NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Prakash Raj: ఏపీ పాలిటిక్స్ లోకి ప్రకాష్ రాజ్..!? జనసేన కోసం పవన్ తో చర్చలు..!?

Prakash Raj: Entry in Active Politics Through Janasena

Prakash Raj: మనకు మంచి నటుడిగానే తెలుసు.. కానీ ఆయనొక సిద్ధాంత వాది.., ఒక రాజకీయ నేత.. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన మొదటి నటుడు.. మా ఎన్నికల్లో ఓడిన ప్రకాష్ రాజ్ (Prakash Raj) గురించి చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.. అన్నిటికంటే ఇంటరెస్టింగ్ విషయం ఒకటి చక్కర్లు కొడుతోంది.. ఏపీ పాలిటిక్స్ (Andhra Pradesh Politics)లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సినీ వర్గాల (Telugu Cine Industry) నుండి సమాచారం అందుతుంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)తో చర్చలు కూడా జరుపుతున్నట్టు ఒక టాక్..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) (MAA Elections 2021) ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా వివిధ భాషల్లో విభిన్న తరహా పాత్రలు పోషించి జాతీయ నటుడుగా ఎన్నో అవార్డులు అందుకున్న ప్రకాశ్ రాజ్.. యువ నటుడు మంచు విష్ణు చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరిణామాన్ని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే గతవారమే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో పక్క మా ఎన్నికలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా ఎన్నికల కారణంగా ప్రకాశ్ రాజ్ ఈష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ తరుణంలో ప్రకాశ్ రాజ్ కు సంబంధించి కీలక పొలిటికల్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ప్రకాశ్ రాజ్ చేరనున్నారనీ, పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

Prakash Raj: Entry in Active Politics Through Janasena
Prakash Raj Entry in Active Politics Through Janasena

Prakash Raj: నాలుగేళ్లుగా యాక్టీవ్ పాలిటిక్స్ లో..!!

వాస్తవానికి ప్రకాశ్ రాజ్ కి రాజకీయాలు కొత్త కాదు. ఆయన 2017లోనే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. 2017 లో బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగింది. ఈ ఘటనపై జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. అయితే ఆయనకు కేవలం రెండున్నర శాతం ఓట్లు (28 వేలు) మాత్రమే వచ్చాయి. ఇంత దారుణమైన ఓటమిని ఆయన ఊహించలేదు. కనీసం రెండు స్థానంలో ఉంటాను, రెండు, లేదా మూడు లక్షల ఓట్లు వస్తాయని భావించారు. కానీ ఆయనకు 30వేల లోపు ఓట్లు మాత్రమే రావడంతో సైలెంట్ అయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి రెండవ స్థానంలో ఉన్నారు. దాంతో ఆయన రాజకీయాలు నప్పవు అని భావించి సైలెంట్ అయి సినిమాల్లోనే బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చి మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేశారు. మంచు విష్ణు ప్యానెల్ కు గట్టి పోటీనే ఇచ్చారు. ఉత్కంఠతను రేపిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ 106 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు.

Prakash Raj: Entry in Active Politics Through Janasena
Prakash Raj Entry in Active Politics Through Janasena

భావజాలం భిన్నమైనది కానీ..!?

ప్రకాశ్ రాజ్ లో రాజకీయ భావాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన స్పీచ్ గానీ సిద్ధాంతాలు, ఆశయాలు వామపక్ష భావజాలంకు దగ్గరగా ఉంటాయి. ఈయన భావజాలం, సిద్దాంతాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాగా కలుస్తాయి. ఒక్క బీజేపీ అనుకూల విషయంలో తప్ప. ప్రకాశ్ రాజ్ బీజేపీ సిద్ధాంతాలకు, మోడీకి వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ రాజకీయ నడకలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారు. త్వరలో అది జరిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రకాశ్ రాజ్ భావాలు కలవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో జనసేన ద్వారా ప్రకాశ్ రాజ్ రాజకీయంగా యాక్టివ్ కావాలని ఆలోచన చేస్తున్నారుట. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపిలో ప్రకాష్ రాజ్ కు మంచి ఫాలోయింగ్, మంచి పేరు  ఉండటంతో అటు ఎలాగూ బెంగళూరు రాజకీయాల్లో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఏపిలో యాక్టివ్ రోల్ పోషించాలని భావిస్తున్నారుట. మా ఎన్నికల్లో ప్రాంతీయతత్వం చూపించి ఓడించిన కారణంగా తన ఓటు హక్కును ఏపికి మార్పించుకుని జనసేనలో క్రియాశీలకంగా పని చేయాలన్నది ప్రకాశ్ రాజ్ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తరపున పోటీ చేయాలన్నది ప్రకాశ్ రాజ్ ఆలోచన. దీనికి సంబంధించి జనసేన ముఖ్యులతో చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవి అన్నీ ఓకే అయితే ప్రకాశ్ రాజ్ రానున్న ఆరు నెలల్లో జనసేన పార్టీలో చేరి క్రియాశీలక భూమికను పోషించనున్నారనిధి సినీ, రాజకీయ వర్గాల టాక్!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!