NewsOrbit
బిగ్ స్టోరీ

ఎన్‌టి‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్యాయం – రోడ్డున పడ్డ విద్యార్ధులు – కాపాడేది ఎవరు ?

విపత్కర కరోనా సమయంలో ప్రజలను తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతుంది పోలీసులు మరియు డాక్టర్లు అన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి డాక్టర్లను రోడ్డుమీదకు వచ్చి కూర్చునేలా చేసిన తీరు ఇప్పుడు మన రాష్ట్ర ప్రైవేటు మెడికల్ కళాశాలలు మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. తమకు సీట్లు వచ్చినా కూడా ప్రైవేటు వైద్య కళాశాలల్లో తమకు అడ్మిషన్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు.

Sad we have to fight for admission while on COVID-19 duty': MBBS ...

వివరాల్లోకి వెళితే జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 56 ప్రకారం ప్రైవేటు మెడికల్ కళాశాలలో అన్నింటిలో పీజీ సీటుకు చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించారు. ఇంకా ఫ్రీ సీట్ వస్తే బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు చెల్లించవలసిన మొత్తం మరింత తగ్గిపోతుంది. దీనికి ప్రైవేటు మెడికల్ కళాశాల లు ఏవి సముఖంగా లేవు. ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ విద్యను అభ్యసించాలని వేచి ఉన్న ఎంతో మంది విద్యార్థులకు కళాశాలలు పీజీ లో సీటు వచ్చినా అడ్మిషన్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇక వారు రాష్ట్రంలో విషయం తేలకపోయే సరికి దేశ వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ కు కూడా అనర్హులుగా మిగిలిపోయారు. ఇక్కడ సీటు గ్యారంటీ లేక అక్కడ కౌన్సిలింగ్ లో పాల్గొనలేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమకు సహాయం చేయమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని అడిగితే.. వారు కాస్తా చేతులెత్తేశారు. ఇక చివరి ప్రయత్నంగా వారు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఇప్పటికే కేసు ని 2 వాయిదాలు వేసింది.

నెల 24 తేదీన మరొక వాయిదా ఉండగా 27 లోపల విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి పీజీ మెడికల్ విద్యార్థులు ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన జీవో 56 ను అనుసరించి తమకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా న్యాయబద్ధంగా కోర్టు వారైనా మరొక వాయిదా వేయకుండా విషయంపై ఏదో ఒకటి తెలిస్తే మంచిదని వారు అంటున్నారు.

కరోనా సమయంలో వేలాది మంది పేషెంట్లను కాపాడుతున్న డాక్టర్ లను తీసుకుని వచ్చి ఇలా రోడ్డు మీద నిలబెట్టడం సబబుగా లేదని వారు వాపోతున్నారు. వారి మాటల్లో న్యాయం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే విషయంపై తగిన సంప్రదింపులు జరిపి విద్యార్థులకు మేలు చేకూరేలా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju