NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Politics: కేసీఆర్ పై యుద్ధానికి మూడు మార్గాలు..! పక్కా ప్రణాళికతో ఈటల అడుగులు..!!

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ వేడి వేడిగానే ఉంది. నెల రోజుల కిందట మంత్రి పదవి నుండి బహిష్కరణకు గురైన ఈటల గడిచిన నెల రోజుల నుండి ప్రణాళికాబద్ధంగా వ్యూహాలు వేశారు. కేసీఆర్ పై యుద్ధానికి.. టీఆరెస్ ని దించడానికి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఈరోజు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనేది ఈటల అతి పెద్ద లక్ష్యం. దీనిలో భాగంగా కేసీఆర్ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుడుతూనే తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. అందుకు మూడు దశల్లో మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనున్నారు..

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Telangana Politics Eetala Rajendar New Plans against KCR Team

Telangana Politics: ఎమ్మెల్యేగా భార్యని పోటీలోకి..!?

ఈటల రాజేందర్ ఈరోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజురాబాద్ నుండి వరుసగా అయిదుసార్లు గెలిచినా రాజేందర్ కి అక్కడి నుండి పోటీ చేసి గెలవడం పెద్ద కష్టమేమి కాదు. టీఆరెస్ మోసం చేసిందన్న సానుభూతితో ఆధిక్యత కూడా సాధించుకోగలరు. కానీ తాను కాకుండా తన భార్యని పోటీలో పెట్టి గెలిపించాలనేది ఈటల మొదటి వ్యూహం. బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ తో హుజురాబాద్ లో తన భార్య గెలిస్తే టీఆరెస్ పై ఈటల సగం పై చేయి సాధించినట్టే. కేసీఆర్ తో సవాల్ లో నెగ్గినట్టే..

* ఆ తర్వాత దశలో తాను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావాలని అనుకుంటున్నారు. బీజేపీలో చేరి రాజ్యసభ సీటు తీసుకుని, తద్వారా కేంద్రమంత్రి కావాలనేది ఈటల వ్యూహం. తెలంగాణాలో బలం పెంచుకునే క్రమంలో.. టీఆరెస్ పై పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఈటల లాంటివారి అవసరం బీజేపీకి చాలానే ఉంది. 2023 ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే టీఆరెస్ ని ఇప్పటి నుండి బలహీనం చేయాలి. ఆ పార్టీలో మొదటి నుండి కార్యకర్తగా, నాయకుడిగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రాజేందర్ తో బీజేపీకి చాలా పని ఉంది. అందుకే ఇటు ఈటల – అటు బీజేపీ ఒక ప్రాధమిక అంగీకారానికి వచ్చాయని సమాచారం. హుజురాబాద్ లో తన భార్య బీజేపీ జెండాతో గెలిచిన వెంటనే ఈటల కేంద్రం మంత్రి అవతారంలో కనిపించనున్నారు.

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Telangana Politics Eetala Rajendar New Plans against KCR Team

* హుజురాబాద్ లో టీఆరెస్ ని ఓడించడం మొదటి దశ.. తాను కేంద్రం మంత్రి కావడం రెండో దశ.. తెలంగాణాలో టీఆరెస్ వ్యతిరేకులను ఒకే వేదికపై తేవడం మూడోదశ. కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తితో రగిలిపోతున్న బలమైన నాయకులను కూడా బీజేపీలో చేర్చి.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా ఈటల అడుగులు పడుతున్నాయి. అయితే అనుకున్నంత ఈజీగా ఇవేం జరగవు. ఇవన్నీ ఎంత మేరకు జరుగుతాయనేది చూడాల్సి ఉంది..!

author avatar
Srinivas Manem

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?