NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

ఒకే ఒక్క సినిమా తో  రామ్ గోపాల్ వర్మ డబ్బు సంపాదన ఎంతో తెలుసా ?

రామ్ గోపాల్ వర్మ..! అక్కినేని నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన శివ తీసినప్పుడు అయినా లేదా స్వీటీ అనే ఒక హాట్ పాపతో నగ్నం అంటే ఒక బూతు లాంటి సినిమాలు తీసినప్పుడైనా ఆ పేరులో అదే సెన్సేషన్. వర్మ ట్వీట్ వేదవాక్కులుగా భావించే కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ అతని సొంతం. అతనికి లక్షలాది మంది శత్రువులు, ద్వేషించేవారు మరియు కించపరిచేవారు ఉంటారు కానీ ఎవరు అతని జీవితాన్ని కనీసం రవ్వంత కూడా ప్రభావితం చేసింది లేదు. అది వర్మ రేంజ్. మరి లాక్ డౌన్ సమయంలో తన కంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న వర్మ ఇప్పటికే వరుస సినిమాలతో థియేటర్స్ తో సంబంధం లేకుండా క్లైమాక్స్ మరియు నగ్నం అనే రెండు చిత్రాలను తీసి ప్రేక్షకుల మీదకు వదిలారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ వర్మ వీటివల్ల లాభం ఎంత వస్తుందో చూద్దాం

 

Ram Gopal Varma stopped from entering Vijayawada to promote his ...

ఒక్కరోజులోనే పెట్టుబడి, లాభం రెండూ వచ్చేసే….

పాపులర్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో రామ్ గోపాల్ వర్మ ఏడారిలో చేయించిన విన్యాసాలే క్లైమాక్స్ సినిమా. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారి శ్రేయాస్ ఈటీ మీడియా మరియు ఎటిటి యాప్ లో పే పర్ వ్యూ కింద ఒకసారి వీక్షించేందుకు వంద రూపాయలను రుసుము గా నిర్ణయించారు. అయితే చాలామంది ఈ సినిమాను ఎవరు చూస్తారు లే అని లైట్ తీసుకున్నారు కానీ వర్మ మాత్రం క్షణాల్లో లో రికార్డులు కొల్లగొట్టాడం మొదలు పెట్టేశాడు. చిత్రం విడుదలైన 24 గంటల లోపల లక్షా 70 వేల మంది క్లైమాక్స్ చిత్రాన్ని తలా 100 రూపాయలు వెచ్చించి చూడగా మొత్తం మీద ఈ చిత్రం వల్ల వర్మకి మొదటిరోజే దాదాపు రెండు కోట్ల రూపాయలు వచ్చింది. ఈ సినిమా కి అయిన ఖర్చు అటుఇటుగా 5-10 లక్షల లోపు అన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాకి మొత్తం మీద మూడు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.

 

Climax' teaser: Adult film star Mia Malkova raises the temperature ...

పెట్టుబడి వేలల్లో కొట్టింది కోట్లలో….

ఇక శ్రీ రాపాక తో వర్మ తీసిన నగ్నం చిత్రానికి అయిన ఖర్చు అక్షరాలా రెండు వేల రూపాయలు అని వర్మ వెల్లడించడం సంచలనం. ఈ చిత్రం మొదటి రోజే…. మొదటి రోజు కూడా కాదు కేవలం 12 గంటల లోపల 70 లక్షల వరకు వసూలు సాధించగా దీనికి కూడా పే పర్ వ్యూ పద్ధతిని అవలంబించారు. అయితే వర్మ ఈ చిత్రానికి అయిన ఖర్చుగా ఆ చిత్రంలో పనివాడి పాత్రలో నటించిన అతని ప్రయాణానికి అవసరమైన రెండు వేల రూపాయలు మాత్రమే అని చెప్పడం గమనార్హం. కెమెరా, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ మొత్తం తన ఆధ్వర్యంలోనే జరిగిందని దానికి పైసా కూడా తన ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదని చెప్తే అందరూ నోరెళ్లబెట్టారు. ఇలా రెండు వేల రూపాయలతో సినిమా తీసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఒక్క వర్మకే చెల్లింది.

Director Ram Gopal Varma Minting Money with Blue Pics & Movies!

ట్రైలర్ చూసేందుకు డబ్బులు ఏంది సామి..?

 

Pay and Watch 'POWERSTAR' Trailer - Gulte English | DailyHunt

ఇప్పుడు పవర్ స్టార్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ పైన సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని రీతిలో తొలిసారిగా ట్రైలర్ చూడడానికి కూడా టిక్కెట్ ను పెట్టబోతున్నాడు. నేను ఏం తీసినా జనాలు చూస్తారు అన్న ధైర్యమో.. లేKఅ కొంత మంది చూసిన తన పెట్టుబడి తిరిగి వస్తుందన్న ఆశో తెలియదుగానీ 50 రూపాయలు పెడితే తప్ప ఈ సినిమాట్రైలర్ చూడలేరని వర్మ చెబుతున్నాడు. సినిమాలు చూస్తారో లేదో అన్నది పక్కన పెడితే…. అయితే అతను పవర్ స్టార్ గురించి ఏం చెప్పబోతున్నాడా అని ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రజల్లో ఉంటుంది. దానికోసం కచ్చితంగా ట్రైలర్ చూస్తారు.. దానినే వర్మ క్యాష్ చేసుకోబోతున్నాడు. వర్మ ఈనెల 16పవర్ స్టార్ట్రైలర్ రిలీజ్ చేస్తుండగా…. జూలై 24న సినిమాని విడుదల చేయబోతున్నాం అని చెప్పాడు వర్మ. ఆ రోజు తొలిప్రేమ రిలీజ్ డేట్ కాబట్టి పవన్ ఫ్యాన్స్ అంతా ఆయనపై పీకల వరకు కోపంతో ఉన్నారు. అయితే అవేమీ పట్టించుకోని వర్మ చిత్రానికి మాత్రం కనీసం 200 రూపాయలు టిక్కెట్ గా విధించాలని ఫిక్సయ్యాడని టాక్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందా లేదా మరో వివాదం రేపుతుందా అన్నది వేచి చూడాలి కానీ వేలు, లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు కొల్లగొట్టడం అంటే రామ్ గోపాల్ వర్మకి తప్ప ఎవరికి సాధ్యం చెప్పండి.

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu