RaghuramakrishnamRaju Case: RRR కమీడియన్నా..!? హీరోనా..!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక విశ్లేషణ..!!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis
Share

RaghuramakrishnamRaju Case: రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని తిడుతుంటే కొన్ని వర్గాలు సంబరపడ్డాయి.. రఘురామకృష్ణంరాజు జగన్ ని కడిగేస్తుంటే.., నిలదీస్తుంటే కొన్ని మీడియా చానెళ్లు సంబరపడ్డాయి.. వైసీపీని టార్గెట్ చేస్తుంటే కొన్ని పార్టీలు పార్టీ చేసుకున్నాయి..! కానీ రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది వ్యవధిలో ఈ RRR వలన జగన్ కీ, వైసీపీ కి జరిగిన డ్యామేజీ ఎంత..!? ఆ పార్టీలకు కలిగిన ప్రయోజనం ఎంత..!? రఘురామకి పొందిన ఉపయోగం ఎంత..!? భవిష్యత్తులో ఏమైనా ఉందా..!? అనేది ఈ విశ్లేషణ ద్వారా లోతుగా తెలుసుకుందాం..!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis
RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

RaghuramakrishnamRaju Case:  ఆ ఆరోపణల్లో పస ఉందా..!?

“జగన్ రెడ్డి కాదు.. జగన్ పిచ్చోడు.. వైసీపీది గెలుపు కాదు.. ఆ పార్టీ లేదు. ఆ ఎమ్మెల్యేలు అవినీతి, ఆ మంత్రులు అసమ్మతి”.. అంటూ చాలా లోతైన/ ఘాటైన అంశాలు రఘురామా మాట్లాడారు. కానీ ఇవన్నీ నిరుపయోగమే. ఆయన హావభావాలు, ఆయన చేతలు.., ఆయన మాటలు.., ఆ మీసం తిప్పుడు అన్నీ ఒక స్క్రిప్ట్ ప్రకారం.. చెప్పారు తప్ప ప్రజలకు పనికొచ్చే పాయింట్లు పెద్దగా డిస్కస్ చేయలేదు. ఆయన పెట్టిన 100 ప్రెస్ మీట్లలో 90 ప్రెస్ మీట్లు వృథా.. కేవలం ఓ పది ప్రెస్ మీట్లలో మాత్రమే సీరియస్, జనాన్ని ప్రభావితం చేసేలా.., వైసిపికి డ్యామేజీ జరిగేలా మాట్లాడారు. కానీ అటువంటివి కొనసాగించకుండా మళ్ళీ తర్వాత రోజున వేరే టాపిక్ చెప్పేవారు. అందుకే ఆయన ఒక “టైం పాస్” పొలిటికల్ డ్రామాగా మారిపోయారు. న్యూట్రల్ వర్గాలు కూడా ఆయనను సీరియస్ గా తీసుకోలేదు. పసలేని ఆరోపణలు, అర్ధం లేని మాటలు.., నిరాధార గళంతో ఆయన ఒక నమ్మకం కోల్పోయారు… కానీ ఇక్కడే ఓ ట్విష్టు ఉంది..!!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis
RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

కమెడియన్ ని హీరోని చేసిన ఘనత వైసీపీదే..!

ఆయన మాటలు నవ్వుకి తప్ప.., కొన్ని మీడియాల్లో ప్రసారానికి తప్ప ఏ మాత్రం పనికి రాలేదు. ఆయన రానురాను సహనం కోల్పోయి మరీ కామెడీ పీస్ గా తయారయ్యారు. మీసం తిప్పుడు, హెచ్చరికలు, పనికిమాలిన సబ్జెక్టు లతో విసిగించారు. ఆ రచ్చబండకు ఆదరణ తగ్గింది.. సరిగ్గా అటువంటి దశలో వైసిపి ప్రభుత్వం ఎందుకో రఘురామపై కన్నేసింది. అరెస్టు చేసింది. “సరే తప్పు చేసారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కాబట్టి అరెస్టు చేసింది” అనుకోవచ్చు. కానీ పోలీసులు సరిగా డీల్ చేయలేదు. ఉల్లంఘనలు చాలానే చేశారు. పోలీసుల తీరు కారణంగా కేసు వ్యవహారం ఢిల్లీ వరకు.., సుప్రీమ్ వరకు.., పార్లమెంటు పెద్దల వరకు.. వెళ్ళింది. ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది. కోర్టు ధిక్కరణ.., కస్టడీలో కొట్టారని ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. సో.. పోలీసులు, వారిని నడిపించిన ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనిపించింది. అలా ఆ కమేడియన్ ని హీరోగా మార్చేశారు.
* హీరోగా ఎందుకు మార్చారు అనే అనుమానం రావచ్చు. రఘురామాకి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఒక ప్రత్యేక పొలిటికల్ బ్రాండ్ ఇమేజి ఏర్పడింది. ఒక ఎంపీని పోలీసులు కొట్టారు అని నిరూపితమైతే.. పార్లమెంటులో కూడా ఒక ప్రత్యేక ఇమేజి వస్తుంది. చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అలా ఆయనపై సానుభూతి రావచ్చు. కొన్ని వర్గాల్లో పొలిటికల్ హీరోయిజం బిల్డప్ పెరగొచ్చు.. దీనికి కారణం మాత్రం పోలీసుల వ్యవహారశైలి మాత్రం. “మాంసం తిన్న తర్వాత ఎముకలు మేడలో వేసుకుంటే.. వాటి కోసం కుక్కలు వెంటాడతాయి, పీక్కుతింటాయి” సైలెంట్ వ్యవహారాల్ని వైలెంట్ గా డీల్ చేస్తే గత ఏడాది డాక్టర్ సుధాకర్ అంశం.. ఇప్పుడు రఘురామా అంశం.. పాఠాలే..!!
(అన్నిటి కంటే పెద్ద ట్విస్టు ఏమిటంటే.. పొలిటికల్ హీరోయిజం అంటూ ఒకవేళ ఒక బ్రాండ్ క్రియేట్ అయినా.. సానుభూతి వచ్చినా దాన్ని రఘురామా నిలబెట్టుకోలేరు. ఎందుకా అనేది వచ్చే కథనంలో చూద్దాం..!)


Share

Related posts

Huzurabad By Poll: రేవంత్ కీలక నిర్ణయాలు..! నేతలకు బాధ్యతలు అప్పగింత..!!

somaraju sharma

నీహారిక పెళ్లి గురించి వైరల్ అవుతున్న నయా స్టోరీలు !

siddhu

AP BJP : లైవ్ డిబేట్ లో బీజేపీ నేత పై దాడి వెనుక ఉన్నది వాళ్లేనట..!

siddhu