NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

PK Strategy: కేసీఆర్ కేకలు – ఏపీ మంత్రుల మాటలు..! ఇదేదో పీకే స్కెచ్చులా ఉందే..!?

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?

PK Strategy: కేసీఆర్ ఉన్నపళంగా బీజేపీకి వ్యతిరేకమయ్యారు..? బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానంటున్నారు..? కేంద్రానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతా, తెలంగాణాలో బీజేపీ నేతలపై కేసులు పెడతా.. జైల్లో పెడతా.. మళ్ళీ ఉద్యమిస్తా అంటున్నారు..! ఇదేదో తేడా కొట్టడం లేదా..!?

ఏపీలో మంత్రులు బీజేపీపై వ్యతిరేకగలం పెంచారు.. గళం విప్పి, దాటిమా మాట్లాడడంలో దిట్టయినా కొడాలి నాని ఈరోజు బీజేపీ నేతలను ఉతికారేసారు.. చిల్లర పార్టీ అని, సిల్లీ పార్టీ అని ఒక రేంజిలో మాట్లాడారు.. నిన్న సజ్జల, బుగ్గన కూడా ఇదే కోవలో మాట్టాడారు..! ఇదేదో తేడా కొట్టడం లేదా..!?

అక్కడ కేసీఆర్, ఇక్కడ ఏపీ మంత్రులు ఎందుకిలా బీజేపీకి వ్యతిరేకగలం విప్పుతున్నారు.. ఉన్నపళంగా బీజేపీని విలన్ గా చూస్తున్నారు.. మొన్నటి వరకు బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లిన పార్టీలే నేడు ఇలా బీజేపీపై తిరుగుబావుటా గొంతెత్తుతుంటే ఎక్కడో, ఏదో తేడా సంకేతాలు ఉండాలి కదా..!? అదేమిటో చూద్దాం రండి..!

మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.. చాలా రాష్ట్రాల్లో కమలం వాడిపోయింది. అమిత్ షా, మోడీల ద్వయానికి షాకులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో అయితే కనీసం డిపాజిట్ లు దక్కలేదు.. ఈ పాయింట్లు కొంచెం మైండ్ లో ఒక పక్కన పెట్టుకుని… కిందది చదవండి..!

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?
PK Strategy KCR Kodali in Part of PK Plan

“కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పీకే అలియాస్ ప్రశాంత్ కిషోరు కాంగ్రెస్ తో జత కట్టారు. అక్కడితో ఆగలేదు. ప్రాంతీయ పార్టీలన్నిటినీ మాల కట్టి కాంగ్రెస్ మెడలో వేసి.., రాహుల్ ని ప్రధానిని చేస్తానని వ్యూహాలు వేస్తున్నారు”..! ఓ వైపు పై పెయిన్ మాత్రం “బీజేపీ ఓటమి సాధ్యపడదు.., దేశంలో బీజేపీ బలమైన శక్తి.. కాంగ్రెస్ ఇంకా లేవలేదు”.. అంటూనే లోలోపల మాత్రం కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నాలు, ప్రణాళికలు వేస్తున్నారు. ఒకవేళ తాను అనుకున్నట్టుగా కాంగ్రెస్ లేవలేకపోతే.., “ప్రాంతీయ పార్టీల బలాన్నైయినా పెంచి.. అన్నిటినీ పోగేసి.. బీజేపీని చాలా చోట్ల ఓడించాలనేది అతని ప్రత్యామ్నాయ వ్యూహం” ఆపై… ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ కలిపితే బీజేపీ కంటే ఎక్కువ ఎంపీలు గెలవకపోరా..!? అనేది అతని ఆలోచన.. సో… మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని గొంతులు లేవాలి. గట్టిగా లేవాలి. అవసరం మేరకు ప్రశాంత్ కిశోరే పాయింట్లు ఇచ్చి లేపేందుకు సిద్ధంగానే ఉన్నాడు..

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?
PK Strategy KCR Kodali in Part of PK Plan

PK Strategy: ఇదే టైమ్ బీజేపీపై వ్యతిరేకతకు..!

పెట్రోల్ ధరలు మండుతున్నాయి.. నూనెల ధరలు పెరిగాయి.. గ్యాస్ ధరలు ఏ మాత్రం నియంత్రణ లేదు.. మధ్య తరగతి కుటుంబం అన్నిటా ఇబ్బందులు పడుతుంది.. పాపం ఆ బిక్క మధ్యతరగతి వాడికి ఆ ధరల పెరుగుదల పాపం, పుణ్యం మొత్తం బీజేపీ వాడిదేనని తెలియదు. సీఎంనే తిడతారు. “ఏపీలో జగన్ ధరలు పెంచుతున్నాడని.., తెలంగాణాలో కేసీఆర్ ధరలు పెంచుతున్నాడని.. ఆ మధ్యతరగతి వాడు తిడుతున్నాడు”.. కానీ.. అసలు లెక్క ప్రకారం “ఆ వ్యతిరేకతను బీజేపీపై తోయాలి.. ఆ పాపం వలన వచ్చిన శాపాన్ని బీజేపీపై వేయాలి.. అందుకే కేసీఆర్ లాంటి గళం లేవాలి”.. సో.. ఈ లెక్కల్లో భాగంగా కేసీఆర్ అనే మాటకారికి పీకే పైకి లేపాడు. ఏపీలో కూడా జగన్ పార్టీలో వాళ్ళని లేపాడు. జగన్ కి ఉన్న బలహీనతలు దృష్ట్యా అతను మాట్లాడలేరు.. (అఫ్ కోర్స్ జగన్ ఏమి మాట్లాడలేరులే)..! సో.., కేసీఆర్ తరహాలోనే మరో పెద్ద పెద్ద ప్రాంతీయ నేతల్ని బీజేపీపై ఉసిగొల్పి వ్యతిరేక గళాన్ని వినిపించాలనేది పీకే గట్టి వ్యూహం. జగన్ కోపంలో ఉన్న ఈ సమయంలోనే బీజేపీని జనం ముందు దోషిగా నిలబెడితే.. ఆ ఉప ఎన్నికల ఓటమి.. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి దోహదం చేస్తే.. ఇక ప్రధాని కుర్చీ కూడా పీకేయడం పెద్ద కష్టం కాబోదు..! అనే అతి తెలివైన వ్యూహంతో పీకే ద్వారా ఈ కేసీఆర్, ఈ కొడాలి గొంతులు లేస్తున్నాయి. పీకేకి దేశంలో జగన్, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జి లాంటి కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.. అతని చెప్పిందల్లా చేయడానికి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు.. ఇక చివరాఖరుగా… ఈరోజు జరిగిన నవీన్ పట్నాయక్, జగన్ భేటీలో కూడా ఈ అంశం చర్చకు రాకుండా ఉండదని అనుకోలేం.. అతను కూడా ప్రాంతీయ రాజకీయ శక్తి..!

author avatar
Srinivas Manem

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?