NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Shane Warne: మునివేళ్లతో 75 డిగ్రీల బంతులు..! ప్రపంచ క్రికెట్ కి ఆ బంతులు బహుమతులు..!!

Shane Warne: Best Bowler No More.. Simple History

Shane Warne:  అది 1992.. ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఏలుతున్న రోజులు.. మెల్బోర్న్ లో జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్లో వెస్ట్ ఇండీస్ 358 పరుగులు చేస్తే గెలుపు ఖాయం.. బ్యాట్స్ మెన్లు ఫామ్ లో ఉండడంతో గెలుపు సులువే అనుకున్నారు.. కానీ వార్న్ అద్భుతం మొదలయింది ఈ టెస్టులోనే.. 23 ఓవర్లు వేసిన షేన్ వార్న్ 52 పరుగులు ఇచ్చి.. 7 వికెట్లు తీసుకున్నారు. తన జట్టుకి 139 పరుగుల విజయాన్ని అందించారు..!

* అది 1994 బ్రిస్బేన్.,. షేన్ వార్న్ అనే బౌలర్ ని ఇంగ్లాండ్ బ్యాట్సన్ మాన్ ఎదుర్కోవడం అదే మొదటిసారి… సో ఇంగ్లీష్ బ్యాటింగ్ యోధులు కూడా లైట్ తీసుకున్నారు.. అక్కడ మొదలయింది వార్న్ వికెట్ల వేట.. ఆ టెస్టులో వార్న్ మునివేళ్ళ బంతులు మొదలయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసిన వార్న్.., ఆ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీసి.. తమ టీమ్ కి 184 పరుగుల విజయాన్ని అందించాడు.. ఆ దెబ్బతో ప్రపంచ క్రికెట్ వార్న్ ని చూడడం మొదలు పెట్టింది..!

* ఇక ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రపంచంలోనే అన్ని జట్లకీ తన గింగిరాలు బంతులను రుచి చూపించాడు. ప్రపంచం మొత్తం మీద క్రికెట్ ఆడే అన్ని దేశాలపై తన ప్రతాపం చూపించాడు. ఎక్కువగా ఇంగ్లాండ్ కి బంతితోనే చుక్కలు చూపించాడు. మొత్తం తన టెస్టు క్రికెట్ జీవితంలో 6785 ఓవర్లు వేసి.. 708 వికెట్లు తీసుకున్నాడు..!

Shane Warne: Best Story
Shane Warne Best Story

క్రికెట్ లో బ్యాట్స్ మాన్ అంటే బౌలర్ వేసే బంతిని అంచనా వేసి ఆడతారు.. అలా అంచనాకు దొరకకుండా బంతులు వేసే అరుదైన బౌలర్లు ప్రపంచ క్రికెట్ లో తక్కువగానే ఉన్నారు. వారిలో మొదటి శ్రేణి బౌలర్ షేన్ వార్న్. ఒక బ్యాట్స్ మెన్ తాను ఎలా అవుటయ్యాడో.. ఆ బంతి ఎన్ని గింగిరాలు తిరిగిందో.., ఎన్ని డిగ్రీలు తిరిగిందో.. కూడా తేలియక కాసేపు అక్కడే మైదానంలో ఉంటూ ఆశ్చర్యంగా చూసి పెవిలియన్ కి చేరిన బ్యాట్స్ మెన్లు ఎందరో ఉన్నారు. వార్న్ తిప్పుడు అలా ఉండేది.. బంతిని 70, 75 డిగ్రీలు కూడా తిప్పిన సందర్భాలున్నాయి. కాలితో లెగ్ సైడ్ తోసెయ్యాలన్న బంతులు కూడా కాలుకి, బ్యాట్ కి దొరక్క వికెట్లని గిరటేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి..!

ప్రపంచ క్రికెట్ నివ్వెరపోయే వార్త ఇది.. ప్రపంచ అత్యుత్తమ లెగ్ స్పిన్ బౌలర్.. బంతిని మునివేళ్ళ మధ్య పెట్టి 75 డిగ్రీలు గింగిరాలు తప్పగల సమర్ధుడు షేన్ వార్న్ మరణించారు. 52 ఏళ్ళ వార్న్.. ఈరోజు సాయంత్రం గుండెపోటుకు గురై.. మరణించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 1992 నుండి 2007 వరకు క్రికెట్ ఆడారు. ఐపీఎల్ కూడా మొదటి రెండు సీజన్లు ఆడారు. మొత్తం 145 టెస్టులు, 194 వన్ డైలు ఆడిన వార్న్.. టెస్టుల్లో 708 వికెట్లు, వన్ దయాల్లో 293 వికెట్లు తీశారు..! సచిన్, లారా, ఆండీ ఫ్లవర్, వంటి క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజాలకు తన స్పిన్ తో చెమటలు పట్టించారు. చిన్న, మధ్యస్థ స్థాయి బ్యాట్స్ మెన్ అయితే వార్న్ తన స్పిన్ తో ఓ ఆట ఆడుకునే.

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju