TDP vs Jr NTR: టీడీపీకి అసలు విలన్ ఎన్టీఆర్..! జూనియర్ టార్గెట్ 2029..!?

TDP vs Jr NTR: TDP Found Their Internal Villain
Share

TDP vs Jr NTR: పాపం తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సొంత మనుషులు.. సామాజిక మనుషులు అనుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీలోకి వెళ్లిపోయారు.. వెళ్ళినవాళ్ళు మామూలుగా ఉంటున్నారా..? అవకాశం దొరికినా, దొరక్కపోయినా టీడీపీని ఆడేసుకుంటున్నరూ.. టీడీపీని, చంద్రబాబుని, లోకేష్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. ఈ మొత్తం వ్యవహారంతో టీడీపీ వాళ్ళని పెద్దగా మాటల దాడి చేయలేదు. సొంత కులమనో.., సొంత మనుషులనో సుతిమెత్తగా డీల్ చేస్తుంది.. కానీ ఇప్పుడు వంశీ, నాని వెనుక ఉన్న వ్యక్తి టీడీపీలో ముసలం సృష్టిస్తున్నారు.. టీడీపీకి అసలు విలన్ జూనియర్ ఎన్టీఆర్ అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి..! కొన్ని ఘటనలు, కొన్ని మాటలు, ఎన్టీఆర్ తెరవెనుక వ్యూహాలు, అనుమానాలు చూస్తే…!

TDP vs Jr NTR: ఎన్టీఆర్ స్పందనపై అనేక అనుమానాలు..!!

మొన్న చంద్రబాబు ఏడుపు, ఆవేదన మొత్తం చూసాక.. అసెంబ్లీలో వైసీపీ వాళ్ల అన్న మాటల నేపథ్యంలో నందమూరి కుటుంబం మొత్తం కలిసి కట్టుగా రియాక్ట్ అయ్యారు. వాళ్లకు పాలిటిక్స్ తెలియవు కాబట్టి ఏ విధంగా స్పందించాలో అదే విధంగా స్పందించారు. వైసీపీ వాళ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వాళ్లకు హెచ్చరికలు చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ చూశారు. ఆయన తన మాటల్లో చంద్రబాబు పేరు గానీ భువనేశ్వరి పేరు గానీ టీడీపీ పార్టీ పేరును ప్రస్తావించలేదు. తమ కుటుంబం అన్న మాట కూడా ఎక్కడా రాలేదు. అంతే కాకుండా “కుటుంబం తరపున కాదు దేశంలో ఓ పౌరుడుగా తన స్పందన” అంటూ చెప్పుకొచ్చారు. అలానే జగన్మోహనరెడ్డి పేరుగానీ, వైసీపీ పార్టీ కానీ, ఆ ఎమ్మెల్యేల పేరు గానీ తన సెల్ఫీ వీడియోలో ప్రస్తావించలేదు..! ఇది కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. పోనీ రిస్కు ఎందుకు తీసుకుంటాడులే అని టీడీపీ వాళ్ళు అనుకుని సర్దిచెప్పకోవాలన్నా… “ఎన్టీఆర్ కి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఆ పార్టీ తరపున నిర్వహించిన యువగర్జనలో పాల్గొన్నారు.. కాబట్టి ఇప్పుడు ఆయన తనకు రాజకీయాలతో సంబంధం లేదు. తాను హీరోగానే కొనసాగుతాను అనడం కుదరదు..!” ఆయన్ను మొదటి నుండి భుజాన్న మోస్తున్న టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఆయన టీడీపీ వ్యక్తి అని, టీడీపీ వ్యవస్థాపకుడు మనుమడు అని తెలుసు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియోలో మా మామ, మా అత్త, మా పార్టీ అని ఎందుకు అనలేదు అన్నదే పెద్ద ప్రశ్న. దీనిపైనే చాలా మందిలో అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయాలను పక్కన పెడితే..

TDP vs Jr NTR: TDP Found Their Internal Villain
TDP vs Jr NTR: TDP Found Their Internal Villain

TDP vs Jr NTR: వంశీ, నానీలు ఎన్టీఆర్ మనుషులే..!

నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా లోకేష్ పుట్టక విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును, లోకేష్ ను చాలా దారుణంగా విమర్శించింది మొట్టమొదట గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అంతే కాకుండా చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైసీపీలో విమర్శించేది మంత్రి కొడాలి నాని. మిగిలిన ఏ మంత్రులు కొడాలి నాని వాడే భాషతో గానీ, వ్యక్తిగతంగా చంద్రబాబును విమర్శించింది లేదు. నాని ఒక్కరే ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ ఉంటారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలే ఎక్కువగా టీడీపీని, చంద్రబాబును, లోకేష్ ను ఘాటైన పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు. వీళ్లు ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. వాస్తవానికైతే జూనియర్ ఎన్టీఆర్ కు తెలియకుండా వీళ్ల రాజకీయ అడుగులు పడవు. వాళ్లతో జూనియర్ కు ఎంత సాన్నిహిత్యం ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు. ఇంట్లో మనుషుల్లా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని సంవత్సరాల నుండి టీడీపీకి అనుమానాలు ఉన్నాయి. కొడాలి నానిని వైసీపీలోకి పంపించింది జూనియర్ ఎన్టీఆర్ యేనని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఈ రోజు ఆనుమానాలు 50శాతం నిజం అయ్యాయి. ఇదే నూరు శాతం అయితే టీడీపీ రిస్క్ లో ఉన్నట్లే.

TDP vs Jr NTR: TDP Found Their Internal Villain
TDP vs Jr NTR: TDP Found Their Internal Villain

ఎన్టీఆర్ కి ఆ అవసరం లేకపోలేదు..!?

ఎన్టీఆర్ కు ఆవసరం ఏమిటి అనుమానాలు రావచ్చు. కచ్చితంగా ఉంటుంది.. తనకు ఆ పార్టీ అవసరం ఉంది.. ఆ పార్టీ తనదేనన్న ఫీలింగ్ ఉంది.. “ఆ పార్టీ తన తాత స్థాపించిన పార్టీ. ఆ పార్టీకి రాజకీయంగా నందమూరి బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ యే అసలైన వారసుడు. చంద్రబాబు నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. నందమూరి వారి అల్లుడు. ఎన్టీఆర్ కు అల్లుడు అయిన తరువాత ఆ పార్టీలో చేరి లక్ష్మీపార్వతి ఏపిసోడ్ నేపథ్యంలో ఆ పార్టీని ఎన్టీఆర్ నుండి లాక్కొని అధ్యక్షుడు అయ్యాడు చంద్రబాబు. ఇప్పుడు తాత పార్టీని తాను తీసుకోవాలని అనుకోవడంలో తప్పులేకపోవచ్చు. కానీ ఆ సమర్థత ఉండాలి. సమర్థత, ఆ అనుభవం
ఉన్నప్పుడు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నప్పుడు తీసుకోవాలి. కానీ ఇలా కొంత మంది తన సన్నిహితులను వేరే పార్టీలోకి పంపించి ఈ పార్టీని వీక్ చేసి, వీక్ అయిన తరువాత ఇంకా ఎవరూ లేనప్పుడు తాను తీసుకోవాలని అనుకోవడం మాత్రం తప్పు అవుతుంది. ఇలా జూనియర్ ఆలోచిస్తున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదీ కారణం అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది..! ఏది ఏమైనా ఎన్టీఆర్ స్పందన… వంశీ, నాని వెనుక ఎన్టీఆర్ ఉంటె మాత్రం టీడీపీ పెద్ద రిస్కుతో ఉన్నట్టే… మరో విషయం ఏమిటంటే టీడీపీ వీక్ అయితే ఎన్టీఆర్ ఆ పార్టీని తీసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే పార్టీ వీక్ కాకుండా ఆ పార్టీలోని నాయకత్వం చంద్రబాబు, లోకేష్ లను వీక్ కావాలి. అందుకే వ్యక్తిగతంగా వాళ్లను టార్గెట్ చేస్తున్నారు అన్న భావన కలుగుతోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్లు మాట్లాడుతున్న వైఖరి చూస్తుంటే టీడీపీలోని కొందరు నాయకులకు మాత్రం ఈ అనుమానం ఉంది..!


Share

Related posts

హస్తంకు హ్యాండ్ ఇచ్చి కారెక్కనున్న అజర్ ?

somaraju sharma

Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?

sridhar

YS Jagan: జగన్ షిమ్లా టూర్ విహారమా..? కీలక ఒప్పందమా..!? ఫ్యామిలీ టూర్ టాప్ సీక్రెట్లు..!!

Srinivas Manem