NewsOrbit
Featured బిగ్ స్టోరీ

స్వర్ణ పాలస్ లో ఏం జరిగింది..? హీరో రామ్ ఎందుకు రియాక్ట్ అయ్యారు..??

విజయవాడ స్వర్ణ పాలస్ ప్రమాదం ఏపీలో ప్రకంపనలకు వేదికగా మారుతుందా..? రాజకీయ సంచలనాలకు.., కరోనా కార్పొరేట్ అవినీతి బహిర్గతానికి నాంది కానుందా…? అసలు స్వర్ణ పాలస్ ప్రమాదంలో ఏం జరిగింది..? అక్కడ కరోనా పేరిట జరిగిన వ్యాపారం ఏమిటి..? రమేష్ హాస్పిటల్ పాత్ర ఏంటి..? తాజాగా సినీ హీరో రామ్ ట్వీట్లు వెనుక అర్ధం ఏంటి..? అనేది పరిశీలిస్తే…!!

రామ్ ఏమని ట్వీట్ చేశారంటే..?

సినీ హీరో రామ్ పోతినేని తాజాగా ఈ అంశంపై స్పందించారు. కొన్ని సంచలన ట్వీట్లు చేసారు. సీఎం జగన్ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు. మొదటి ట్వీట్ లో “స్వర్ణ పాలస్ హోటల్ క్వరెంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రమాదం జరగడానికి మూడు వరాల ముందు నుండి ఆ హోటల్ క్వరెంటైన్ కేంద్రంగా ఉంది. కానీ ప్రమాదంపై ఎవర్ని టార్గెట్ చేస్తారు..? ఎవర్ని బ్లేమ్ చేస్తున్నారు..? అంటూ విచారణ తీరుని ప్రశ్నించారు. మరో ట్వీట్ లో “పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది…! సీఎంని తప్పుగా చూపించడానికి! జగన్ గారూ మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కి, మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతుంది. వాళ్ళ మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అంటూ ట్వీట్ చేసారు.

 

* ఈ ట్వీట్లు ఉద్దేశం చెప్పుకోవాలంటే స్వర్ణ పాలస్ ఘటనలో ప్రభుత్వమే తప్పు చేసింది. మొదటి ముద్దాయి ప్రభుత్వ అధికారులే. వాళ్ళే మూడు వారాలకు ముందు నుండి క్వరెంటైన్ కేంద్రంగా నడుపుతున్నారు. రమేష్ ఆసుపత్రికి నామమాత్రంగా ఏమి సంబంధం లేకపోయినా.., అధికారులు వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. విచారణ తప్పుదోవ పడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

నలుగురికి మాత్రమే పాజిటివ్.. మిగిలిన వారో..??

స్వర్ణ పాలస్ ఘటన జరిగినప్పటికీ ఆ హోటల్ లో 30 మంది ఉన్నారు. తాజాగా అధికారుల నివేదిక ప్రకారం వారిలో నలుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉంది. మిగిలిన 26 మందికి నెగిటివ్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో పేషేంట్ కి రోజుకి రూ. 2 వేలు ఖర్చు చేస్తుంటారు. అంటే ఈ 26 మందికి నెగిటివ్ ఉన్నప్పటికీ ఉంచారు అంటే ఈ అక్రమ ఆదాయం కోసమేనా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. 26 మందికి రోజుకి రెండు వేల చొప్పున రోజుకి కనీసం రూ. 54 వేలు అక్రమ ఆదాయం ఉంటుంది. దీనిలో ఎవరి పాత్ర ఏంటి అనేది తేలాల్సి ఉంది.

రమేష్ ఆసుపత్రి చుట్టూ బురద…!!

ఈ మొత్తం ఘటనలో కీలకంగా మారిన రమేష్ ఆసుపత్రి చుట్టూ అనేక వదంతులు, ఆరోపణలు, ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిలో ఏది వాస్తవం, అవాస్తవం అని తెలియనప్పటికీ… రమేష్ ఆసుపత్రి యాజమాన్యం అమరావతిలో భూముల కొనుగోళ్లు ద్వారా గతంలో నష్టపోయింది అనీ… ఆ నగదుని ఎలాగోలా రప్పించుకుని క్రమంలో కరోనాని విపరీతంగా వాడుకుంటూ అక్రమఆదాయం పొందుతుందని ప్రచారంలో ఉంది. కరోనా పేషేంటల్కు చికిత్స సందర్భంగా కూడా రమేష్ ఆసుపత్రి భారీగా ఫీజులు వసూలు చేసిందని కొన్ని పిర్యాదులు అందాయి. అయితే రమేష్ ఆసుపత్రి కంటే.., ఆ హోటల్ కంటే… దీనిలో ఆ జిల్లా అధికారుల పాత్ర అధికంగా ఉంది అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ తెలిసే అక్రమాలు జరగ్గా,.. ఇప్పుడు అధికారులు తప్పించుకుని కొందరిని ఇరికిస్తున్నారనేది వీరు వాదనగా ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju