NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

అటు రేవంత్ – ఇటు పవన్..! మధ్యలో రఘురామకృష్ణంరాజు..! ఏం లాజిక్ ఇదీ..!!

ఆయన బయటకు వస్తే… కుర్రాళ్ళు వేలాదిగా పోగవుతారు. ఈయన గారి అర్ధం లేని అరుపులకు, అనవసర ఆవేశాలకు… జనం జేజేలు కొడతారు. ఈలలు, గోలలు, కేరింతలు, ఫోటోలు అబ్బో.., ఆ హడావుడిని పోలీసులు అదుపు చేయలేరు..! కానీ ఆయన రెండు చోట్ల గెలవలేకపోయారు..!!

తెలంగాణాలో మరొకాయన బయటకు వస్తే అదే పరిస్థితి..! జనం బీభత్సంగా వస్తారు. ఈయన గారి ప్రాసలకు, ప్రసంగాలకు ముగ్దులవుతారు. నవ్వుతారు. వీడియోలు తీసి పంపించుకుంటారు. భలే మాట్లాడారు అంటారు. ప్రత్యర్ధులు కూడా జాగ్రత్తగా మాటలని వింటారు..! కానీ ఆయన తన సొంత ఇలాకాలో గెలవలేకపోయారు, తన సొంత ఎంపీ కోటాలో తన వాళ్ళని గెలిపించలేకపోయారు..!!
“దీజ్ బోత్ ఆర్ ఓన్లీ క్రౌడ్ పుల్లర్స్. నాట్ ఓట్ పుల్లర్స్” (కొన్ని వాక్యాలు ఇంగ్లీషులో చెప్తేనే సరిగ్గా ఎక్కుతాయని చెప్పాం)..! ఆ ఇద్దరూ జనాల్ని పోగేయగలరు తప్ప, జన చేత ఓట్లు వేయించలేరు అనేది పక్కా..!!

Revanth Reddy Pavan Kalyan

మాటలకు ఓట్లు రాలుతాయా..!? అలా రాలితే ఏపీలో పవన్ కి, తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏ నాడో రాలిపోవాలి. గెలిపించేయాలి. పైన చెప్పుకున్నది ఈ ఇద్దరి గురించే. మాటలకు నవ్వులు, చప్పట్లు, జేజేలు, వీడియోలు, సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తాయి తప్ప బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు రావు..! అలా మాటలకు ఓట్లు రాలుతాయి అనుకుంటే “చంద్రబాబుకి జీవితంలో ఓట్లు రాకూడదు. జగన్ కి కూడా ఏ మాత్రం రాకూడదు” చంద్రబాబు, జగన్ కి ఏ మాత్రం మాట్లాడడం రాదు.
* చెప్పిందే చెప్తూ.., ఉచ్చారణ సరిగా రాక.., ఏం మాట్లాడుతున్నారో అర్ధకాక.., తెలుగు పదాలను ఇలా కూడా అవతారా..? తెలుగు భాష ఇలా కూడా ఉంటుందా..? తెలుగులో ఇటువంటి పదాలు కూడా ఉన్నాయా..? అనే రీతిలో చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. కానీ చంద్రబాబుకి ఓట్లు వస్తాయి. 1995 , 1999 , 2014 లో కేవలం చంద్రబాబు వల్లనే ఆ పార్టీ గెలిచింది.
* మాటల్లో ఏ మాత్రం పస లేకుండా.., వెరైటీ భాషతో.., తెలుగు నుండి ఇంగ్లీషుకి.., ఇంగ్లీషు నుండి తెలుగుకి ఏదేదో మాట్లాడేస్తూ విచిత్ర హావభావాలతో.., చిరు నత్తితో, అనవసర ఒత్తులతో జగన్ ప్రసంగాలు ఉంటాయి. కానీ జగన్ ఒక బ్రాండ్. 2019 లో ఆయన గాలి దేశంలో పెద్ద సంచలనం.

cm jagan giving shock to mp raghuramakrsihna raju
cm jagan giving shock to mp raghuramakrsihna raju

రేవంత్ కి, రఘురామకృష్ణంరాజుకి ఓ పోలిక ఉంది..!!

రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడుతుంటారు. చిత్ర, విచిత్ర ఆరోపణలు చేస్తుంటారు. జనంలో, మీడియా ముందు రెచ్చిపోతారు. కానీ ఆ ఆరోపణలకు కట్టుబడి ఉండరు. వాటిని అక్కడి నుండి ముందుకు తీసుకెళ్లారు. తర్వాత రోజు మరో ఫ్రెష్ ఆరోపణతో రాజకీయం మొదలు పెడతారు. ప్రాస, యాస, పస ఉండే ఆయన మాటలు వినడానికి బాగుంటాయి. అందుకే జనం విపరీతంగా వస్తుంటారు. కానీ నిబద్ధత, నిలకడ, అర్ధం లేని ప్రసంగాలను ఎంటర్టైన్మెంట్ గానీ చూస్తారు తప్ప, ఓటేయాలని ఆలోచించరు..! అందుకే కెసిఆర్ కుటుంబానికి ప్రత్యామ్నాయం అనుకున్న రేవంత్… ఇక తన రాజకీయ ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది..!!

revanth reddy targets again cm kcr
revanth reddy targets again cm kcr

* సేమ్ ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా జనంలోకి వస్తే విపరీతంగా జనాలను పోగేయగలరు. ఆయనకు ఒక బ్రాండ్ ఏర్పడింది. ప్రాస, యాస, పస ఉంటాయి. కానీ ఆయన రాజకీయం ఏనాడో పోయింది. మళ్ళీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు.
* పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఈయన మాటల్లో పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల్లో భావాలుంటాయి. భావాల్లోని ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం ఈయన మాటల్లోకి వచ్చి అరుపులుగా మారుతుంది. మొదట నుండి ప్రసంగం విన్న జనం ఎక్కడ మొదలు పెట్టారు.., ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చెప్పారు..? అనేంతగా, అంత లోతుగా మాట్లాడతారు. కానీ ఓట్లు వేయరు. ఆ ఆవేశాన్ని, ఆ అరుపులకి అక్కడితో వదిలేస్తారు. అదే సమస్య. మనం ముందు నుండి చెప్పుకున్నట్టు “దీజ్ బోత్ ఆర్ ఓన్లీ క్రౌడ్ పుల్లర్స్. ఎంటర్టైనర్స్.. నాట్ ఓట్ పుల్లర్స్, నాట్ పొలిటికల్ పిల్లర్స్”..!!

author avatar
Srinivas Manem

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju