NewsOrbit
Featured బిగ్ స్టోరీ

“ముద్ర” వేయకుండా మధ్యలోనే ఎందుకంటే…! సంచలన నిజం ఇదీ

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి ఎందుకు బయటకు వచ్చేసారు…!
ఈ ఆకస్మిక లకు కారణం ఏంటి…?
ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి..??
ముద్రగడ వెనుక ఎవరున్నారు..? ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చారు..? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..! దీనిపై లోతుగా వెళ్తే ఆసక్తికర విషయాలు, పరిణామాలు బయటపడ్డాయి.

ఆ పార్టీల ఒత్తిళ్లే కారణమా…!

ముద్రగడ ఈ ఆకస్మిక నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికే అని అందరూ అనుకున్నారు. అదే ప్రచారం చేసారు. కానీ తెర వెనుక అనేకం జరిగాయి. ముద్రగడని అనేక ఒత్తిళ్లకు గురి చేసాయి. ఓ పార్టీ ఏకంగా ఆయన్ను ఇరుకున పెట్టె ప్రయత్నం చేసింది.

 

Kapu Community: Targetting for Higher Post..?
“టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసారు. ఆ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఆ ప్రభావం వైసీపీకి లాభం చేకూర్చింది. ఇప్పుడు అదే స్థాయిలో చేయండి. వైసిపిని దాడి చేస్తూ, ఇరుకున పెట్టండి. జగన్ పార్టీని చులకన చేయండి. తద్వారా మన సామజిక వర్గ ఓట్లపై ఆధారపడిన, మనం పార్టీకి మంచి ఊపు వస్తుంది. అప్పుడు టీడీపీ, వైసీపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయంపై నమ్మకం కలుగుతుంది. మీకు కేంద్రం నుండి కూడా అండ ఉంటుంది..” అంటూ ముద్రగడని ఓ పార్టీ ప్రతినిధులు సంప్రదించారట. ఒకరకంగా ఆయన అంగీకరించకపోవడంతో కొందరి చేత పనిగట్టుకుని బురద చెల్లించే ప్రయత్నం చేశారట. వీటిని గమనించిన ముద్రగడ “తన పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు” అనుకుని ఉద్యమం నుండి తప్పుకున్నారు అని రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతుంది.

నిజమే అలాగే చేయొచ్చుగా…!

ఇక్కడ అందరికీ అదే అనుమానం రావచ్చు. టీడీపీని ఇరుకున పెట్టినట్టే.., జగన్ ని కూడా ఇరుకున పెట్టవచ్చు కదా… జగన్ కూడా కాపులకు రిజర్వేషన్లు విషయంలో హామీ ఇవ్వడం లేదు కదా, జగన్ పై పోరాడడంలో తప్పు లేదు కదా..” అనే అనుమానాలు రావచ్చు. కానీ ముద్రగడ ఆలోచనలు వేరేగా ఉన్నాయట. కొద్దీ నెలలు చూసి, కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఇటువంటి స్పష్టమైన హామీ వచ్చేలా పోరాటం చేస్తే బాగుంటుందని చేర్చలు కూడా జరిపారట. ఈ లోగా ఓ పార్టీ రాయబేరాలు నడపడం.., తనను రాజకీయ పావుగా వాడుకోవడం.., తనపై విమర్శలకు దిగడంతో ముద్రగడ పూర్తిగా తప్పుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏ పోరాటం చేసిన రాజకీయంగా వాడుకునే పార్టీలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే కులమే రాజకీయం, రాజకీయమే కులం కాబట్టి.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju