‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని జోనర్స్ లో కథలను కవర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. భారత దేశ దర్శకులలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వర్మ ఇప్పుడు విపరీతమైన డౌన్ ఫాల్ లో ఉన్నాడు అన్నది జగమెరిగిన వాస్తవం. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే వర్మ తన సినీ కెరీర్లో కొన్ని వందల సాంకేతిక నిపుణులను మరియు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అయితే ఎప్పుడూ కొత్తవారికి అవకాశం ఇస్తూ తన కొత్త కొత్త కథలకి మనం ఊహించని గెటప్ లతో కొత్త నటీనటులను ప్రవేశపెట్టే వర్మ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపుతున్నాయి. “రీసెంట్ టైం లో ఏ అమ్మాయి ని చూస్తే మీకు వావ్ అనిపించింది?” అని సదరు యాంకర్ వర్మని ప్రశ్నించింది. దానికి వర్మ, “చాలా మంది ఉన్నారు… అందులో నువ్వు కూడా ఒకరు, నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను“ అని కొంటెగా బదులిచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఇకపోతే ఆ వీడియో కంటే యాంకర్ ఫోటోలు ఇంకా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అరియానా అనే పేరు గల ఈ యాంకర్ యొక్క ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలోయర్స్ ఒక్కసారిగా పెరిగిపోగా రాంగోపాల్ వర్మను ‘పులిహోర పాపతో బాగానే కలిపావు కదా..’ అని అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు కుర్రకారు.
యాంకర్ గురించి కూడా చాలామంది “ఈ పిల్ల నాదే“ అంటూ మీమ్స్ వేశారు. ‘అల వైకుంఠ పురంలో‘ లో బన్నీ స్టైల్ లో “మేడం సార్ మేడమ్ అంతే…” అంటూ పొగిడేశారు. ఇకపోతే “టాలీవుడ్ కి నెక్స్ట్ హీరోయిన్ గా బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము..” అంటూ ఎన్నో కామెంట్స్ చేశారు. ఆమె అందానికి ఫిదా అయిపోయారు మన కుర్రాలంతా. ఇక దీనంతటికీ క్రెడిట్ కూడా మళ్లీ ఆర్జీవీకే దక్కుతుంది. ఇకపోతే అలా ట్రెండ్ అయినా మీమ్స్ లో బెస్ట్ వాటిపై లుక్కేద్దాం పదండి.
చివరిగా చెప్పేది ఏమిటంటే…..