NewsOrbit
Featured ట్రెండింగ్ బిగ్ స్టోరీ

Suez Canal : కాలువలో నౌక చిక్కుకుంది..! ప్రపంచం రోజుకి రూ. 70 వేల కోట్లు నష్టపోతోంది..!!

Suez Canal : World Losing 3000 Crores Every Hour

Suez Canal : వినడానికి ఆశ్చర్యంగా ఉందా…? కానీ నిజమే. ఓ కాలువలో ఓ బోటు చిక్కుకున్న కారణంగా.. ప్రపంచం గంటకి అక్షరాలా మూడు వేల కోట్లు నష్టపోతోంది. రోజుకి 70 వేల కోట్లు నష్టపోతోంది..! ఆ బోటు సాధారణ స్థితికి వచ్చి.. మళ్ళీ ఆ కాలువలో రాకపోకలు మొదలయ్యే వరకు ఈ నష్టం మనందరం భరిస్తూనే ఉండాలి..! ఆ కాలువ, ఆ బోటు విశేషాలు అలా ఉన్నాయి..!!

Suez Canal : World Losing 3000 Crores Every Hour
Suez Canal World Losing 3000 Crores Every Hour

సూయజ్ కాలువ (Suez Canal) అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈజిప్తులో ఉంది. మధ్యధరా సముద్రం – ఎర్ర సముద్రాలను కలిపే కాలువ ఇది. సుమారుగా 193 కిలీమీటర్ల పొడవు ఉండగా.., దీని వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. ఈ కాలువ ద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన వాణిజ్య రవాణా జరుగుతుంది. చమురు మొత్తం నౌకల ద్వారా రవాణా జరుగుతుంది. ఈ క్రమంలోనే సుమారుగా 200 మీటర్ల వెడల్పు, 400 మీటర్లు పొడవున్న భారీ చమురు నౌక (Ever Green) రెండు రోజుల కిందట ఈ కాలువలో ఇరుక్కుంది. కదలలేక, కాలువకు అడ్డుగా ఉండిపోయింది. దీంతో రవాణా మొత్తం నిలిచిపోయింది. మిగిలిన నౌకలు కూడా ఆగిపోయాయి. రెండు రోజుల నుండి నౌకల ద్వారా చమురు రవాణా లేకపోవడంతో ఇండియా సహా చైనా, నెదర్లాండ్స్, తదితర దేశాల్లో చమురు నిల్వలపై, ఆపై ధారాలపైనా ప్రభావం ఉండనుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నౌక కారణంగా ప్రపంచానికి సుమారుగా గంటకి రూ. 3 వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్ధిక వేత్తల అంచనా..!

Suez Canal : World Losing 3000 Crores Every Hour
Suez Canal World Losing 3000 Crores Every Hour

Suez Canal : తొలగించడానికి విఫలయత్నాలు..!!

ఈ భారీ నౌకలో సుమారుగా రెండు లక్షల టన్నుల చమురు ఉంటుంది. చైనా నుండి నెథర్లాండ్స్ వెళ్తుంది. దీన్ని అడ్డు తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ యంత్రాలతో కదపడం.., కింద ఉన్న మట్టి, ఇసుక తీసేసి నౌకాని కదిలించడం.., వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వీలు కాకుంటే చమురుని మొత్తం తోడి, నౌకాని ఖాళీ చేసి, తరలించాలని చూస్తున్నారు. ఈ లోగా మిగిలిన నౌకలు రవాణా ఆగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. చిన్న చైనా నౌకలు వస్తే పక్క నుండి వెళ్లవచ్చని.. ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆసియా, ఐరోపా దేశాల మధ్య చమురు రవాణా కోసం ఈ మార్గాన్ని ఎక్కువగా వాడుతుంటారు. రెండు సముద్రాల మధ్య ఈ కాలువ కలుపుతుంది. ఈ కాలువ దారి లేకుంటే చుట్టూ తిరిగి సుమారుగా 8900 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. కానీ… చైనా, ఇండియా వంటి కీలక దేశాలకు చమురు ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఇప్పుడు వస్తున్న నష్టాలు కూడా ఎక్కువగా ఈ రెండు దేశాలకే ఉంటాయని ఆర్ధిక వేత్తలు పేర్కొంటున్నారు. మరో 24 గంటల్లో నౌక తొలగించకపోతే దాదాపు లక్షన్నర కోట్లు నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అనూహ్యంగా చమురు ధరలు పెరిగినా ఈ దేశాల్లో ఆశ్చర్యం అవసరం లేదని హెచ్చరికలు వస్తున్నాయి..!!

author avatar
Srinivas Manem

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri