Nara Lokesh: What is Internal Role in TDP Elections?
Andhra Pradesh Politics రాజకీయాల్లో అవినీతి సహజమే. అధికారంలో ఉన్న పార్టీలు కోట్లల్లో రాళ్లు వెనకేసుకుంటేనే మళ్ళీ ఎన్నికలకు, ఓడిపోయాక పార్టీ నడపడానికి ఉపయోగపడతాయి. చంద్రబాబు Chandrababu Naidu అయినా, జగన్ YS Jagan Mohan Reddy అయినా, పవన్ కళ్యాణ్ Pavan Kalyan అయినా, బీజేపీ అయినా సొంత డబ్బులతో పార్టీలు నడపరు. ఈ డబ్బుల వేటలో ఎవరి దారులు వారికి ఉంటాయ్. దీనిలో టీడీపీ Telugu Desam Party చంద్రబాబు బాట భిన్నంగా ఉంటుంది. టీడీపీ TDP అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది పార్టీలు మారిపోయారు. ఇలా మారినప్పుడు జరుగుతున్న కొన్ని అంతర్గత సంభాషణలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మాజీ మంత్రి పార్టీ మార్పు విషయంలో నారా లోకేష్ Nara Lokesh కేంద్రంగా టీడీపీలో TDP జరుగుతున్న ఓ అంతర్గత చర్చని చూద్దాం..!
ఆయన ఓ పెద్ద వ్యాపారి. రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఓ దేవస్థానానికి చైర్మన్ గా చేసారు. ఎమ్మెల్సీగా చేసారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచారు. దీంతో చంద్రబాబు కరుణించి మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసారు. అక్కడ వరకు బాగానే ఉంది..! కొన్ని నెలల కిందట ఆయన పార్టీ మారిపోయారు. టీడీపీ ని వదిలి వైసిపిలోకి జంపయ్యారు. దీంతో చంద్రబాబు, లోకేష్ లో కోపం కట్టలు తెంచుకుంది. సామాజికవర్గం అండ, ప్రజాబలం, రాజకీయ ప్రోద్బలం, వాక్చాతుర్యం.. ఇలా ఏమి లేని ఆ నాయకుడికి దేవస్థానం చైర్మన్, ఎమ్మెల్సీ, పొలిట్ బ్యూరో, మంత్రి అన్ని పదవులు ఇస్తే అధికారం కోల్పోయిన వెంటనే వెళ్ళిపోతారా..? అంటూ కొందరు సీనియర్ నేతల దగ్గర చంద్రబాబు మాట్లాడి బాధను వ్యక్తం చేశారట..!!
* ఈ విషయం ఆ మాజీ వద్దకి వెళ్తే.. “ఈ పదవులు అన్నీ నాకు ఊరికే ఇవ్వలేదు. ప్రతీసారి కప్పం కట్టించుకుని ఇచ్చారు. వందకి పైగా పార్టీకి నేను చెల్లించాను. ఆర్ధిక కష్టాల్లో పార్టీని ఆదుకున్నాను” అంటూ సమాధానం చెప్పారట.
* ఈ విషయం లోకేష్ దగ్గరకు వెళ్లగా.. ఆయన ఘాటుగా స్పందిస్తూ… “వంద ఇచ్చారు సరే.. కానీ మంత్రిగా వేయి వెనకేసుకున్నారు. మా దగ్గర లెక్కలు, అధరాలు ఉన్నాయి. బయటకు తీస్తాం” అంటూ సమాధానమిచ్చారట. దీంతో టీడీపీలో ఇదే పెద్ద చర్చగా మారింది.
* నాయకులు పార్టీలు మారడం, మళ్ళీ రావడం సాధారణమే..! కాకపోతే ఇక్కడ ఈ మాజీ విషయంలో మాత్రం ఇరువైపులా బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే నిజాలు మాట్లాడేసుకుంటున్నారు. ఈ వాయిస్ రికార్డ్స్ కొన్ని టీడీపీ కీలక సర్కిళ్లలో తిరుగుతున్నాయి. దీంతో రాజకీయంగా ఎన్ని అంతర్గత తతంగాలు జరిగినా ఇలా బయటకు వస్తాయా..? ఇలాగే వస్తే ఎంత మంది విషయంలో ఎన్ని చేతులు మారాయో..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..! ఇంతకు ఫైనల్ ట్విస్టు ఏమిటంటే.. సదరు మాజీ వైసిపిలో చేరినా సంతృప్తిగా లేరు. సరైన సమయం చూసుకుని టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమే అంటూ కొందరి దగ్గర వ్యాఖ్యానించారట. కానీ.. ఆయన వెళ్ళాక ముందే ఇలా ఆయన వ్యవహారంలో నానా యాగీ జరుగుతుంది..!!
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…