NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హవ్వ సిగ్గుచేటు .. పవన్ ట్రాప్ లో పడ్డ నాయుడు గారు !

ఇప్పటివరకూ ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం పవన్ ను వాడుకున్నదే కానీ బాబు ద్వారా పవన్ కు పైసా లాభం చేకూరింది అయితే లేదు. పైగా బాబు తో దోస్తానా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో క్లియర్ గా కనిపించింది. పవన్ స్వయంకృతాపరాధాలు ఎన్ని ఉన్నా కూడా బాబు నే పవన్ ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణమన్నది జగమెరిగిన సత్యం. అయితే పవన్ అందుకు తగ్గట్టు ఇప్పుడు బాబు పైనే పన్నాగాలు పన్నుతున్నారు. అందులోనూ విచిత్రంగా బాబు పవన్ వేసిన ట్రాప్ లోనే పడడం గమనార్హం.

 

అంత సీరియస్ గా తీసుకోవాలా…

పవన్ కళ్యాణ్ రాజధాని విషయమై తన అజెండా తెలిపేందుకు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యేలు మరియు టిడిపి ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని… కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన వారంతా ఆ ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి దానికి బాధ్యతగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడమే సమంజసమని పవన్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగానే మూడు రాజధానులు విషయంలో జగన్ తన పంతం నెగ్గించుకున్నారు కాబట్టి లీడర్లు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నట్లు పవన్ మాట్లాడితే అధికార పార్టీ నేతలు అసలు అతనిని పట్టించుకోలేదు కానీ బాబు మాత్రం ఏదో పవన్ తన పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు 48 గంటల్లో జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజీనామాలే జరుగుతాయని మాట్లాడినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అసలు రాజీనామా అంశం బాబు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కూడా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం అన్నది వారి మాట..

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా

వైసీపీ నేతలు లాగా పవన్ మాటలను పట్టించుకోకపోతే బాబు కి ఏమీ నష్టం ఉండేది కాదు అయితే ఇప్పుడు ఎలాగు జగన్ మొండిగా ఈ విషయంలో ఎలాగూ వెనక్కి తగ్గడు కాబట్టి బాబు మాట ఇచ్చినట్లు రాజీనామాలు చేయవలసి వస్తుంది. అయితే ఇప్పటికే అమరావతి ప్రజలు బాబు పై రగిలిపోయి ఉన్నారు. మళ్లీ అతని ఎమ్మెల్యేలను శాసనసభకు పంపిస్తే తమకు న్యాయం చేకూరుతుందని ఆశ వారికి ఏ కోశానా లేదు. ఇలాంటి సమయంలో బాబు మాట్లాడిన మాటలు సొంత ఎమ్మెల్యేలకే అసహనం వ్యక్తం చేశాయి.

అదే జరిగితే పవన్ సూపర్ హ్యాపీ….

సరే… బాబు ఇక తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాడు అనే అనుకుందాం. దీనివల్ల పవన్ కు లాభం ఏమిటి…? రాజీనామాల పై ప్రకటన వచ్చిన వెంటనే అమరావతి కి వెళ్ళి ఆ ప్రజలకు భరోసా కల్పించడమే పవన్ ప్రధాన టార్గెట్. ఎలాగా వైసిపి, టిడిపి మీద పీకల దాకా కోపం తో ఉన్న ప్రజలు ఇక ప్రత్యామ్నాయంగా జనసేన-బిజెపి వైపుకే వస్తారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది వారికి చిన్న భరోసా ఇస్తే ఎగబడి మరీ జనసేన-బిజెపి లకు ఓట్లు వేస్తారు అన్నది పవన్ ప్లాన్. అందుకు అతను చేయాల్సిందల్లా అటు అధికార పార్టీ నేతల చేత లేదా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలను రాజీనామా చేయించడం. ఆ విషయంలో పవన్ సక్సెస్ అయితే అతనికి సగం ఓట్లు పోల్ అయినట్లే.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అమరావతి నేతలతో దీక్షలు చేపట్టించడం.. కరోనా నేపథ్యంలో తెలివిగా ఉద్యమాలు చేయించి మరలా వారికి దగ్గర కావడం వంటివి చేయకుండా…. పవన్ ట్రాప్ లో పడడం ఏమిటో టిడిపి వర్గాలకు అర్థం కావడం లేదు. పవన్ ఇలాగే దూసుకుపోతే రాబోయే రోజుల్లో టిడిపి మనుగడ రాష్ట్రంలో కొనసాగడం చాలా కష్టం అవుతుంది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?