NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

దమ్మలపాటికి షాక్..! ఇదే కాదు, ఇంకోటి కూడా సిద్ధంగా ఉన్నట్టే..!?

అధికారం.., హోదా.. పెత్తనం.. దక్కితే జనాలనో, సమాజాన్నో ఉద్ధరించడానికి దృష్టి పెట్టాలి..! అది లేకపోతే తిరిగి నష్టం చేయకూడదు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశాయి..!? టీడీపీ హయాంలో నవ్యాంధ్ర నిర్మాణం పేరిట జరిగింది ఏమిటి..!? అమరావతిలో భూముల కొనుగోళ్లలో జరిగింది ఏమిటి..!? న్యాయవ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు.., పెద్దలు మాటున చేసిన భూ తతంగాలు రెండు నెలల కిందటే బయటకు వచ్చాయి. కానీ న్యాయవ్యవస్థలోని లోపాలతో ఇన్నాళ్లు దాచుకున్నారు, దాక్కున్నారు. ఇప్పుడు నిన్న సుప్రీమ్ అదేశాలతో దేశాన ఈ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.

dammalapati srinivasa rao

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి, ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పైన హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను సుప్రీమ్ కోర్ట్ నిలుపుదల చేసింది. అసలు విషయం లోకి వెళ్తే , అమరావతి లో భూ కుంభకోణం జరిగింది అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీని పైన పని చేసిన మంత్రుల ఉపసంఘం కూడా, ఆంధ్రా ప్రదేశ్ రాజధాని అమరావతి వద్ద రాబోతుంది అన్నే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉన్న కొంత మంది ప్రముఖులు, అక్రమంగా భూలావాదేవీలు చేసారు,ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడరు అన్నే విషయాన్ని మంత్రుల ఉపసంఘం ఆరోపించింది. దీనితో 13 మంది పైన విచారణను చేపట్టడానికి ఏసీబీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ ఐ ఆర్ లో ప్రధానంగా ఎన్. చంద్రబాబు నాయుడు పాలనలో ఎజిగా పనిచేసిన దమ్మలపాటి శ్రీనివాస్ తో సహా మరో 13మంది ఉన్నారు. ఆగష్టు 13, 2014 , డిసెంబర్ 9, 2014 మధ్య, శ్రీనివాస్ అతని సహచరులు బహుళ బినామిదార్లు, బంధువుల ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. భూములు కోర్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో లేదా లోపల వస్తాయని స్పష్టమైన ముందస్తు సమాచారంతోనే, విజయవాడ, గుంటూరులోని వివిధ మండలాల్లో భూమిని కొన్నారని ఈ ఎఫ్ ఐ ఆర్ కింద కేసు ఫైల్ చేసారు. ఉన్నత స్థానాల్లో ఉన్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కోర్ క్యాపిటల్ ప్రాంతం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని నిర్ణయించడానికి సంబంధించిన నిర్ణయాత్మక ప్రక్రియలో తమ ప్రమేయాన్ని సద్వినియోగం చేసుకున్నారని, అలాంటి వ్యక్తులు తమ కోసం భూములను కొనుగోలు చేశారని ఫిర్యాదులో ఆరోపించబడింది. బినామీదారులు, వారి కుటుంబ సభ్యులు,సహచరులు / పరిచయస్తుల ద్వారా రహస్యంగా ఉన్న మూలధన ప్రాంతం గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని పంచుకున్న తరువాత, తద్వారా తమను తాము సంపన్నం చేసుకుంటారు, ”అని ఎఫ్ఐఆర్ తెలిపింది. మొదట మూలధన ప్రణాళిక గురించి సమాచారాన్ని సేకరించడానికి తన ప్రభావాన్ని ఉపయోగించుకున్నాడు, ఆపై ప్రీమియం కోర్ క్యాపిటల్ రీజియన్‌లో విస్తారమైన భూమిని కొనుగోలు చేశాడు అన్ని మాజీ అడ్వకేట్ జనరల్ పైన కేసు ఫైల్ చేసారు. ఈ కేసు పైన హై కోర్ట్ కి వెళ్ళారు శ్రీనివాస్, ఈ కేసు పైన విచారణను జరుపుతూ ఏపీ హై కోర్ట్ వింత వైఖరిని అవలంబించింది. ఆమరావతి మీద ఆరోపించబడ్తున్న భూ కుంభకోణం మీద విచారణను జరపకూడదు, అలాగే ఎక్కడ కూడా దీన్ని పైన చర్చించకూడదు, మీడియా లో కూడా ఎలాంటి వార్తలు రావడానికి వీలు లేదు అని ఆదేశాలు జారీ చేసింది.

latest news in news orbit

ఈ ఆదేశాలు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ లో సవాలు చేసింది. “నేరం జరిగిన దర్యాప్తు ఎలా నిలిపివేస్తారు అంటూ, ప్రభుత్వ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు, దమ్మలపాటి శ్రీనివాస్ కోర్ట్ ని ఆశ్రయిస్తే ఎఫ్ ఐ ఆర్ లో ఉన్న మిగితా 13 మీద విచారణ జరగకపోవడానికి కారణాలు, భారతీయ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 1 A ప్రకారం మీడియా కు భావ స్వేచ్ఛ ఉంటుంది అన్ని వీటి మీద ఎలా ఆంక్షలు విధిస్తారు అంటూ ఏపీ ప్రభుత్వ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీన్ని పైన వాదనలు వినిన సుప్రీమ్ కోర్ట్, విచారణ ఒకటే నిలిపివేయాలని, అయితే మీడియా లో దీన్ని గురించే వార్తలు ప్రచురించవచ్చు, చర్చించవచ్చు అన్ని ఈ కేసు పైన హై కోర్ట్ ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను కొట్టివేస్తునట్లు సుప్రీమ్ కోర్ట్ వెల్లడించింది. వార్తల పైన ఉన్న ఆంక్షలని ఎత్తి వేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి అన్ని దమ్మాలపాటి తో పాటు 13 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

అయితే సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చూస్తే, హై కోర్ట్ ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్( మీడియా లో దీనికి సంబంధించి వార్తలు ప్రచురించవద్దు) అన్నే దాన్ని పైన మాత్రమే సుప్రీమ్ కోర్ట్ హై కోర్ట్ కు భిన్నం గా స్పందించింది. కానీ, ఈ కేసు పైన విచారణను జరపాలి అన్నే ప్రభుత్వ నిర్ణయం పైన హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలనే యధాతధంగానే కొనసాగించింది. అయితే జనవరి లో జరగనున్న విచారణ అనంతరం సిట్ విచారణ కొనసాగుతుందా లేదా ప్రభుత్వం కోరినట్టు సిబిఐ విచారణకు మొగ్గు చూపుతుందా అనేది సందేహంగా మారింది. ఏది ఏమైనప్పటికి దమ్మన్నపాటి శ్రీనివాస్, ఆ బృందానికి ఎదురు దెబ్బె అని చెపుకోవచ్చు.

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk