లు సుమారు 25వేలు, బలిజ 27వేలు, ఎస్సీ సామాజికవర్గం 40వేల వరకూ ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు టీడీపీ, ఆరు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం చూస్తే 2019 ఎన్నికల్లో సుమారు 15వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జనసేనకు యాక్టివ్ ఇన్ చార్జి లేరు. ఇక్కడ జనసేన గట్టి నాయకుడిని నిలిపితే 15 వేల వరకూ పోల్ అయ్యే అవకాశం ఉంది.

Peddireddy X Chandrababu: CBN Target on Punganur But...?
Peddireddy X Chandrababu CBN Target on Punganur But

పెద్దిరెడ్డికి తిరుగు లేదు.. కానీ..!?

ఇక్కడ వైసీపీ, టీడీపీ బలబలాలు చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరుంది. ఓటరు నాడి ఆయనకు బాగా తెలుసు. ఓటరుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనే విషయాల్లో ఆరితేరిన నాయకుడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఖర్చుకు వెనుకాడే నాయకుడు కాదు. నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా అందిస్తూ ఉంటారు. ఆయనకు అనుచరగణం ఎక్కువ, యాక్టివ్ గా పని చేసే ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన సొంతం. ఓటర్లతో మమేకమై ఉంటారనే పేరు ఉంది. పెద్దిరెడ్డి మీద ఆ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు లేవు. వ్యతిరేక వర్గం అంటూ లేదు.

Peddireddy X Chandrababu: CBN Target on Punganur But...?
Peddireddy X Chandrababu CBN Target on Punganur But

* ఇక టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిగా చల్లా రామచంద్రారెడ్డి ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి తమ్ముడు భార్య అనీషా రెడ్డి పోటీ చేశారు. ఓటమి తరువాత ఆమె యాక్టివ్ గా లేకపోవడంతో ఇన్ చార్జిగా చల్లా రామచంద్రారెడ్డికి ఇచ్చారు. ఈయన పీలేరు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి కుమారుడు. ఈయనకు రెండు మండలాల్లో పట్టు ఉంది. ఆయన సొంత మండలం రొంపిచర్లతో పాటు పక్క మండలంలో మంచి పట్టు ఉంది. సొంతంగా ఆయనకు పది నుండి 15వేల ఓటు బ్యాంకు ఆయనకు ఉంది. కార్యకర్తల బలం, పార్టీ బలం ఉంది. 1983 నుండి వరుసగా అయిదు సార్లు గెలిచిన టీడీపీకి ఇక్కడ ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ గట్టిగా పని చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. అంకితభావంతో పని చేసే మండల, గ్రామ స్థాయి నాయకులు లేకపోవడం టీడీపీకి పెద్ద మైనస్ పాియంట్ గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా నాయకత్వ సమస్యతో ఇక్కడ టీడీపీ ఉనికికోల్పోయే పరిస్థితి. ఇక్కడ చల్లా రామచంద్రారెడ్డి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేసుకుని జనసేనతో పొత్తు పెట్టుకుని పోల్ మేనేజ్ మెంట్ సక్రమంగా చేస్తే పెద్దిరెడ్డికి పోటీ మాత్రమే ఇవ్వగలరు.

author avatar
Srinivas Manem

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !