NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

స్పీకర్ × చంద్రబాబు : పాత పగలు బయటకు

 

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం పైన కళింగ సామజిక వర్గ నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం కు ఉన్న పాత పగలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని తన విచక్షణను కోల్పోతే చంద్రబాబు దానిని మరింత రెచ్చగొడుతున్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇది తమ్మినేని కి, చంద్రబాబుకు మధ్య ఉన్న పాత గొడవలన్నీ ఒకసారి గుర్తు చేస్తోంది.

తమ్మినేని సీతారాం ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నాయకుడు. తేదేపా ఆవిర్భావం నుంచి ఆయన ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు పోటీ చేశారు. అయిదు సార్లు గెలవగా నాలుగుసార్లు ఓడిపోయారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన తమ్మినేని రిజిస్ట్రేషన్లు స్టాంపులు, ఎక్సైజ్, మున్సిపల్ శాఖ వ్యవహారాలను పలుమార్లు చూశారు. రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేసిన తమ్మినేని సీతారాం 1994లో వైస్రాయి ఘటన సమయంలో చంద్రబాబు వెంట నిలిచారు. అయితే తర్వాత చంద్రబాబు తమ్మినేని తొక్కడం మొదలుపెట్టారు. దీంతో చంద్రబాబుకు తప్ప దేనికి అంత దూరం పెరుగుతూ వచ్చింది.

ఇంట్లోనే కుంపటి

తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు ఉండేది. తెదేపా ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్య నాయకుడు గా పేరున్న ఆయన, కింజారపు ఎర్రన్నాయుడు తో పోటీపడి మరీ రాజకీయాలు చేసేవారు. ఎర్రన్నాయుడు కళింగ సామాజిక వర్గం అయితే, తమ్మినేని అదే సామాజికవర్గం పరిధిలో గట్టిగా రాజకీయాలు చేసే వారు. ఎవరికివారు తమ సత్తా నిరూపించుకునేందుకు పోటీపడేవారు. శ్రీకాకుళం జిల్లాలో వీరు పోటీ ఆరోగ్యకర వాతావరణంలో చక్కగా సాగేది. అయితే తర్వాత కాలంలో ఎర్రన్నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు ప్రోత్సహించడంతో పాటు తమ్మినేని ని వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతోనే ఎర్రన్నాయుడు సహకారంతో తమ్మినేని సొంత మేనల్లుడు కూన రవికుమార్ నువ్వు ఎర్రన్నాయుడు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దీనికి చంద్రబాబు సహకారం ఉండేది. ఎంపీటీసీగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కోన రవి కుమార్ను ఎర్రన్నాయుడు గట్టిగా ప్రోత్సహించి ఆముదాలవలస టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించారు. ఎప్పటినుంచో ఆమదాలవలసలో పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాం కు ఇది రుచించలేదు. తన నియోజకవర్గ వ్యవహారాల్లో ఎర్రన్నాయుడు కల్పించుకోవడం ఎక్కువవడంతో పాటు దీనికి పార్టీ అధినేత చంద్రబాబు సహకారం ఉండడంతో తమ్మినేని దీనిపై పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోయింది. 2009లో తమ్మినేని ని పక్కన పెట్టి కూన రవికుమార్ కు ఆముదాలవలస టికెట్ ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైంది. దీంతో ఇంట్లోనే కుంపటి మొదలైంది. దీన్ని తట్టుకోలేక తమ్మినేని సీతారాం 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీని తర్వాత మళ్ళీ టిడిపి గడప తొక్కిన అక్కడ ఎంతో కాలం నిలువ లేక పోయారు. జగన్ పార్టీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆమదాలవలసలో సొంత మేనల్లుడు కూన రవికుమార్ చేతిలోనే సీతారాం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ సీతారామ మంచి మెజారిటీతో ఆమదాలవలస నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు.

అంతటికి బాబే కారణం

తమ్మినేని సీతారామ్ కు మొదటి నుంచి చంద్రబాబు వైఖరిపై కోపం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని వర్గాన్ని కావాలని చంద్రబాబు పెట్టారనేది ఆయన గాఢంగా విశ్వసిస్తారు. దీన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే చెప్పుకొచ్చారు. సొంత మేనల్లుడిని కావాలని తలపై ముసుగు కలిపి రాజకీయాల్లోకి తెచ్చారని, రాజకీయాల్లో పూర్తిగా జీరో వరకు తీసుకెళ్లారని చంద్రబాబు మీద తమ్మినేని కు పీకల వరకు ఉంది. కుటుంబ వ్యవహారాల్లో సైతం రాజకీయాలు రావడంతో తమ్మినేని సీతారాం ఒకానొక దశలో పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లారు. దీనిపై పలుమార్లు ఆయన రాజకీయ నాయకులను వాపోయారు.

అవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయా?

స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన ఉంటుంది. ఆయన మాటలు చేతలు ఎంతో శుభ్రంగా ఉండాలి. పదిమందికి స్ఫూర్తినిచ్చే లా ఉండాలి. అయితే తమ్మినేని సీతారాం విపక్షనేత చంద్రబాబు పై వ్యవహరించిన తీరు పట్ల సొంత పార్టీ నేతల్లోనే కాస్త అసహనం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు కావాలని మాటలతో రెచ్చగొట్టిన తమ్మినేని సంయమనంతో ఉండాల్సిందని, స్పీకర్ చైర్ లో ఉన్న వ్యక్తి కోపానికి అసహనానికి గురి కాకూడదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పాత విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్న తమ్మినేని సంయమనం కోల్పోయి ఉండవచ్చని, తమ్మినేని కావాలనే చంద్రబాబు అతని వర్గం కోపం తెప్పించి తద్వారా స్పీకర్ ఒక వైపు మాత్రమే ఆలోచిస్తున్నారని కోణంలో ప్రజల్లోకి ప్రాజెక్ట్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై తమ్మినేని పాత రాజకీయాలు కోపాలు వదిలి జెంటిల్ మెల్లగా భరిస్తూ స్పీకర్ కుర్చీకు వనిత తేనే ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

author avatar
Special Bureau

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju