డ్రగ్స్ కేసులో సీఎం కొడుకు..!? బీజేపీ చేతిలో పదునైన కత్తి..!!

Share

బీజేపీ అంటే అంతే ఎవర్నీ వదలదు..! వ్యూహం వేసి తొక్కేస్తుంది. అనుకుంటే అందలం ఎక్కేస్తుంది. బాణాలను వదుల్తుంది.., ఎక్కడోచోట.., ఏదో బాణానికి చిక్కి బలవ్వాల్సిందే..!! అందుకు కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మార్పులు ఉదాహరణలు..!! అటువంటి బీజేపీకి మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన కలిపి ట్విస్ట్ ఇచ్చాయి. మీతో పని లేదు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం అంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి కుర్చీ ఎక్కాయి. ఇప్పుడు ఆ కుర్చీ లాగేసి రాష్ట్రం బీజేపీకి చిక్కింది..!!

డ్రగ్స్ కేసులో సంచలన వాస్తవాలు..!!

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం కేసు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ప్రముఖులను చెమటలు కక్కిస్తుంది. సినీ, రాజకీయ పెద్దల పాత్రలు బయటకు వస్తున్నాయి. ముంబైలో ఈ కేసు దర్యాప్తులో శివసేన మూలాలు కూడా చిక్కుకునే వీలుంది అంటున్నారు. కేసు చుట్టూ తిరిగి, తిరిగి మహారాష్ట్ర సీఎం కుమారుడు ఆదిత్య థాక్రే వద్దకు వచ్చి ఆగిందట. ఆయనను కూడా సీబీఐ ప్రశ్నించే వీలుంది అంటూ పుకార్లు వస్తున్నాయి..!

ఇదిగో ఇదే పాయింటు, ఇదే ఆయుధం బీజేపీ చేతికి చిక్కనుంది. ఒకవేళ సీఎం కుమారుడి హస్తం ఉన్నట్టు నిర్ధారణ జరిగితే శివసేన పిలక, మెడ మొత్తం బీజేపీకి దొరికేసినట్టే. అప్పుడు ఆ ఆట మొదలవుతుంది. ఇది మొత్తం చుసిన శివసేన కూడా సైలెంట్ గా ఉండదుగా. ఇవి చీప్ పాలిటిక్స్ అంటూ కొట్టి పారేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఎంతటి విచారణకు అయినా సిద్ధం అంటూ చెప్పుకొస్తున్నారు.

ప్రాధమికంగా కొన్ని చర్చలు మొదలు..!!

బీజేపీ గురి పెడితే కనెక్ట్ అవ్వాల్సిందే. అది కర్ణాటక అయినా, మధ్యప్రదేశ్ అయినా… మహారాష్ట్ర అయినా లొంగాల్సిందే. అందుకే అందరి కంటే ఎక్కువ స్థానాలు వచ్చినా మహారాష్ట్రలో పెత్తనం దూరమయింది. ఈ పరాభవం బీజేపీకి అసలు నచ్చట్లేదు. అంతకు ముందు తమతో దోస్తీ కట్టిన శివసేన హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడం అప్పట్లో బీజేపీకి బాగా మండింది. అప్పటి నుండి అదను కోసం చూస్తుంది. అందుకే ఈ కేసు తెరపైకి వచ్చాక చర్చలు మొదలయ్యాయి. ముందుగా ఈ సంకీర్ణ కూటమి నుండి ఎన్సీపీని దూరం చేయడం లక్ష్యం. వారిని మహారాష్ట్రలో తమతో కలుపుకుని శరద్ పవార్ కి కేంద్ర మంత్రి పదవి లేదా.., కోరిన రాష్ట్రంలో గవర్నర్ ఇస్తారనేది సారాంశం. అలా… మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, శివసేనకు చుక్కలు చూపించి, కాంగ్రెస్ ని ఒంటరి చేయాలనేది అమిత్ షా బుర్రలో తట్టింది. దశలు, ఆధారాలు, కేసు పర్యవసానాలు చూసుకుని అమలుకు సన్నాహాలు మొదలు పెట్టనున్నారు. అదన్నమాట..!! బీజేపీ అంటే. ఇది వాజ్ పేయ్ నాటి శాంతికాముక బీజేపీ కాదు, అమిత్ షా నాటి హార్డ్ కోర్ అధికార దర్ప బీజేపీ..!!

 

 

 


Share

Related posts

AP CM YS Jagan: జగన్ బెయిల్ రద్దుపై సర్వత్రా ఉత్కంఠ..! నేడే సీబీఐ కోర్టు తీర్పు..!!

somaraju sharma

YS Jagan Sharmila: తండ్రి సమాధి వద్ద కలిసిన జగన్ – షర్మిల – విజయమ్మ :  ఒకేసారి ప్రార్ధనలు

somaraju sharma

పరిటాల రవి కుటుంబంలో విషాదం

Mahesh