Sangam Dairy: పాల గోల అప్పుడే ఆగదు.. సీఎం “ఆపరేషన్ కమ్మ డెయిరీ”లో కీలక అంశాలు..!!

Sangam Dairy: CM Operation Kamma Dairy Key Points
Share

Sangam Dairy: ఏపీలో పాల గోల అప్పుడే ఆగేలా లేదు. సీఎం జగన్ తలపెట్టిన “ఆపరేషన్ కమ్మ డెయిరీ”లో కీలక అంశాలున్నాయి. కోర్టులు చిన్న చిన్న మెలికలు పెట్టినా.., అమూల్ ద్వారా పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోయినా.. ఏపీలో పాల డెయిరీల ప్రక్షాళన చేయాలనే సీఎం జగన్ తలంపు ఎక్కడా ఆగే అవకాశాలు లేనట్టే..! ఇది జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గబ్బు పట్టిన అనేక వ్యవస్థల్లో సహకార పాల డెయిరీల వ్యవస్థ కూడా ఉంది. రైతుల నుండి పాలను సేకరించి ప్రభుత్వ పరంగా డెయిరీలను అభివృద్ధి చేయాల్సిన నాటి ప్రభుత్వం .. ప్రభుత్వ డెయిరీలను చంపేసి.. ప్రైవేటుగా తమ డెయిరీలను ప్రగతి మార్గంలో పెట్టుకున్నారు. ఇప్పుడు సీఎం జగన్ దాన్ని చేధించే క్రమంలో అమూల్ ని ప్రయోగించారు. అయితే ఆదిలోనే కొన్ని అవాంతరాలు మొదలయ్యాయి. అయితే ఇది ఇక్కడితో ఆగదు.. కొన్ని మూలాలున్నాయి..!

Sangam Dairy: CM Operation Kamma Dairy Key Points
Sangam Dairy: CM Operation Kamma Dairy Key Points

Sangam Dairy: హెరిటేజ్ ఎదుగుదల బాగా తెలుసు..!

హెరిటేజ్ డెయిరీ నారా వారి కుటుంబానిది. రాజకీయాల్లో, అధికారంలో ఉంటూ ఇటువంటి రైతు ఉత్పత్తుల వ్యాపారం కారణంగా విమర్శలు రావడంతో హెరిటేజ్ ఫ్రెష్ ని అయిదేళ్ల కిందట అమ్మేశారు. కానీ హెరిటేజ్ పాల డెయిరీ మాత్రం అలాగే ఉంది. ఇదే ఆ నారావారి కల్పవల్లి. రోజుకి సుమారుగా 18 లక్షల లీటర్లను సేకరిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం సహా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సేకరణ ఎక్కువగా ఉంది. 2014 లో చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత హెరిటేజ్ డెయిరీ పాల సేకరణ అమాంతం విస్తరించింది. ఇదే సమయంలో ప్రభుత్వ డెయిరీలు నాశనమయ్యాయి. “మదనపల్లి పాల ఉత్పత్తి దారుల సహకార డెయిరీ (మదనపల్లి డెయిరీ).., ప్రకాశం పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం” (ఒంగోలు డెయిరీ).. వంటి ఆరు డెయిరీలు 2014 – 2019 మధ్య కాలంలో నాశనమయ్యాయి. నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ఫలితం మూటగట్టుకున్నది కమ్మవారి చేతిలో ఉన్న ప్రైవేటు డెయిరీలు. దీనిలోనూ హెరిటేజ్ ది పెద్ద వాటా. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో సంఘం డెయిరీ పాత్ర ఉంది. ఈ వ్యవహారాలన్నీ సీఎం జగన్ కి బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే “తానూ అధికారంలోకి వస్తే డెయిరీల ప్రక్షాళన ఉంటుందని” చెప్పారు.

Sangam Dairy: CM Operation Kamma Dairy Key Points
Sangam Dairy: CM Operation Kamma Dairy Key Points

ఆపాలంటే అమూల్ మంత్రం..!!

టీడీపీ హయాంలో లబ్ది పొందిన డెయిరీలను ఆపాలంటే వాటికి వెళ్తున్న పాలు వేరే డెయిరీలకు వెళ్ళాలి. అందుకే అమూల్ ని రంగంలోకి దించారు. “గుజరాత్ రాష్ట్రంలో పుట్టి.. దేశం మొత్తం పేరొందిన అమూల్ కి రోజుకి 75 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్ధ్యం ఉంది. ఏపీలో కూడా కనీసం రోజుకి 15 లక్షల లీటర్లు అమూల్ కి మళ్లితే సీఎం జగన్ ఎంతో కొంత సక్సెస్ అయినట్టే. కానీ ఏపీలోకి అమూల్ అడుగుపెట్టి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కనీసం రోజుకి 3 లక్షల లీటర్లు కూడా సేకరణ జరగడం లేదు. హెరిటేజ్ సహా సంఘం, ఇతర డెయిరీలపై కమ్మ పెత్తనం తగ్గాలి.. వాళ్ళ అక్రమ వ్యాపారాలు కూలాలంటే “అమూల్ ఎదుగుదల” తప్పనిసరి. కానీ పాల ఉత్పత్తిలో ఆధిపత్యం ఆ సామాజికవర్గమే కావడంతో జగన్ లక్ష్యం నెరవేరడం లేదు. ఆయన కూడా అంత ఈజీగా వదిలే రకం కాదు. అందుకే ఈ పాల గోల ఇప్పట్లో ఆగదు..!


Share

Related posts

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

ఇప్పటి వరకు చేస్తున్న సినిమాలకంటే పదిరెట్లు గొప్ప అవకాశం అందుకున్న కీర్తి సురేష్..!

GRK

మోదీ ప్రభుత్వ వైఫల్యమే..డేటా ఆ మాటే చెబుతోంది!

Siva Prasad