Smart tv: స్మార్ట్ గా.. డిజిటల్ గా..! శాటిలైట్ చానెల్స్ డౌన్ స్ట్రీమింగేనా..?

Share

Smart tv: పారిస్ లో రోజుకో ఫ్యాషన్ మారినట్టు.. టెక్నాలజీ కూడా అలానే మారిపోతోంది. రేడియో, టీవీ, కంప్యూటర్, శాటిలైట్, మొబైల్.. ఇలా టెక్నాలజీ కేవలం రెండు దశాబ్దాల్లోనే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చేసింది. ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ తో ప్రపంచం మొత్తం ఇంట్లో ఉంటోంది. అదీ కేవలం రూ.399 ఖర్చుకే. క్రీడలు, వినోదం, సినిమా, వార్తలు, కామిక్స్, ఎడ్వంచర్.. ఇలా ఏదైనా కాలు బయటపెట్టకుండా.. ఇంట్లో టీవీల్లో ఉంటోంది. స్థాయిని బట్టి ప్లాన్ ఎంచుకుంటే.. మరింత ఎక్కువ వినోదం ఇంట్లోనే ఉంటోంది. జియో వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. మరి.. శాటిలైట్ చానెల్స్ పరిస్థితి ఏంటి..?

smart tv overcomes satellite channels

రెండు దశాబ్దాల్లోనే మార్పు..

25 ఏళ్ల క్రితం వరకూ కూడా.. సినిమా పాటలు చూడాలంటే వారానికో చిత్రలహరి, వార్తలు సాయంత్రం 7గంటలకు, రోజుకు రెండు సీరియల్స్ మాత్రమే. కానీ.. శాటిలైట్ విప్లవం మొదలయ్యాక గంటకో న్యూస్ బులెటిన్, రోజుకు రెండు సినిమాలు, ఎంటర్ టైన్మెంట్ వచ్చింది. ఆ తర్వాత భక్తి, స్పోర్ట్స్, వార్తలు, సినిమాలు, సీరియల్స్ కే ప్రత్యేక చానెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి..! ఇప్పుడు స్మార్ట్ విప్లవం వచ్చేసింది. గంటల నుంచి నిమిషాలు, సెకన్లలోకి టీవీల నుంచి అరచేతిలోని సెల్ ఫోన్లలోకి వచ్చేసింది ప్రపంచం. నిరంతరం వార్తలు, లైవ్ లు, సినిమాలు, గేమింగ్.. ఇలా ఏ వయసు వారికి కావల్సిన సమాచారం అంతా కూడా ఇప్పుడు ఫోన్ల లోనే.. స్మార్ట్ టీవీల్లోనే.. ఒక్క కనెక్షన్ తోనే.

ఇంట్లోనే స్మార్ట్ గా..

మరి.. శాటిలైట్ చానెల్స్ మనుగడ సాగిస్తాయా అంటే.. ప్రశ్నార్ధకమే. కొన్ని చానెల్స్ మినహా మిగిలనవన్నీ భారంగా నడుస్తున్నవే. వీటికి పార్టీలు, నేతల అండదండలు, కార్పొరేట్ ఫండ్స్ రూపంలో వెళ్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ మరింతగా విస్తృతమవడంతో న్యూస్ కోసం ఓ టైమ్, చానెల్సే చూడక్కరలేదు. ఖర్చు కూడా తక్కువ. ఒక గదిలో కూర్చుని న్యూస్ అప్డేట్ ఇచ్చేయొచ్చు. సినిమాలకూ ఓటీటీలు వచ్చేశాయి. ధియేటర్లో వందలు వేలు ఖర్చు లేకుండా ఇంట్లోనే కొత్తవి చూసేయొచ్చు. నార్మల్ టీవీని కూడా చిన్న డివైజ్ తో స్మార్ట్ టీవీగా మార్చేసుకోవచ్చు. కావల్సింది నెట్ కనెక్షన్. స్మార్ట్ గా టెక్నాలజీ ఇంత పెరిగిపోయాక రేడియో ప్రాభవం తగ్గిపోయినట్టు త్వరలోనే శాటిలైట్ చానెల్స్ హవా కూడా మాయమైపోతుందేమో..!

 


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

1 hour ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago