NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కర్ణాటక రాజకీయాల రేంజ్ వేరు .. పరేషాన్ కూడా వేరు !

కర్ణాటకలో అధికారం చేతిలో ఉన్నపటికీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పెద్దగా సంతోషం లేదు. పార్టీలో ఇప్పటికీ తన మాటను లెక్క చేయడం లేదన్నది ఆయన భావన. మరో రెండున్నర ఏళ్లు అధికారంలో బిజెపి ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటికే అతనికి వ్యతిరేకంగా తన పార్టీలోనే మరో వర్గం తయారైంది. అది చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్నది ఆయన బాధ. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కర్ణాటక లో ఏం జరుగుతోంది?

 

YADYURAPPA CM POST IS ONLY THREE DAYS FESTIVAL - Globel Media News - News,Latest News,Movie News,World News

అన్నీ వారికేనా?

కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప గతంలో మాదిరిగా లేరు. ఇది ప్రాంతీయ బిజెపి లో వినిపిస్తున్న మాట. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యూరప్ప పార్టీ విధేయులకే అగ్రతాంబూలం ఇచ్చేవారు. అయితే ఈసారి మాత్రం అలా జరగడం లేదట. కష్టపడి పార్టీ జెండాలు మోసిన వారికి పదవులు దక్కడం లేదని విమర్శలు. ఇక ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోతున్నారని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు. మంత్రిపదవులు వారికే…. నామినేటెడ్ పోస్టులు వారికే. ఇది ఎడ్యూరప్ప ప్రధాన వైఫల్యంగా పార్టీ వారు భావిస్తున్నారు.

పరిస్థితులు అలాంటివి మరి

మరోవైపు వాదన ఏమిటంటే మనసుకు నచ్చకపోయినా యడ్యూరప్పకు అలా చేయడం తప్పడం లేదట. 14 నెలలు కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావడానికి కారణమైన వారికి పదవులు ఇవ్వకపోతే ఎలా అన్నది యడ్యూరప్ప ప్రశ్న. అందుకే ప్రాధాన్యత విషయంలో కొంచెం తమ పార్టీ వారికి సర్దుకోమని చెప్తున్నా వారు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఆయన ఇచ్చిన వివరణలు నచ్చకపోగా ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా యడ్యూరప్పని కట్టడి చేయాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. యడ్యూరప్ప ప్రభుత్వం వలసవాదులకు పెద్దపీట వేయడాన్ని బిజెపి నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

అసలైన వారే పక్కనెట్టారు

ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే…. తాజాగా మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకుంటున్న యడ్యూరప్పకు మనశ్శాంతి లేకుండా పోయింది. కొత్తగా ఆరుగురిని కేబినెట్ లోకి చేర్చుకోవాలి అనుకుంటున్నారు. అంతే కాకుండా వారిలో ముగ్గురు ఇప్పటికే నిర్ణయించగా మరో ముగ్గురి పేర్లను ఖరారు చేయాల్సి ఉం ఇకపోతే బిజెపి అధిష్టానం తెలివిగా ఎడ్యూరప్ప పరిస్థితిని గమనించి ఆ బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కి అప్పగించారు. సీఏమ్కి వ్యతిరేకంగా ఉన్న నేతలు కూడా సంతోష్ తో కలిసి మాట్లాడుతున్నారు. ఇది ఎడ్యూరప్ప వర్గానికి మింగుడుపడడం లేదు

పేరుకే ముఖ్యమంత్రి కానీ మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి వీలు లేదు. పార్టీ నేతలంతా సపోర్ట్ చేయడం లేదు. ఒకరిని బాధ పెట్టి మరొకరిని ఖుషీ చేయాల్సిన పరిస్థితి. దీంతో ఎడ్యూరప్ప ఫ్రస్ట్రేషన్ తీవ్రస్థాయికి చేరి పోయింది. ఒక కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని చరిత్ర ఎప్పటినుండో చెబుతోంది. కాబట్టి భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలలు, జాతీయ పార్టీలు ఈ కూటమి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలసిందే.. ఇదే ఎప్పటినుండో రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కూడాను.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk