NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Raghuramakrishnamraju Case: ఢిల్లీకి లేఖ ఒకరు/ చంపేస్తారని మరొకరు..! రఘురామ కుటుంబ కథ వెనుక ఓ పెద్ద తలకాయ..!?

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

Raghuramakrishnamraju Case: ఏపీలో రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత పరిణామాలు ఆసక్తి పుట్టిస్తున్నాయి.. రాజకీయం గిర్రున మలుపులు తిరుగుతుంది.. వైసీపీ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని తప్పులోకి నెట్టేసే ప్రయత్నాల్లో టీడీపీ.. వారి అనుకూల మీడియా ఉండగా.. రఘురాముని ఎలాగైనా ఇరికించే ప్రయత్నాల్లో వైసీపీ ప్రభుత్వం, మీడియా ఉంది.. ఇక్కడి వరకు ప్రతీ ఒక్కరూ ఊహించినవే.. కానీ అనూహ్యంగా తెరపైకి రఘురామా కొడుకు భరత్, భార్య రమాదేవి వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్కో తరహాలో ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారు.. రఘురామకృష్ణంరాజు జైల్లో ఉండగా… ఇంతగా పొలిటికల్ డ్రామానినడిపిస్తున్న ఈ కుటుంబం వెనుక ఎవరున్నారు..!? ఎవరు సలహాదారుడిగా ఉన్నారు..? అనేది ఓ పెద్ద చర్చకు దారితీస్తుంది..!

Raghuramakrishnamraju Case: Twists RRR Family Scenes
Raghuramakrishnamraju Case Twists RRR Family Scenes

Raghuramakrishnamraju Case: రెండూ సీసీఎస్ వ్యవహారాలే..!

నిన్న మధ్యాహ్నం రఘురామా కొడుకు భరత్ ఢిల్లీ హోమ్ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. “మా నాన్నని కొట్టారు. ఒక ఎంపీకి రక్షణ లేదు. ఏపీలో అరాచకంగా ఉంది. వెంటనే ఏపీ పోలీసులకు తగిన ఆదేశాలివ్వండి. నాన్న పరిస్థితి బాలేదు. కాళ్లపై బాగా కొట్టారు” అంటూ ఘాటుగా ఓ లేఖ రాశారు. వెంటనే మీడియాకు విడుదల చేశారు. అది సాయంత్రం వరకు వైరల్ గా మారింది. ఆ తర్వాత..
* రఘురామకృష్ణంరాజు భార్య రమాదేవి స్క్రీన్ పైకి వచ్చారు. “మా ఆయనను ఈ రోజు రాత్రి జైల్లో చంపేయడానికి ప్లాన్ వేశారు. కడప నుండి చాలా మంది రౌడీ మూకలు దిగారు. ఆయన ప్రాణాలకు ఎవరు రక్ష.. ఆయనకు ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత..?” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఈ డ్రామా బాగా పండింది. చాలా సేపు వేసిందే వేసి, వేసిందే వేసి ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే తిరుగుతుంది..!

Raghuramakrishnamraju Case: Twists RRR Family Scenes
Raghuramakrishnamraju Case Twists RRR Family Scenes

విషయాన్నీ తమవైపు తిప్పుకోగలిగారు..!!

మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టం. రఘురామకృష్ణంరాజు కుటుంబం వెనుక ఎవరో ఉన్నారు. రాజకీయాల్లో.. కుటుంబ కథ చిత్రాల్లో ఆరితేరిన ఓ పెద్ద తలకాయ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఆ ఒక్కరూ ఎవరు.. ఊహించడం సులువే. టీడీపీ అనుకూల మీడియాగా ఉంటూ.. రఘురామకి రోజూ స్క్రిప్ట్, లైవ్ లు అందిస్తున్న ఈ రెండు ఛానెళ్లలో ఓ పెద్ద ఇటువంటి కుటుంబ రాజకీయ కథలను నడిపించగల ఎక్స్పర్ట్. అందుకే.. ఆయన దర్శకత్వంలోనే ఈ లేఖ, ఆరోపణలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారాల ద్వారా ఫోకస్ తమవైపునకు తిప్పుకోగలిగారు. పోలీసులు ఏది చేసేస్తున్నారు.. జగన్ ప్రభుత్వం అన్యాయంగా ఇరికించేస్తుంది.. అనే పెద్ద వాదనని హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టులో కుట్ర, అన్యాయం, అక్రమం, కేసులు పక్కన పెడితే అరెస్టు అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతీ ఘటనా ఆసక్తిని కలిగిస్తుంది. ఇది మొత్తం పోలీసుల ప్రణాళికా వైఫల్యమే. అప్పట్లో గత ఏడాది డాక్టర్ సుధాకర్ కేసుని ఎలా డీల్ చేసి.. సంచలనం, వివాదాస్పదం చేశారో… ఈ కేసుని కూడా అంత వరకు లాక్కొస్తున్నట్టే కనిపిస్తుంది..!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju