NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగనన్న మరో పిడుగు ; బడుగులకు దెబ్బ

 

మీకు రేషన్ కార్డు ఉందా..? సరుకులు తెచ్చుకున్నారా? ఇంకా లేదా ఐతే వెంటనే ఆ పని చేయండి… అసలు మీ రేషన్ కార్డు ఉందొ లేదో చూస్కోండి.. అదేంటి ఇప్పుడు నా రేషన్ కార్డు కోసం మీ గొడవ ఏంటీ అని మమ్మల్ని తిట్టుకోకండి…. ఎందుకంటే ఇక మీ రేషన్ కార్డు ఉండకపోవచ్చు…. ఇది జగన్ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం… అదేమిటి అంటే…

** ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ఇచ్చే సరకుల ధరలను భారీగా పెంచిన జగన్ సర్కారు పేదల పై మరో పిడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఏకంగా 8.44 లక్షల కార్డులను ఒకేసారి తొలగించింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త బియ్యం కార్డులపై నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 1 నుంచి గత నెలరోజుల్లో 8.44 లక్షల కార్డులను తొలగించారు.
** డిసెంబర్ నాటి రేషన్ సరకుల కోసం చౌక దుకాణాలకు వస్తున్నా లబ్ధిదారుల కార్డులు తీసేశారని … కార్డు క్యాన్సిల్ అయిన వారికి సరుకు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో అదేంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కొత బియ్యం కార్డుల ద్వారానే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. అయితే కొత్త కార్డులు లేనివారికి సరుకులు ఇవ్వకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కార్డు సాంకేతిక కారణాల వాళ్ళ రానివారికి సైతం కోట నిలిపేశారు. గతంలో సర్వేలో మీకు తర్వాత కార్డు వస్తున్నాడని చెప్పారని, మల్లి రాలేదని, ఇప్పుడు సరుకులు ఇవ్వకపోతే మాకు దిక్కెవరు అంటూ విజయవాడ భవానీపురానికి చెందిన ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది.

విపత్తు తగ్గక దెబ్బ

వాలంటీర్లు గతంలోనే కార్డులపై సర్వ్ నిర్వహించారు. అప్పట్లోనే కార్డులు ఏరివేస్తారనే ప్రచారం వచ్చింది. అయితే మధ్యలో కరోనా వచ్చి దాన్ని ఆలస్యం చేసింది . లాక్ డౌన్ సమయం నుంచి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం కావడంతో పాత రేషన్ కార్డుల ఆధారంగానే నవంబర్ నెలాఖరువరకు ఉచిత రేషన్ పంపిణీ చేసింది. ఈనెల నుంచి పాత రేషన్ కార్డాలను పక్కనబెట్టి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 52లక్షల 70వేల రేషన్ కార్డులుండగా.. వాటిలో 8లక్షల 44వేల కార్డులను వివిధ కారణాల వల్ల అధికారులు తొలగించారు. ప్రస్తుతం కార్డుల సంఖ్య ఒక కోటి 44లక్షల 26వేలకు తగ్గింది.

ఎందుకు అంటే ??

కార్డులు తొలగించడానికి ప్రధాన కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలకు పైగా ఆదాయం ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా సొంత కార్లు ఉన్నవారు, వ్యవసాయ భూములు కూడా ఎక్కువగా ఉన్నవారు, ఆదాయపన్నులు చెల్లిస్తున్నవారి కార్డులను తొలగించింది. కార్డులు రద్దయిన వారు తమ పూర్తి వివరాలును గ్రామ/వార్డు సచివాలయాల్లో సమర్పిస్తే మరోసారి పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రేషన్ పంపిణీలో ఉన్న నిబంధనల్ని కూడా ప్రభుత్వం మార్చేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రేషన్ తీసుకోవాలంటే వారికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వలంటీర్లు సరుకులు అందజేసిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వలంటీర్లు సర్వర్ లో ఎంటర్ చేసిన తర్వాతే సంబంధిత కుటుంబానికి సరుకులు అందినట్లు లెక్క.

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju